ప్రాముఖ్యత: ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్‍స్టిట్యూట్ (ITI) 1961లో ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని ప్రారంభించింది. మార్చి 27న పారిస్‍లో 1962లో ‘‘థియేటర్ ఆఫ్ నేషన్స్ సీజన్’’ నిర్వహించబడటంతో ఇది ప్రారంభం అయింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే తేదీన ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
రాజుల కాలం నుంచి ఇప్పటికీ.. విరాజిల్లుతూ నేటికీ తనప్రాభవాన్ని నిలబెట్టుకుంటున్న రంగం నాటకరంగం. మరింత మందికి ఈ రంగాన్ని చేరువ చేయడానికి కృషి చేస్తున్నవారు ఎందరో. చదువుకు సాధనంగా, సామాజిక మార్పు కోసం ప్రభావంతంగా పనిచేసే నాటకం ప్రాముఖ్యత, మన సంస్కృతిలో ఎంతగానో మమేకం అయ్యింది.
రంగస్థలం అనేది మానవ స్వభావాన్ని వ్యక్తీకరించే సాధనంగా పనిచేస్తుంది. మానవ అనుభవాలు, భావోద్వేగాలలో ఉండే వైవిధ్యాలు, భావోద్వేగాలలో దాగిన విషాదం, సంతోషం, ఈర్ష్య, అసూయ, జాలి, దయ.. ఇలాంటివన్నీ లోతుగా పరిశీలించి, ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం రంగస్థలం కల్పిస్తుంది. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు.. విద్య, సామాజిక మార్పుకు కూడా శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
రంగస్థల ప్రదర్శన గొప్ప కళారూపం. ఈ కళారూపాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వాలు, వ్యక్తులు, సంస్థలు నాటక సమాజానికి మద్దతు ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి కృషి చేయడం. ఈ రోజున ప్రజలు అనేక కార్యక్రమాలు, ప్రదర్శనలు, ప్రసంగాలు, నాటక సమాజాలు కార్యక్రమాలు, అవార్డు వేడుకలు, ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా రంగస్థల దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటారు.రోజువారీ హడావిడి జీవితాలలో థియేటర్ అనేది ప్రజలకు కొద్దిసేపు అన్ని గోలలు మరచిపోయి కాస్త వినోదాన్ని, మరికొంద ప్రశాంతతను పంచే వేదిక. సాధారణ పౌరుడి నుండి విలాసవంతమైన జీవితం గడిపే వారి వరకు ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒక దశలో, సందర్భంలో ఈ థియేటర్‍తో ముడిపడి ఉంటుంది.
ప్రత్యేక థియేటర్ ప్రదర్శనలు: చాలా థియేటర్లు ప్రత్యేక నాటకాలు రంగస్థల ప్రదర్శనలను నిర్వహిస్తాయి. కొన్ని ప్రొడక్షన్స్ ప్రేక్షకులను థియేటర్‍తో నిమగ్నం అయ్యేలా ప్రోత్సహించడానికి
ఉచిత లేదా తగ్గింపు టిక్కెట్లను అందిస్తాయి.
అంతర్జాతీయ సందేశం: ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాటక రంగం ప్రముఖుడు ప్రపంచ నాటక దినోత్సవ సందేశాన్ని వ్రాసి అందజేస్తాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా పంచుకో బడుతుంది. ఈ సందేశం ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో నాటక రంగానికి ఉన్న శక్తిని తెలియజేస్తుంది. కళకు తమను తాము అంకితం చేసుకున్న వారు ఈ సందర్భంగా గుర్తించబడతారు. తగిన గౌరవం పొందుతారు. ఇది వ్యక్తి కళను ప్రపంచానికి మరింత విస్తృతం చేయడానికి సరైన మార్గం అవుతుంది.
థియేటర్ వర్క్షాప్‍లు, ప్యానెల్ చర్చలు: థియేటర్ గ్రూపులు, సాంస్కృతిక సంస్థలు నటన, నాటక రచన, రంగస్థల కళపై వర్క్షాప్‍లు, చర్చలు, మాస్టర్‍క్లాస్‍లను నిర్వహిస్తాయి. నిపుణులు థియేటర్ పరిణామం చెందిన విధానం, ప్రాముఖ్యతపై తమ తమ అభిప్రాయాలు, నాటి కాలపు సంఘటనలు పంచుకుంటారు.
వీధి నాటకాలు, బహిరంగ ప్రదర్శనలు: సామాజిక, సాంస్కృతిక సమస్యల గురించి అవగాహన పెంచడానికి వీధి నాటక బృందాలు బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శనలు ఇస్తాయి. విశ్వవిద్యాలయాలు, నాటక పాఠశాలలు తరచుగా బహిరంగ ప్రదర్శనలను నిర్వహిస్తాయి.
నాటక కళాకారుల గుర్తింపు: అత్యుత్తమ నాటక కళాకారులు, నాటక రచయితలు, ప్రదర్శకులకు కళారూపానికి చేసిన కృషికి అవార్డులు, గౌరవాలు ఇవ్వబడతాయి.
సోషల్ మీడియా, ఆన్‍లైన్ ప్రచారాలు: థియేటర్‍ను ఇష్టపడేవారు, సంస్థలు, కథలు, కోట్స్, మరచిపోలేని ప్రదర్శనలను పంచుకోవడానికి వరల్డ్ థియేటర్ డే వంటి హ్యాష్‍ట్యాగ్‍లను ఉపయోగిస్తాయి. వర్చువల్ ప్రదర్శనలు, ప్రత్యక్ష ప్రసారం చేయబడిన థియేటర్ ఈవెంట్‍లు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను పాల్గొనడానికి అనుమతిస్తాయి.
థీమ్: ‘‘థియేటర్ మరియు శాంతి సంస్కృతి’’. ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్‍స్టిట్యూట్ (ITI) స్థాపించిన ఈ శాశ్వతమైన థీమ్, అంతర్జాతీయ సామరస్యం, అవగాహన, సామాజిక మార్పును పెంపొందించడానికి ప్రత్యక్ష ప్రదర్శన యొక్క శక్తిని ప్రముఖంగా చెబుతుంది.
ప్రధాన సందేశం: శాంతి, సంభాషణ, పరస్పర అవగాహన కోసం థియేటర్‍ను సాధనంగా ఉపయోగించడంపై వార్షిక థీమ్ దృష్టి సారించింది.
మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా…
కొత్వాల్ సచిన్,
ఎ : 86866 64949
