దాదాపూర్లోరాతియుగం ఆనవాళ్లుజొన్నబండపై నవీన శిలాయుగపు రాతి పనిముట్లు లభ్యం

వికారాబాద్‍ జిల్లాలో ఆదిమానవుల వలసకు సంబంధించిన చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దోమ మండల పరిధిలోని దాదాపూర్‍ గ్రామ సమీపంలోని జొన్నబండపై ఆది మానవుల కాలం(నవీన శిలాయుగం) నాటి పనిముట్లు లభ్యమైనట్లు కొత్త తెలంగాణ చరిత్ర సభ్యుడు, స్థానిక జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఆవుటి శాంతుకుమార్‍ తెలిపారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన.. ఆదిమానవులు రాతి పనిముట్లకు సంబంధించిన వలస గుర్తులను గుర్తించారు. నవీ నశిలాయుగంలో ఆదిమానవులు రాతి చేతి సుత్తితో తయారు చేసిన సూరుడు గుంతలు, సహజసిద్ధంగా ఏర్పడిన రెండు నీటి గుంతలు ఉన్నట్లు తెలిపారు. అప్పట్లో చుట్టూ గుట్టలు ఉండి, వాగులో నీరుపారిన ఆనవాళ్లు, వీటి కింద రెండు కుంటలు సైతం ఉన్నాయని తెలిపారు. జొన్నబండపై ఒకప్పుడు చిన్న మందిరం ఉండేదని, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన శిథిలాల ఆనవాళ్లు కనిస్తున్నాయని స్థానికుల ద్వారా గుర్తించారు. ఆదిమానవుల పనిముట్లు దైవంగా కొలిచే సంప్రదాయం మనకు ఉందని, బహుశా వాటిని ఈ ప్రాంతంలోనే కొలిచి ఉండి
ఉంటారని తెలిపారు.


చారిత్రక ఆనవాళ్లను కాపాడుకోవాలి
జొన్నబండపై ఆది మానవుల కాలం నాటి పనిముట్లను, అక్కడ ఉన్న బండరాళ్లను తొలంగించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో కుల్కచర్ల మండలంలోని ఘణపురం సమీపంలో ఈ పురాతన పనిముట్లు ఉండేవని, వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. చారిత్రక ప్రదేశాలను పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది.
-ఆవుటి శాంతుకుమా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *