సింగరేణిలో అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్‍ యూనిట్‍ ఏర్పాటు!

సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా కీలక ఖనిజ రంగంలో కూడా ప్రవేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ దిశగా మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి ప్రాంతంలో రేర్‍ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తించి ఉత్పత్తి చేయడానికి ఒక ప్రయోగాత్మక ప్లాంటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.

ఈ మేరకు హైదరాబాద్‍ సింగరేణి భవన్‍లో అక్టోబర్‍ 23న కేంద్ర ప్రభుత్వ అధికారిక పరిశోధన సంస్థ ఎన్‍.ఎఫ్‍.టి.డి.సి (నాన్‍ ఫెర్రస్‍ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్‍ మెంట్‍ సెంటర్‍) తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ తరఫున ఛైర్మన్‍ మరియు ఎండీ ఎన్‍. బలరామ్‍, ఎన్‍.ఎఫ్‍.టి.డి.సి నుంచి ఎన్‍ఎఫ్టిడీసీ డైరెక్టర్‍ బాలసుబ్రమణియన్‍ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ వివరాలను ఛైర్మన్‍ మరియు ఎండీ ఎన్‍. బలరామ్‍ వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలను మరింత వేగవంతం చేస్తుందని, దీనిలో భాగంగా సింగరేణి ప్రాంతంలో లభ్యమవుతున్న రేర్‍ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికిని తెలుసుకోవడానికి, లభ్యమవుతున్న రేర్‍ ఎర్త్ ఎలిమెంట్స్ను ఉత్పత్తి చేయడానికి ప్రయోగాత్మకంగా ఒక ప్లాంట్‍ ను కొత్తగూడెం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనికి సంబంధించిన సాంకేతిక సహాయాన్ని ఎన్‍.ఎఫ్‍.టి.డి.సి సంస్థ నుంచి తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రయోగాత్మక ప్లాంట్‍లో సింగరేణి ఓవర్‍ బర్డెన్‍ మట్టిలో లభించే రేర్‍ ఎర్త్ ఎలిమెంట్స్తో పాటు, సింగరేణి థర్మల్‍ విద్యుత్‍ కేంద్రం నుండి వెలువడే ఫ్లై యాష్‍ లోను, ఇతర వేస్ట్ మెటీరియల్స్ లోను లభ్యమయ్యే రేర్‍ ఎర్త్ ఎలిమెంట్స్ను గుర్తిస్తామని, ప్రయోగాత్మకంగా వీటిని ఉత్పత్తి చేయడం కూడా జరుగుతుందన్నారు.

రేర్‍ ఎర్త్ ఎలిమెంట్స్ లభ్యతా శాతం, ఉత్పత్తికి గల అవకాశాలు, వ్యాపార కోణంలో లాభదాయకత తదితర విషయాలను ద•ష్టిలో పెట్టుకొని తదుపరి పెద్ద ఎత్తున ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎన్‍.ఎఫ్‍.టి.డి.సి ఉన్నతాధికారులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో తాము ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించామని, కొన్ని కీలక ఖనిజాలు ఓవర్‍ బర్డెన్‍ మట్టిలోనూ, సింగరేణి థర్మల్‍ విద్యుత్‍ కేంద్రం నుండి వెలువడే ఫ్లై యాష్‍ లోను ఉన్నట్లు గుర్తించామని, కొత్తగా స్థాపించనున్న పైలట్‍ ప్లాంటు ద్వారా మరింత సమగ్రమైన సమాచారం లభించనుందన్నారు. సింగరేణి సంస్థతో కలిసి పనిచేయడం తమకెంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.

ఈ కారక్రమంలో సింగరేణి డైరెక్టర్‍ (పిఅండ్‍పి) కె.వెంకటేశ్వర్లు, జీఎం(కో ఆర్డినేషన్‍, మార్కెటింగ్‍) టి. శ్రీనివాస్‍, జీఎం (బిజినెస్‍ డెవలప్మెంట్‍) రాందాస్‍, జీఎం (ఎక్స్ ప్లోరేషన్‍) శ్రీనివాసరావు, ఎన్‍.ఎఫ్‍.టి.డి.సి డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‍ లోకేశ్వర్‍ రావు తదితరులు పాల్గొన్నారు.

  • చీఫ్‍ పబ్లిక్‍ రిలేషన్స్ ఆఫీసర్‍
    ది సింగరేణి కాలరీస్‍ కంపెనీ లిమిటెడ్‍ (ప్రభుత్వ సంస్థ)
    ప్రజా సంబంధాల విభాగం, హైదరాబాద్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *