జియాలిజకల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా – జియాలజిస్టులు ఖనిజాన్వేషణకైట్రూ అడ్వెంచర్స్ ఆఫ్‍ జియాలజిస్ట్స్

జియోలాజికల్‍ ఇన్వెస్టిగేషన్స్ జరిపే సమయాలలో రకరకాల అడ్డంకులు, విపరీత పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితులను అధిగమించి ఖనిజాన్వేషణ జరిపి దేశప్రగతికి ఎనలేని సేవలు చేశారు, చేస్తూనే ఉన్నారు. పీరియాడిక్‍ టేబుల్‍లో ఎనభై శాతం మూలకాలు భూమిలోని శిలల నుండే వస్తాయి. ఈ మూలకాలు కలిగిన ఖనిజాలను జియాలజిస్టులు వారు తీసుకొనే రిస్కులు ఎన్నోసార్లు వారి జీవితాలను సైతం లెక్కచేయకుండా దేశప్రగతికోసం ఖనిజాన్వేషణ కొనసాగిస్తారు. ఎన్నో పరిశ్రమలకు ఈ ఖనిజాలు రా మెటీరియల్స్ గా ఉపయోగిస్తారు. దేశప్రగతిలో అత్యంత ముఖ్యమైన పాత్ర వహిస్తున్నా అతనికి సంఘంలో ఉండాల్సినంత గుర్తింపులేదు. ఎందుకంటే అతను ఒక అజ్ఞాత సైనికుని వలే తన అన్వేషణ కొనసాగిస్తుంటాడు.


ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నేను అనగా కె. మహేందర్‍రెడ్డి మరియు తోటి సహోద్యోగి అశోక్‍కుమార్‍ గ్రోవర్‍ కలిసి చర్చించుకొని జి.ఎస్‍.ఐ. జియాలిస్టుల అనుభవాలను సంకలనము చేసి ఒక పుస్తకంగా ప్రచురించాలనే ఆలోచనతో 2020లో మొదలు పెట్టి 151 ముఖ్యమైనవి, 75 చిన్నవి సేకరించి పుస్తకంగా సంకలనం చేశాం. ఈ అడ్వంచర్స్లో అంటార్కిటికా నుండి మొదలు పెట్టి హిమాలయాలు, వెస్ట్రన్‍ ఘాట్స్, ఈస్ట్రన్‍ ఘాట్స్, డకాయిట్‍ / నక్సల్‍ బెల్టస్ మరియు పలు రకాల అనుభవాలు మొత్తంగా 13 థీమ్స్గా గ్రూప్‍ చేయబడినవి.


ఇటువంటి పుస్తకం ఇంతకు ముందు రాలేదు. అందుకని జియాలజిస్ట్ల ప్రొఫెషన్‍ దేశ ప్రగతిలో వారి పాత్రను, సంఘంలోని సామాన్య ప్రజానికి తెలియచేయడానికి ఈ పుస్తకాన్ని సంకలనం చేసి ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకాన్ని జి.ఎస్‍.ఐ. జియాలజిస్టులకు అంకితం చేయబడినది. ఈ పుస్తకాన్ని వైట్‍ ఫాల్‍కన్‍ పబ్లిషర్స్ ప్రచురించారు. వారి ఆన్‍లైన్‍ స్టోర్‍లో, అమెజాన్‍ మరియు ప్లిఫ్‍కార్ట్ ప్లాట్‍ఫాంలో ఉంచారు. అక్కడి నుండి సేకరించవచ్చును.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *