న్యాయ పాలన తెలుగులో ఎప్పుడు

‘కమిటీ’ అనే పదానికి తెలుగుపదం కోసం ప్రయత్నించి సరైన పదం దొరక్క మానేసుకున్నాను’ అన్నారు ఓ మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి టి. వినోద్‍. ‘కమిటీ’ అనే వాడండి సర్‍ అన్నాను నేను. అదే పని చేశానని ఆయన అన్నారు.
కొన్ని పదాలను తర్జుమా చేయకూడదు. అలాగే వాడితే బాగుంటుంది. అనువాదం అన్న పదం తర్జుమాకి బాగానే ఉంటుంది. అలాంటి సులువుగా అనువాదానికి లొంగే పదాలను వాడటం ఆమోదయోగ్యం. కానీ కొన్ని పదాలు తెలుగుదనాన్ని సంతరించుకుంటాయి. అలాంటి పదాలను అనువాదం చేయకూడదు. ఈ సంభాషణ అంతా అంతర్జాతీయ మాత•భాషా దినోత్సవం సందర్భంగా జరిగింది.
1992లో జరిగిన సంఘటన ఒకటి కూడా ఈ సందర్భంగా గుర్తుకొచ్చింది. అప్పుడూ ఇలాంటి సందర్భమే వచ్చింది. ఆ కాలంలో నేను ‘ఆంధప్రభ’ ఆదివారం అనుబంధం సంచికలో లీగల్‍ వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని. ప్రజలకు బాగా అవసరం అనుకున్న అంశాలను మొదటగా రాశాను. అందులో ముఖ్యమైనవి మోటార్‍ వాహన ప్రమాదాలు- నష్ట పరిహారాలు, వినియోగదారుల రక్షణ చట్టం. అప్పుడు వినియోగదారుల రక్షణ చట్టం బాగా ప్రాచుర్యంలో ఉంది. ఆ చట్టం గురించి రాసిన వ్యాసాలను, తీర్పులను కలిపి పుస్తకంగా వేద్దామని అనుకున్నాను. ఓ కమర్షియల్‍లా పబ్లిషర్‍ అది ప్రచురించడానికి ముందుకు వచ్చాడు.
× × ×
జ్యుడీషియల్‍ అకాడమీ తొలి ప్రచురణ
ఆ బుక్‍ ప్రూఫ్‍రీడింగ్‍ దశలో ఉండగా ఆ పుస్తక విషయం అప్పటి ఆంధప్రదేశ్‍ జ్యుడీషియల్‍ అకాడమీ డైరెక్టర్‍ ఎంఈఎన్‍ పాత్రుడి ద•ష్టికి వెళ్లింది. ఆ పుస్తకాన్ని అకాడమీ మొదటి ప్రచురణగా ప్రచురిద్దామని ఆయన చెప్పారు. నేను సంతోషపడ్డాను. నేనప్పుడు మెట్రోపాలిటన్‍ మేజిస్ట్రేట్‍ గా పని చేస్తున్నాను. ఆ దశలో అది ఓ గొప్ప గౌరవం. ఓ రెండు రోజుల తర్వాత అకాడమీకి నన్ను రమ్మని చెప్పారు. అకాడమీ బోర్డ్ ఆఫ్‍ గవర్నర్స్ అధ్యక్షులు హైకోర్టు న్యాయమూర్తి ఎంఎన్‍ రావుని పరిచయం చేస్తామని చెప్పారు. నేను వెళ్లాను. బయట కూర్చున్నాను. డైరెక్టర్‍ చాంబర్‍ లో డైరెక్టర్‍, అడిషనల్‍ డైరెక్టర్‍ భవానీ ప్రసాద్‍, హైకోర్టు న్యాయమూర్తి ఎంఎన్‍ రావు మాట్లాడుకుంటున్నారు. ‘అకాడమీ’ అన్న పదాన్ని తెలుగులో రాస్తే బాగుంటుందని వాళ్లు చర్చించుకుంటున్నారు. దానికి అనువాదం ‘పరిషత్‍’ అని వాళ్లు ఓ నిర్ణయానికి వచ్చినట్టు నాకు అనిపించింది. వాళ్ల మాటలు స్పష్టంగా వినిపించాయి. ఆ అనువాదం ఎందుకో నాకు ఏ మాత్రం నచ్చలేదు. సందర్భం వస్తే ఆ విషయం చెప్పాలనుకున్నాను. కాసేపటికి నన్ను లోపలికి పిలిచారు.
అకాడమీ అనే పదం తొలగించి పరిషత్‍ అన్న పదం పుస్తకంలో వేయండి అని చెప్పారు. ఆ సందర్భాన్ని నేను ఉపయోగించుకున్నాను. అకాడమీని అకాడమీ అంటేనే బాగుంటుంది.. పరిషత్‍ అంటే బాగుండదు సార్‍ అని అన్నాను. అక్కడితో ఊరుకోకుండా. నా అభిప్రాయానికి బలం చేకూరేలా ‘కేంద్ర సాహిత్య అకాడమీ’, ‘రాష్ట్ర సాహిత్య అకాడమీ’, ‘తెలుగు అకాడమీ’ లాంటి కొన్ని ఉదాహరణలు చెప్పాను. నా మాటలతో ముగ్గురూ ఆలోచనలో పడ్డారు. చివరికి నా మాటలతో ఏకీభవించారు.
ఆంధప్రదేశ్‍ జ్యుడీషియల్‍ అకాడమీ మొదటి ప్రచురణగా ‘వినియోగదారుల రక్షణ చట్టం’ పుస్తకం వచ్చింది. తెలుగులో కూడా అకాడమీ అన్న పదం స్థిరపడింది. ఆ పుస్తకాన్ని అప్పటి ప్రధాన న్యాయమూర్తి1992 జులై 28న ఆవిష్కరించారు. అకాడమీ మొదటి పుస్తకం తెలుగు పుస్తకం. అది చాలా ప్రాచుర్యం పొందింది. అయితే అదే పుస్తకం అకాడమీ చివరి పుస్తకం కావడం ఓ విషాదం. ఆ తర్వాత మరికొన్ని పుస్తకాలు అకాడమీ ప్రచురణలుగా వచ్చాయి. అందులో నా పుస్తకం కూడా మరొకటి ఉంది. అయితే అవి అన్నీ ఇంగ్లీష్‍ లోనే ఉన్నాయి. ఆ పుస్తక ప్రచురణ తెలుగులో జరిగి 33 ఏండ్లు దాటింది. కానీ మరో తెలుగు పుస్తకం ఏదీ అకాడమి నుంచి రాలేదు.
× × ×

ప్రాంతీయ భాషల్లో తీర్పులు..
పై విషయాలన్నీ ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఇప్పుడు అన్ని ప్రాంతీయ భాషల్లో తీర్పులను అందుబాటులోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం కూడా సమర్థిస్తున్నది. దేశంలోని వివిధ హైకోర్టులు కూడా ఇంగ్లీషులో ఉన్న ప్రధాన తీర్పులను ఆయా ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాయని వింటున్నాం.
ఈ స్థితిలో తెలుగులో న్యాయపాలన జరగాలని చాలా మంది కాంక్షిస్తున్నారు. మన చుట్టు పక్కల ఉన్న అన్ని రాష్ట్రాల్లో న్యాయపాలన వాళ్ల భాషల్లోనే జరుగుతున్నది. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం న్యాయపాలన తెలుగులో జరగడం లేదు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధప్రదేశ్‍లో కోర్టుల విషయంలో తెలుగు భాష అంతగా అభివ•ద్ధి చెందలేదు. తెలుగు భాష కోర్టుల్లో అమలు జరగలేదు. తెలుగులో తీర్పులను అనువాదం చేస్తున్న సందర్భంలో ఈ దిశగా అందరూ కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలుగులో న్యాయపాలన జరగాలంటే తెలుగులో కూడా న్యాయశాస్త్ర గ్రంథాలు అందుబాటులో ఉండాలి. ఆ పనికి నా లాంటి ఒకరిద్దరు మిత్రులు కాకుండా జ్యుడీషియల్‍ అకాడమీ, తెలుగు అకాడమీ, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి. అది కూడా మనస్ఫూర్తిగా చిత్తశుద్ది తో చేయాలి. తెలుగులో న్యాయశాస్త్ర పుస్తకాలు ఉంటే తెలుగులో తీర్పులు రావడానికి మార్గం కొంత సుగమం అవుతుంది. ఈ దిశగా హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని భాషాభిమానులే కాదు కక్షిదారులూ కోరుకుంటున్నారు.

× × ×
ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిందే..
న్యాయశాస్త్ర పుస్తకాలు, అనువాదం చేసిన తీర్పులు ప్రజల భాషలో ఉండాలి. అలా లేనప్పుడు ప్రజలకు కోర్టులకు మధ్య అగాథం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. తెలుగులో న్యాయపాలన జరిగితే కక్షిదారులకు తమ కేసు ఎందుకు పోయిందో, అవతలి వ్యక్తుల కేసు ఎందుకు గెలిచిందో అర్థం అవుతుంది. అలా అర్థమైనప్పుడు ప్రజలకు కోర్టుల మీద విశ్వసనీయత పెరుగుతుంది.
ప్రజలకు కోర్టులకు మధ్య ఉన్న అవరోధం భాష. ఈ అవరోధం తొలగించడానికి అందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాల్సి ఉన్నది. అనువాదం చేసే క్రమంలో చూడాల్సిన మరో అంశం తెలుగులోకి చొచ్చుకొచ్చి తెలుగుదనం సంతరించుకున్న పదాలను అదేవిధంగా
ఉంచడం, ప్రజలకు కోర్టుల న్యాయం చేరువ కావాలంటే కావాల్సింది తెలుగులో న్యాయపాలన. ఈ దిశగా ప్రయత్నాలు చిత్తశుద్ధితో జరగాలి. సంస్థలు నామమాత్రంగా ఉండటం కాదు.. అవి ఉనికిలో ఉన్నాయని నిరూపించుకోవాలి. ఈ మాటలను విజుఙలు వింటున్నారా మరీ ముఖ్యంగా అధికార భాషా సంఘం మన రాష్ట్రం లో అది ఇంకా ఏర్పాటు చేయలేదు ఎందుకో.
× × ×
భాష గురించి ఓ కథ
భాష

అప్పుడు నేను హైదరాబాద్‍లో చీఫ్‍ మెట్రోపాలిటన్‍ మేజిస్ట్రేట్‍గా పని చేస్తున్నాను. జగన్నాథరెడ్డి మొదటి అదనపు మెట్రోపాలిటన్‍ సెషన్స్ జడ్జిగా పని చేస్తున్నారు.
భోపాల్‍లో వున్న జాతీయ జ్యుడీషియల్‍ అకాడెమీలో ఓ కాన్ఫరెన్స్కి హైకోర్టు మా ఇద్దరినీ ఎంపిక చేసి పంపించింది.
దేశంలోని న్యాయమూర్తులందరూ కలిసి పాల్గొనే అకాడెమీ అది.
ఆ అకాడెమీ మొదలైన కొత్తలోనే మాకు అక్కడికి వెళ్లే అవకాశం కలిగింది. అది మూడు రోజుల కాన్ఫరెన్స్. నాలుగు గంటల వరకు షెడ్యూలు. ఆ తరువాత ఫ్రీ టైం. కొంతమంది లైబ్రరీలో కూర్చొనేవారు. మరి కొంతమంది భోపాల్‍ నగరం చూడ్డానికి వెళ్లేవారు.
అకాడెమీ నగరానికి దూరంగా చాలా ఎతట తైన ప్రదేశంలో వుంటుంది. చాలా గొప్పగా కట్టారు. కట్టడమే కాదు. అక్కడ కాన్ఫరెన్స్లు కూడా బాగా జరుగుతాయి. మొదటి రోజు సాయంత్రం నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలు చూసి చౌరస్తా దగ్గరికి వచ్చాం నేనూ, జగన్నాథరెడ్డి. అక్కడ నుంచి అకాడెమీ వెళ్లడానికి కార్లు వుంటాయి. ఫోన్‍ చేస్తే అకాడెమీ నుంచి కారు వస్తుంది.
ఆ చౌరస్తాలో ‘మ•గనయిని’ అన్న పేరుతో ఓ చేతివ•త్తుల దుకాణం ఉంది. అందులో ఎక్కువగా చీరెలు వుంటాయి. ఇతర రాష్ట్రాల న్యాయమూర్తులకి గౌరవంగా కొంత ఎక్కువ డిస్కౌంట్‍ కూడా ఇస్తారు.
నేనూ, జగన్నాథరెడ్డి కలిసి షాపులోకి వెళ్లాం. మాకు తోచిన చీరలు ఓ పది నిమిషాల్లో కొనుగోలు చేసి, ఏవో విషయాలు తెలుగులో మాట్లాడుకుంటూ బిల్లింగ్‍ కౌంటర్‍ దగ్గర నిల్చున్నాం.
అప్పుడు ఓ జంట మా దగ్గరికి వచ్చారు. ఇద్దరూ అందంగా వున్నారు. ఆమె చాలా ఆకర్షణీయంగా ఉంది. వాళ్ల ఇద్దరు పిల్లలు కూడా చాలా అందంగా చలాకీగా వున్నారు.
మా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకున్నారు. మేమూ అక్కడికి వచ్చిన విషయం చెప్పాం. వాళ్లిద్దరూ తెలుగు వాళ్లు. మరో ఇద్దరు తెలుగు వాళ్లని చూడగానే వాళ్లకి ప్రాణం లేచి వచ్చినట్టుంది. అలా వాళ్లు వచ్చిన పనిని పక్కనబెట్టి మాతోనే మాట్లాడుతూ నిల్చున్నారు. అతను ‘నాబార్డ్’లో పని చేస్తున్నాడు.
ఇంకా ఎన్ని రోజులు ఉంటారని మమ్మల్ని అడిగారు. ఓ రెండు రోజులు ఉంటాం. మూడో రోజు వెళ్లిపోతామని చెప్పాం.
అతను తన విజిటింగ్‍ కార్డు తీసి ఇచ్చాడు. ఆ తెల్లవారి సాయంత్రం భోజనానికి వాళ్లింటికి రమ్మని ఆమె కోరింది. ఆ తరువాత అతను చెప్పాడు.
మాకు ఏమి అనాలో తోచలేదు. సరేనన్నట్టుగా తలవూపాం. వీలైతే వస్తామని, ఫోన్‍ చేస్తామని చెప్పాం.
కానీ వీలు కుదరలేదు. మళ్లీ చెప్పడానికి వాళ్ల దగ్గర మా ఫోన్‍ నెంబరు లేదు. ఆ తరువాత జాతీయ జ్యుడీషియల్‍ అకాడెమీకి చాలాసార్లు వెళ్లాను. మృగనయిని వెళ్లినప్పుడల్లా వాళ్లే గుర్తుకొచ్చే వాళ్లు.
ఇప్పుడూ అంతే! మాసబ్‍ ట్యాంక్‍ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడల్లా వాళ్లే గుర్తుకొస్తారు.
అక్కడ ‘నాబార్డ్’ బోర్డు పెద్దది ఉంది.
ప్రాంతం కాని ప్రాంతంలో
భాష మనుషుల్ని ఎంత దగ్గర చేస్తుంది.
అక్కడ యాసతో పనిలేదు. అది ఆటంకమూ కాలేదు. కాదు కూడా.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *