మచిలీపట్నం సర్వస్వంపర్షియా ‘బందర్ అబ్బాస్’ ఓడరేవు నుండి మసులీపటాం సందర్శించిన ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి జాన్‍బాప్టిష్టా టెవెర్నియర్ ఓడ ప్రయాణం విశేషాలు (Tavernier Voyages)
‘‘నేను (టవర్నియర్) 1652, మే నెల 11వ తేదీన పర్షియా గంబ్రూన్ (బండర్ అబ్బాస్) రేవునుండి మసులీపటానికి తిరుగు ప్రయాణంలో ఉన్న గోల్కొండ రాజుకు చెందిన పెద్ద ఓడ ఎక్కాను. ఈ ఓడ ప్రతి సంవత్సరం మసులీపటాం నుండి మస్లిన్స్, రంగులిద్ది పూర్తిగా చేతితయారీ చింటెజ్‍గా పిలువబడిన రంగుకాలికోలు నింపుకొని పర్షియా వస్తుంది. మసులీపటాం తయారీ కేంద్రాలలో కొన్న ధరమీద పర్షియాలో అతి ఎక్కువధరకు ఈ బట్టలు అమ్ముడవుతాయి. తిరుగు ప్రయాణపు ఓడలో ఆరుగురు డచ్ వారు, …









