చారిత్రక నేపథ్యం:
భవిష్యత్తు తరాల వారికి అడవుల ప్రాముఖ్యాన్ని తెలపాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‍ఏఓ) మార్చి 21న ‘వరల్డ్ ఫారెస్ట్ డే’గా నిర్వహించాలని భావించింది. 1971లో జరిగిన ఎఫ్‍ఏఓ 16వ సర్వసభ్య సమావేశంలో అన్ని దేశాలూ దీన్ని ఆమోదించాయి. తర్వాత 2012, నవంబరు 28న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా తీర్మానించింది.
దట్టమైన వృక్షాలు, పొదలతో కూడిన విశాల భూభాగాలను అడవులుగా పేర్కొంటారు. ఇవి అనేక జీవజాతులకు ఆవాసాలుగా ఉంటాయి. జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఇవి ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. అడవుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం, వాటి నిర్వహణ, పరిరక్షణ, అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
అడవులు కార్భన్ సింక్‍లుగా పని చేస్తాయి. ఇవి కార్బన్‍డై ఆక్సైడ్‍ను స్వీకరించి ఆక్సిజన్‍ను విడదల చేయడం ద్వారా వాతావరణ ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. వృక్ష జంతు జాతులకు ఇవి ఆవాసాలుగా ఉన్నాయి. మానవులకు ఆహారం, ఔషదాలు, ఇతర ఉత్పత్తులను అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి జీవనోపాధిని కల్పిస్తున్నాయి.
అయితే అడవులను నరికి వేయడం, వ్యవసాయం, పట్టణీకరణ వంటి మానవ కార్యకలాపాలకు తోడు కార్చిచ్చు, ప్రక•తి విపత్తుల వల్ల అడవులు అంతరించి పోతున్నాయి. ఆ చర్యల వల్ల జీవ వైవిధ్యం, నేల కోతకు గురికావడం, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు పెరుగుతున్నాయి.
దీని వల్ల భూమి, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇలాగే ఉష్ణోగ్రతలు పెరిగితే ధ్రువ ప్రాతంలో ఉన్న మంచు కరిగిపోయి ప్రపంచ వ్యాప్తంగా సముద్ర తీరంలో ఉన్న నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. కావున అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అడవులు అన్ని చేస్తున్నా జాలిలేని మానవుడు తన స్వార్ధం కోసం అడవులను నరికేస్తున్నాడు. వాటి వల్ల కలిగే అనర్ధాలు ఎక్కువగా ఉన్నా ప్రభుత్వాలు చేయాల్సి నంత చెయ్యకపోవడం వల్ల అడవుల పరిపక్షణ అనేది సాధ్యం కావట్లేదు.
అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అడవుల జిల్లా అని పేరుంది. 1965లో దట్టమైన అటవీ ప్రాంతంగా ప్రకటించారు. 1972లో ఈ ప్రాంతం మొత్తాన్ని వన్య ప్రాణి సంరక్షణ చట్టం క్రింద 1999లో రక్షిత ప్రదేశంగా ప్రవేశపెట్టారు. ఇక్కడ అటవీ విస్తీర్ణం 2015.44 స్క్వేర్ కిలోమీటర్లు వ్యాపించి ఉంది.
థీమ్: ‘‘అడవులు మరియు ఆర్థిక వ్యవస్థలు’’. ఈ థీమ్ ఆర్థిక శ్రేయస్సు, స్థిరమైన అభివ•ద్ధి, స్థిరమైన అటవీ నిర్వహణ ద్వారా కలపకు మించి ఆదాయం, ఉద్యోగాలను అందించడంలో అడవుల ముఖ్యమైన పాత్రను ప్రముఖంగా చెప్తుంది.
ఆర్థిక దృష్టి: అడవులు గ్రామీణ జీవనోపాధికి ఎలా మద్దతు ఇస్తాయో, వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతాయో, పరీవాహక ప్రాంతాలను ఎలా రక్షిస్తాయో ముఖ్యంగా తెలియజేస్తుంది.
దక్కన్న్యూస్, ఎ : 9030 6262 88
