Day: March 1, 2026

న్యాయ పాలన తెలుగులో ఎప్పుడు

‘కమిటీ’ అనే పదానికి తెలుగుపదం కోసం ప్రయత్నించి సరైన పదం దొరక్క మానేసుకున్నాను’ అన్నారు ఓ మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి టి. వినోద్‍. ‘కమిటీ’ అనే వాడండి సర్‍ అన్నాను నేను. అదే పని చేశానని ఆయన అన్నారు.కొన్ని పదాలను తర్జుమా చేయకూడదు. అలాగే వాడితే బాగుంటుంది. అనువాదం అన్న పదం తర్జుమాకి బాగానే ఉంటుంది. అలాంటి సులువుగా అనువాదానికి లొంగే పదాలను వాడటం ఆమోదయోగ్యం. కానీ కొన్ని పదాలు తెలుగుదనాన్ని సంతరించుకుంటాయి. …

న్యాయ పాలన తెలుగులో ఎప్పుడు Read More »

జోడునామాల దుబ్బాక చరిత్ర

ఒక వూరికి ఒక పేరుంటుంది. కాని, రెండుపేర్లున్న రెండు గ్రామభాగాలున్న ఒక ఊరే దుబ్బాక. దుబ్బాక గ్రామ చరిత్ర చారిత్రాత్మకమైంది.దుబ్బాక సిద్దిపేట జిల్లా కేంద్రానికి 25 కి.మీ.ల దూరంలో ఉంటుంది. దుబ్బాక పూర్వపు తాలూకా కేంద్రం, ప్రస్తుతం మండల కేంద్రం. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం కూడా. ఈ గ్రామం 2013లో సమీపంలోని లచ్చపేట, ధర్మాజీ పేట, చేర్వాపూర్‍, చెల్లాపూర్‍, దుంపల పల్లి అనే 5 గ్రామాలను కలుపుతూ నగరపంచాయతీగా రూపాంతరం చెందినది. (తృతీయ శ్రేణి మున్సిపాలిటీ). కుమ్మరికుంట, …

జోడునామాల దుబ్బాక చరిత్ర Read More »

వనపఱితి భైరవప్రతిష్టశాసనం సవరింపు

మంతటిలో లభించిన ఒక శాసనం ఫోటోపంపి, చదువమని అడిగారు దేశపతి శ్రీనివాస్‍ గారు. హిమజ్వాలగారు తనకు పంపారట.నేను ఈ శాసనం గురించి ఎంక్వైరీ చేస్తూ మా కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధకసభ్యుడు బైరోజు శ్యామసుందర్‍ ను సంపద్రించినపుడు తాను కపిలవాయిగారి రచనల్లో వెతికి వివరాలు తెలిపారు.నాగర్‍ కర్నూలుకు 6కి.మీ.ల దూరంలోవున్న నారాయణకట్ట, వలపట్ల దారిలో ఇటికెలదారిలో మంతటి దగ్గర ఈదెమ్మగుట్ట (బయ్యన్నగుట్ట) మీద ఈ శాసనం, భైరవవిగ్రహం ఉన్నాయి. వలపట్ల వనపట్లగా మారిపోయింది. మఱ్ఱితాడు, మఱ్ఱితాటి నుంచి …

వనపఱితి భైరవప్రతిష్టశాసనం సవరింపు Read More »

ఐనవోలులో సాంప్రదాయ పునాదులపైకాకతీయ కీర్తి తోరణ నిర్మాణం

కాకతీయుల కాలము నాటి 800 సంవత్సరాలక్రితం చెక్కబడిన కీర్తి తోరణం శిలలను గుర్తించి, యేరి కూర్చి, ఒక దగ్గర చేర్చి, విరిగి పోయిన శిలలను అతికించి జత చేసి ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణములో ఉత్తర దిక్కున నాటి కాకతీయుల కాలములో నిర్మించిన విధముగా నిర్మాణము చేయటము జరిగింది.రాష్ట్ర పురావస్తు శాఖ సంరక్షణ విభాగము ఈ నిర్మాణ పక్రియను సిమెంట్‍ కాంక్రీట్‍ను వాడకుండా సాంప్రదాయ పద్ధతిలో ప్రకృతి సిద్ధమైన మెటీరియల్స్తో పునాదులను నిర్మించింది. సిమెంట్‍ …

ఐనవోలులో సాంప్రదాయ పునాదులపైకాకతీయ కీర్తి తోరణ నిర్మాణం Read More »

ప్రకృతి గమనం! 5 ప్రకృతి ధర్మం!!భూగోళం – అంతర్గత, బాహ్యకారకాలు!

చలనం ప్రకృతి ధర్మం! ప్రకృతిలో కేవలం సజీవులైన జంతువర్గమే చలిస్తుందనేది జీవశాస్త్ర పరిభాష! కాని, నిర్జీవులలో కూడా ఈ చలనం వుంటుందనేది భౌతిక, రసాయన శాస్త్ర నిరూపణలు. పదార్థం పరమాణవుల సమూహమని, ప్రతి పరమాణువులో ఒక కేంద్రకం వుంటుందని, ఇందులో ద్రవ్యరాశిని కలిగించే ప్రొటాన్లు, నూట్రాన్లు వుంటాయని, ఈ కేంద్రకం ఆధారంగా ఎలక్ట్రాన్లు భ్రమిస్తాయని మనమంతా రసాయన శాస్త్ర పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ విషయాలు మరింత అవగతం కావాలంటే, 19వ శతాబ్దపు ఆవిష్కరణల్ని విధిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా …

ప్రకృతి గమనం! 5 ప్రకృతి ధర్మం!!భూగోళం – అంతర్గత, బాహ్యకారకాలు! Read More »

పక్షి వైవిధ్యం – వ్యవసాయ మార్గనిర్దేశం

భారత వ్యవసాయానికి జన్మస్థలం అయిన పూసా (ప్రస్తుత బీహార్‍లోని సమస్తిపూర్‍ జిల్లా) 1784లో స్థాపించబడిన బ్రిటిష్‍-ప్రేరేపిత గుర్రపు స్టడ్‍ ఫామ్‍కు ప్రసిద్ధి చెందింది. ఆ కాలంలోని బ్రిటిష్‍ పరిశోధకులు సేకరించిన ఆధారాలు దాని అనుకూలమైన వాతావరణంతో పూసా యొక్క చారిత్రక ప్రాముఖ్యతను తెలియచేస్తాయి. ఇది, ఇతర అంశాలతో పాటు, ప్రధానంగా ఆకలి మరియు కరువు సవాళ్లను అధిగమించడానికి వ్యవసాయ పరిశోధనలకు పునాదులు వేసింది. జంతు జీవవైవిధ్యం, సహజ తెగులు నిర్వహణ మరియు వ్యవసాయ-జీవవైవిధ్యం యొక్క జ్ఞానం చాలా …

పక్షి వైవిధ్యం – వ్యవసాయ మార్గనిర్దేశం Read More »

యం.యస్‍. ఆచార్య

తెల్లవారుఝామున చదువరుల ఇంటిముందు పత్రికను ప్రతిరోజూ అందించేందుకు, కొన్ని గంటల దాకా సైకిల్‍ తొక్కుకోవలసిందే. ఎడిటర్‍ అయ్యే దాకా చిన్నప్పటినుంచే సైకిల్‍ తొక్కడమే జీవితం. నాన్నకు కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. కడుపు పట్టుకుని పక్క అరుగుమీద పడి నొప్పి ఆగేదాక నిలబడేది. నొప్పి తగ్గిన తరువాత కాస్సేపు సైకిల్‍ నడిపేది. నాన్నను తలుచుకోగానే నాకు కళ్లు పొంగేవి. ఆ పోరాటశీలి యం.యస్‍. ఆచార్య (మాడభూషి శ్రీనివాస ఆచార్య) 3 అక్టోబర్‍, 1924లో జన్మించారు.సాధారణంగా జయంతి, తరువాత …

యం.యస్‍. ఆచార్య Read More »

జియాలిజకల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా – జియాలజిస్టులు ఖనిజాన్వేషణకైట్రూ అడ్వెంచర్స్ ఆఫ్‍ జియాలజిస్ట్స్

జియోలాజికల్‍ ఇన్వెస్టిగేషన్స్ జరిపే సమయాలలో రకరకాల అడ్డంకులు, విపరీత పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితులను అధిగమించి ఖనిజాన్వేషణ జరిపి దేశప్రగతికి ఎనలేని సేవలు చేశారు, చేస్తూనే ఉన్నారు. పీరియాడిక్‍ టేబుల్‍లో ఎనభై శాతం మూలకాలు భూమిలోని శిలల నుండే వస్తాయి. ఈ మూలకాలు కలిగిన ఖనిజాలను జియాలజిస్టులు వారు తీసుకొనే రిస్కులు ఎన్నోసార్లు వారి జీవితాలను సైతం లెక్కచేయకుండా దేశప్రగతికోసం ఖనిజాన్వేషణ కొనసాగిస్తారు. ఎన్నో పరిశ్రమలకు ఈ ఖనిజాలు రా మెటీరియల్స్ గా ఉపయోగిస్తారు. దేశప్రగతిలో అత్యంత …

జియాలిజకల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా – జియాలజిస్టులు ఖనిజాన్వేషణకైట్రూ అడ్వెంచర్స్ ఆఫ్‍ జియాలజిస్ట్స్ Read More »

పరీక్షల సమయం

ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‍ నెలల్లో సాధారణంగా పాఠశాల విద్యార్థులు అయినా, కళాశాల విద్యార్థులు అయినా పరీక్షలు వ్రాయవలసిన సమయం. విద్యార్థులు ఆందోళన చెందుతూ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయం.గతంలోకంటే పిల్లలపై మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగింది. పిల్లలకంటే పిల్లల తల్లిదండ్రుల పై ఇంకా ఎక్కువ పెరిగింది. మావలే మా పిల్లల భవిష్యత్తు మారకూడదని, మేము చదవని చదువంతా మా పిల్లలు చదవాలని వారిపై తీవ్ర మానసిక ఒత్తిడిని తల్లిదండ్రులే పెంచుతున్నారు.బాగా చదివే (intelligent) విద్యార్థి కాని, సాధారణంగా చదివే …

పరీక్షల సమయం Read More »

పూటకూళ్ళవ్వ

(గత సంచిక తరువాయి)(జరిగిన కథ: ముంబై నుండి వచ్చిన రాజా రామ్మోహన్‍ రాయ్‍కి వారికి కేటాయించిన గది చూపించి విశ్రాంతి తీసుకొమ్మంటుంది అవ్వ. తెల్లవారి వ్యాయామం చేసుకుందామని బయటికి వచ్చిన రవి అక్కడ బోర్డు నిండా ఉన్న వాక్యాలను చూసి ఆశ్చర్యపోయి.. ఎవరు రాసారు అని ఆలోచనలో పడిపోతాడు.)ఇంతలో అవ్వ మరియు రాజా రామ్మోహన్‍ రాయ్‍ ఇద్దరు ఒకేసారి అక్కడికి చేరుకున్నారు.‘‘గుడ్‍ మార్నింగ్‍’’ అన్న పలకరింపు విని రవి రామ్మోహన్‍ గారి వైపు తిరిగాడు.‘‘మీరు!?’’ అంటూ ఆగిపోయాడు …

పూటకూళ్ళవ్వ Read More »