నల్గొండ జిల్లాలోని కాచరాజుపల్లి వద్ద రాగి నిక్షేపాలుఉన్నట్టు పరిశోధన ద్వారా నిర్ధారించచబడినది

నల్గొండ జిల్లాలోని కాచరాజుపల్లి ప్రాంతంలో కొన్ని రంగుల గుహలున్నట్టు ఆ ప్రాంత ప్రజల ద్వారా బిగ్‍ టి.వి. టీమ్‍కు తెలియచేయడంతో వారు వాటి ఫొటోలతో నన్ను కలవడం జరిగింది. అది చూసిన వెంటనే ఆ గుహలు న్యాచురల్‍గా ఏర్పడినవి కావని, అది ఒక పురాతన మైనింగ్‍ స్థలం మాదిరిగా కనబడుతున్నదని మరియు ఆ శిలలపైన ఆకుపచ్చ రంగు కోటింగ్‍ మాలకైటనే రాగి ఖనిజం అని చెప్పడం జరిగింది. సామాన్యంగా రాగి నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో ఇలాంటి మాలకైట్‍, అజురైట్‍ కోటింగ్స్ ఉంటాయి.

ఆ తరువాత నేను మా ఇద్దరు కొలీగ్స్ అందరం జి.ఎస్‍.ఐ రిటైర్డ్ డైరెక్టర్‍లు కలిసి ఈ గుహలున్న ప్రాంతానికి వెళ్లి పరిశోధన జరిపాము. అక్కడ స్టడీ చేసిన తరువాత అది ఒక పురాతన మైనింగ్‍ సైట్‍ అని తెల్సింది. ఇక్కడ మూడు లెవెల్స్లో అడిట్స్ వున్నవి, ఈ అడిట్స్ పది మీటర్ల ఎత్తు తేడాతో ఒకదానిపైన ఇంకోటి ఉన్నది. ఈ అడిట్స్ / గుహలు 500 మీటరు లోతు మరియు 15 మీటర్ల వెడల్పుగా వున్నవి.

ఇక్కడి శిలలపై విస్తృతంగా మాలకైట్‍ కోటింగ్‍, అక్కడక్కడా అజురైట్‍ ఉన్నది. ఈ రాగి ఖనిజాల కోటింగ్‍ N-Sట్రెండ్‍తో ఉన్న కార్ట్జ్‍ రీఫ్‍లో ఉన్నది. ఈ క్వార్ట్జ్‍ రీఫ్‍ రెండు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది N-S ఫ్రాక్చర్‍లో ఎంప్లేస్‍ అయ్యింది. ఇది గ్రానైట్‍ నైస్‍ మరియు క్వార్ట్జైట్‍ను కట్‍ చేస్తూ వెళ్తుంది.

ఇక్కడి నుండి శాంఫిల్స్ సేకరించి కెమికల్‍ అనాలసిస్‍ చేసిన తరువాత తేలినది ఏమనగా ఇక్కడ కాపర్‍ 2 నుండి 4 శాతం, లెడ్‍ (Pb) 57 నుండి 2026 PPm, జింక్‍ (Zn) 37 నుండి 77PPm, యురేనియం (U) 38 నుండి 200PPm, గోల్డ్ (Au) 1.40 నుండి 5.50 PPm, సిల్వర్‍ (Ag) 1.56 నుండి 3.90PPm ఉన్నట్టు నిర్ధారణ జరిగింది. ఈ డేటా ఆధారంగా ఒక రీసెర్చ్ పేపర్‍ని తయారు చేసి SGT (Society of Geoscientists and Allied Technologists) అనే జర్నల్‍లో ప్రచురించబడినది. ఈ ప్రాంతాన్ని డిటైల్డ్ జియోలాజికల్‍ ఎక్స్ప్లోరేషన్‍ జరపవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఒక పాలిమెటాలిక్‍ డిపాజిట్‍ కాగలదని సూచనలు కనిపిస్తున్నవి. దీనిని క్షుణ్ణంగా పరిశోధన జరపడానికి జి.ఎస్‍.ఐ.కి అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాము.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *