ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 7780 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ జిల్లాకి ఉత్తర మరియు ఈశాన్యంలో తెలంగాణకు చెందిన ఖమ్మం జిల్లా కలదు. పశ్చిమం మరియు నైరుతిలో కృష్ణా జిల్లా, తూర్పు దిశలో తూర్పుగోదావరి జిల్లా, దక్షిణంలో సముద్రం కలవు. ఇక్కడ కోస్తాప్రాంతం E-W దిశలో ఉంటుంది.
ఈ ప్రాంతం గుండా చెన్నై-హౌరా నేషనల్ హైవే మరియు బ్రాడ్‍గేజ్ రైల్వేలైన్ వెళ్తువి. ఈ జిల్లాని మూడు ఫిసియోగ్రాఫిక్ ప్రాంతాలుగా విభజించవచ్చును. దక్షిణ ప్రాంతంలో కృష్ణా – గోదావరి నదుల డెల్టా ఉంటుంది. మధ్య భాగం మెట్ట ప్రాంతంగా ఉంటుంది. ఎత్తు పల్లాలతో అక్కడక్కడా చిన్న గుట్టలు ఉంటవి. ఉత్తర ప్రాంతంలో పాలకొండ హిల్ రేంజస్‍ని చూడగలం. ఇవి ఈస్ట్న్ ఘాట్స్కు చెందినవి.
ఈ జిల్లాలో గోదావరి, దాని ఉపనది ఎర్రకాలవ మరియు తమ్మిలేరు నదులు వీటి డ్రైనేజీ నెట్ వర్క్ నీటి అవసరాలను పూర్తి చేస్తాయి.
ఈ జిల్లాలో ఆర్‍క్యన్-పేలియో ప్రొటిరోజోయిక్ పీరియడ్‍కు చెందిన ఈస్ట్రన్‍ఘాట్ సూపర్‍గ్రూప్ గోండ్‍వానా సూపర్‍గ్రూప్, డెక్కన్ ట్రాప్ యొక్క శిలలు మరియు రాజమండ్రి సాండ్ స్టోన్, లాటరైట్ క్యాపింగ్స్, క్వాటర్‍నెరీ సెడిమెంట్స్.
ఈస్ట్రన్ ఘాట్‍కు చెందిన కొండలైట్, చార్నొకైట్ గ్రూప్ యొక్క శిలలు జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాలలో చూడగలము. వీటిలో గ్రానైట్ నైస్ ప్యాచస్ కలవు. గోండ్‍వానా సూపర్‍గ్రూప్‍కు చెందిన తాల్‍చీర్, బారాకర్, కాంతీ, కోటా, గంగ్‍పూర్ ఫార్మేశన్స్కు చెందిన సెడిమెంటరీ శిలలు మరియు అప్పర్ గోండ్‍వానాకు చెందిన గొల్లపల్లి, రాఘవాపురం, తిరుపతి ఫార్మేశన్స్కు చెందిన శిలలు కోస్తా ప్రాంతంలో చూడగలము. గోండ్‍వానాకు చెందిన సెడిమెంటరీ శిలలు చింతలపూడి, జిలుగు మిల్లి మరియు ద్వారకా తిరుమలా ప్రాంతాలలో చూడగలము. బారాకార్ ఫార్మేశన్‍కు చెందిన సాండ్ స్టోన్, శేల్ మరియు కోల్ బెడదనూర్ వద్ద ఉన్నది. డెక్కన్ ట్రాప్ బసాల్టిక్ ఫ్లోస్‍ని దుడ్డకూర్, దేవరపల్లి వద్ద చూడగలము. పన్‍గడి వద్ద ఇంట్రా ట్రోపియన్ సెడిమెంట్స్ఉ న్నవి. ఈ ట్రాప్స్ పైన అక్కడక్కడా ఫెరుజినస్ సాండ్ స్టోన్, క్లే, పెబుల్ బెడ్స్ లిగ్‍నైట్‍లని భీమడోలుకు చాగల్లుకు మధ్య ప్రాంతంలో చూడగలము.
లాటరైట్ క్యాపింగ్స్ని చాలా వరకు రాజమండ్రి సాండ్‍స్టోన్ మరియు వైట్‍క్లే పైన చూడగలము. బాక్‍సైటిక్ లాటరైట్ ఫ్లాట్ టాపడ్‍కొండలపైన దాదాపు 1000 మీటర్ల ఎత్తులో కొండలైట్ చార్నోకైట్ శిలలపైన చూడగలము.
క్వాటర్‍నెరీ సెడిమెంట్స్ని దక్షిణ ప్రాంతంలో చూడగలం. ఈ సెడిమెంట్స్ ఫూలియల్ మరియు మెరైన్ ఎన్విరాన్‍మెంట్స్కు చెందినవి. ఫ్లూవియల్ సెడిమెంట్స్ ఫ్లడ్‍ప్లేన్, లెవి ఏక్టివ్ చానెల్లో కలవు, మెరైన్ సెడిమెంట్స్ పేలియే బీచ్ రిడ్జ్, పేలియొటైడల్ ప్లాట్, ఏక్టివ్ బీచ్‍లో చూడగలము. ప్రముఖమైన కొల్లేరు లేక్ నైరుతిలో ఉన్నది. ఫ్లడ్‍ప్లేన్ డెల్టాలోని ఎక్కువ ప్రాంతంలో వుంటుంది. దీనిలో బ్లాక్‍సిల్టీక్లే ఉంటుంది. లెవీలో బ్రౌన్‍సిల్ట్, ఏక్టివ్ చానల్‍లో కోర్స్ సాండ్, పేలియొ చానెల్స్లో పైన బ్లాక్ క్లే మూడు మీటర్లు దానికింద కోర్స్ సాండ్ పేలియో బీచ్‍రిడ్‍జిస్ రెండు మీటర్ల ఎత్తు ఉంటవి. వీటిలో బ్రౌన్ సాండ్, టైడల్ ఫాట్స్లో బ్రౌన్ సిల్టిక్లే, బీచ్‍లో గ్రే ఫైన్ సాండ్ కలదు. క్వాటర్‍నెరీ పీరియడ్‍లో టెక్‍టానిక్ మూవ్‍మెంట్స్ జరిగినట్టు ఆధారాలు ENE-WSWట్రెండింగ్ ఫాల్ట్ నర్సాపూర్ యానం మధ్యలో ఉంటుంది.
గ్రౌండ్ వాటర్ హార్డ్రాక్ టెర్రేస్‍లో ఫ్రాక్చర్ కన్‍ట్రోల్డ్ గా ఉంటుంది. క్వాటర్‍నెరీ సెడిమెంట్స్లో భూగర్భజలాలు షాలో డెప్త్లో దొరుకును, పేలియొ చానెల్స్లో 10 మీ నుండి 12 మీ లోతులో దొరుకును. ఈ జోన్స్ చాలా మంచి అక్విఫెర్స్. బీచ్ రిడ్జ్స్‍లో పై పది నుండి పన్నెండు మీటర్లనలో మంచి నీరు ఉంటుంది. దాని క్రింద ఉప్పు నీరు దొరుకుతుంది. ఈ జిల్లాలో దక్షిణంలో డెల్టాయిక్ అల్లూవియల్ సాయిల్స్, కోస్తాలో సముద్రతీరాన సాండీ సాయిల్స్ మరియు ఉత్తర ప్రాంతంలో రెడ్ సాండీ సాయిల్స్ దొరుకును. ఈ ప్రాంతం సీస్ మోటెక్టానిక్ స్టడీ ప్రకారం జోన్-3లో ఉన్నట్టు నిర్ధారించారు.
ఖనిజ సంపద: ఈ జిల్లాలోని ముఖ్యమైన ఖనిజాలు క్లే, కోల్, గ్రాఫైట్, లైమ్‍స్టోన్, గ్యాలీనా, జిప్‍సం, బ్లాక్ సాండ్, మైకా, రేడియొఏక్టివ్ ఖనిజాలు, వల్కానిక్ యాశ్ మరియు ఆయిల్ నేచురల్ గ్యాస్.
క్లే: ప్లాస్టిక్ క్లే నిక్షేపాలు ద్వారకా – తిరుమలా కొత్తపల్లి ప్రాంతాలలో దొరుకుతుంది. భీమడోలు వద్ద దీనిని మైనింగ్ చేసారు కొంతకాలం క్రితం పాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వీటి నిక్షేపాలు కూచిపూడి మరియు అడమిల్లి వద్ద కూడా దొరుకుతవి.
కోల్: వీటి నిక్షేపాలు బెడదనూరు వద్ద బారాకర్ ఫార్నేశన్‍లో ఉన్నవి.
గ్రాఫైట్: వీటి మంచి నిక్షేపాలు రెడ్డి బొడేర్ వద్ద కలవు. ఇది ఒక సాఫ్ట్ క్రిస్ట్ లైన్ ఫార్మ్ కార్బన్‍కు దీనిని క్రూసిబుల్స్, లూబ్రికెంట్స్, పేంట్స్, పెన్సిల్ లెడ్ ఫౌండ్రీ ఫేసింగ్స్, డైనమొస్, బ్రవస్, ఎలక్‍ట్రోడ్స్ మరియు డ్రై బ్యాటరీస్‍లో ఉపయోగిస్తారు.
లైమ్‍స్టోన్: లైమ్‍స్టోన్ ముఖ్యంగా సిమెంట్ పరిశ్రమలో రా మెటీరియల్‍గా వాడతారు. ఇది కాకుండా మెలర్జికల్, కెమికల్, ఆల్క్లైన్, పేపర్, సుగర్, గ్యాస్ మరియు లెదర్ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. ఈ జిల్లాలో సిమెంట్ గ్రేడ్ లైమ్‍స్టోన్ పన్‍గడి ప్రాంతంలో ఇంటర్‍ట్రాపియన్ బెడ్స్లో దొరుకుతుంది.
గ్యాలీనా: చిన్న మొత్తంలో వీటి నిక్షేపాలు మార్లగూడెం వద్ద కలవు.
జిప్‍సం: వీటి నిక్షేపాలు కొల్లేరు లేక్ యొక్క క్లే బెడ్స్లో దొరుకును.
బ్లాక్ సాండ్: ఈ బ్లాక్ సాండ్ కాన్‍సన్‍ట్రేశన్స్ నర్సాపూరుకు దక్షిణలో బీచ్‍లో కలవు. ఇవి ప్లేసర్ డిపాజిట్స్. ఇందులో చాలా వరకు రూటైలు, ఇల్మనైట్ (టైటానియం ఖనిజాలు), మాగ్నటైట్ (ఐరన్ ఖనిజం) మరియు గార్నెట్స్తో కూడి యుంటుంది.
మైకా: వీటి మైనర్ అక్కరెన్సెస్ కొవ్వురుపాడు వద్ద కలవు. దీనిని పలు పరిశ్రమలలో ఉపయోగిస్తారు. చాలా వరకు బయోటైట్ ముస్కోవైట్ మైకానె దొరుకుతుంది. కానీ ఇప్పుడు లెపిడోలైట్ కోసం అన్వేషణ జరుగుతుంది. ఎందుకంటే ఇది లీథియం మైకా లీథియం బ్యాటరీస్ మరియు ఎలక్ట్రానిక్స్లో చాలా ఉపయోగాలు ఉండటం వల్ల.
రేడియో ఏక్టివ్ ఖనిజాలు: తోరియం, యురేనియం అనామలీస్ పోలవరం ప్రాంతంలో రిపోర్ట్ చేసారు.
వల్కానిక్ యాశ్: వల్కానిక్ యాశ్ నిక్షేపాలు ఎర్ర కాలవ ఫ్లడ్ ప్లేన్ మరియు చానల్ బెడ్‍లో అనంతపల్లికి వాయువ్యంలో కనుగొన్నారు. ఇది సుమాత్రా ద్వీపంలో జరిగిన వల్కానిసమ్‍తో కొర్రిలేట్ చేయబడినది. దీనిని డేటింగ్ చేసి 75000 సంవత్సరాల క్రితం జరిగి వల్కనసిమ్‍తో కొరిల్లెట్ చేసారు. దీనిని డిటర్‍జెండ్స్ లో ఉపయోగిస్తున్నారు.
ఆయిల్-న్యాచురల్ గ్యాస్:
కృష్ణా – గోదావరీ డెల్టాలలో ఓఎన్‍జిసీ ఆఫ్ శోర్ ఎక్స్ప్లోరేశన్ చేసి 1980లో మొట్టమొదటి సారి ఆయిల్‍ని కనుగొన్నఆరు తరువాత 75 స్ట్రకచర్లను కనుగొన్నారు. ప్రస్తుతం కైకలూరు, నర్సాపూర్, రాజోలు, అమలాపురం, భీమనపల్లి మరియు ఈ బేసిన్‍లో పలు ప్రాంతాలో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. కృష్ణా-గోదావరి బేసిన్‍లో ఓఎన్‍జీసీ వారు దాదాపు -6.3 మిలియన్ టన్స్ అయిల్ మరియు గ్యాస్ రిజర్వుస్ ఉన్నట్టుగా నిర్ధారించారు.
- కమతం మహేందర్ రెడ్డి
ఎ :91 90320 12955