తెలుగు భాషా సాహిత్య అభివ•ద్ధికి అపారమైన సేవలు చేసిన విదేశీయుల్లో ప్రముఖుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఆయన 1798 నవంబర్ 10న ఇంగ్లాండ్లో జన్మించాడు. ఆయన తండ్రి రెవరెండ్ డేవిడ్ బ్రౌన్. చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి కలిగిన బ్రౌన్ తూర్పు దేశాల భాషలపై కూడా ఆకర్షితుడయ్యాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ సేవలో భాగంగా 1817 ప్రాంతంలో భారత్కు వచ్చి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉద్యోగం ప్రారంభించాడు. ఉద్యోగ కారణంగా తెలుగు ప్రాంతాల్లో పనిచేసే అవకాశం రావడంతో ఆయనకు తెలుగు భాషపై ప్రత్యేక ఆసక్తి పెరిగింది. విదేశీయుడైనా తెలుగు నేర్చుకోవాలని సంకల్పించి స్థానిక పండితులను సంప్రదించి చదువుకున్నాడు.
ఆ కాలంలో తెలుగు భాషకు సరైన ప్రాధాన్యం లేకపోవడం, ప్రాచీన గ్రంథాలు చెదిరిపోతూఉండడం ఆయనను కలచివేసింది. తెలుగు సాహిత్యాన్ని సంరక్షించాలి అనే సంకల్పంతో ఆయన కృషి ప్రారంభించాడు. తాను పనిచేసిన కడప, రాజమండ్రి, మచిలీపట్నం ప్రాంతాల్లో పండితులను కలుసుకొని పాత గ్రంథాలను సేకరించాడు. ఆ గ్రంథాలు ఎక్కువగా తాళపత్రాలపై ఉండేవి. అవి కాలగర్భంలో కలిసిపోకుండా వాటిని కాపీ చేయించి, తప్పులను సరిచేసి, ముద్రణలోకి తీసుకువచ్చాడు. ఈ కృషి వల్ల ఎన్నో ప్రాచీన రచనలు మనకు అందుబాటులోకి వచ్చాయి.
1820 ఆగస్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడంలోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్థమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవాడు.

నేను 30 ఏళ్లు కృషి చేసి, దాన్ని పునఃప్రతిష్ట చేశాన’న్నాడు బ్రౌన్. నిరలంకారంగా మాట్లాడ్డం బ్రౌన్ శైలి. ఈ మాటల్లో కూడా అందుకే అతిశయోక్తులు కనిపించవు. 1827 నాటికే, బ్రౌన్ ‘ఆంధ్ర గీర్వాణ ఛందము’ అనే పుస్తకం రాసినప్పటికీ, ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన పుస్తకం 1829 నాటి ‘వేమన శతకం’. అప్పటికి బ్రౌన్
అయిదేళ్లుగా వేమన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు ఏడొందల పద్యాలకి ఆంగ్లానువాదాలతోపాటు విస్తృతమయిన పదకోశం కూడా సమకూర్చారు. మరో పదేళ్ల తర్వాత, 1164 పద్యాల మేరకి విస్తరింపచేసి, తిరిగి ‘వేమన శతకం’ అచ్చువేశారు. పదవీ విరమణ తరువాత 1854లో లండన్లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12 న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్బార్న్ గ్రోవ్, లండన్ లో అవివాహితునిగానే మరణించాడు. ఈయనను కెన్సెల్ గ్రీన్ శ్మశానంలో సమాధి చేశారు.
కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. 1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి 1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు. బ్రౌను మానవతావాది. 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, కరువుగానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పందొమ్మిదో శతాబ్ది తొలిపాదం చివర్లో తాను తెలుగు సాహిత్యంలో కృషి మొదలుపెట్టేనాటికి నెలకొని వుండిన స్థితిగతులను గురించి బ్రౌన్ స్ఫుటమయిన మాటల్లో అభివర్ణించాడు. ‘అప్పటికి తెలుగు సాహిత్యం కొనప్రాణంతో కొట్టుకులాడుతోంది. 1825 నాటికి ప్రమిదలో దీపం కొడిగట్టిపోతోంది. తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండడం నా కళ్లబడింది.
సి.పి. బ్రౌన్ తెలుగు సాహిత్యంలో చేసిన అత్యంత ముఖ్యమైన సేవల్లో వేమన పద్యాల ప్రచురణ ప్రధానమైనది. వేమన పద్యాలు ప్రజల్లో విస్త•తంగా తెలియని సమయంలో ఆయన వాటిని సేకరించి శుద్ధి చేసి ప్రచురించాడు. దీని వల్ల వేమన తత్వం ప్రపంచానికి తెలిసింది. అలాగే పోతన భాగవతం, నన్నయ్య, తిక్కన, ఎరప్రగడ మహాభారత భాగాలు, వివిధ శతకాలు, పూరాణ గ్రంథాలు వంటి అనేక రచనలు సేకరించి ప్రచురించాడు. ఈ విధంగా తెలుగు సాహిత్య సంపదను సంరక్షించాడు.

- తెలుగు భాష అభివ•ద్ధికి ఆయన నిఘంటువులు ఎంతో ఉపయోగపడ్డాయి. ఆయన రచించిన ముఖ్యమైన గ్రంథాలు:
- A Grammar of the Telugu Language (1829) – తెలుగు వ్యాకరణాన్ని వివరించిన గ్రంథం
- Telugu-English Dictionary (1852) – తెలుగు పదాలకు ఇంగ్లీషు అర్థాలు తెలిపిన నిఘంటువు
- English-Telugu Dictionary (1854) – ఇంగ్లీషు పదాలకు తెలుగు అర్థాలు తెలిపిన గ్రంథం
- A Dictionary of Mixed Dialects and Foreign Words used in Telugu – తెలుగు భాషలోని మిశ్ర పదాలను వివరించిన గ్రంథం
- Vemana Satakam (సంపాదకత్వం) – వేమన పద్యాల సేకరణ
- Telugu Reader – తెలుగు నేర్చుకునే వారికి రూపొందించిన పాఠ్య గ్రంథం
- Andhra Mahabharatamu (సంపాదకత్వం) – మహాభారత భాగాల ప్రచురణ
- Potana Bhagavatam (సంపాదకత్వం) – పోతన భాగవతం ప్రచురణ
ఈ గ్రంథాలు తెలుగు నేర్చుకునే వారికి మార్గదర్శకంగా నిలిచాయి. తెలుగు వ్యాకరణాన్ని శాస్త్రీయంగా వివరించడం ద్వారా ఆయన భాషకు వ్యవస్థీకృత రూపాన్ని ఇచ్చాడు. విదేశీయులు కూడా తెలుగు నేర్చుకునేలా సరళమైన పద్ధతులు రూపొందించాడు.
సి.పి. బ్రౌన్ తెలుగు పండితులను ప్రోత్సహించడం కూడా ఒక గొప్ప సేవ. పండితులకు వేతనాలు ఇచ్చి గ్రంథాల ప్రతులు సిద్ధం చేయించాడు. ముద్రణా విధానాన్ని ప్రోత్సహించి తెలుగు గ్రంథాలను ప్రచురించాడు. అప్పటివరకు చేతిరాత ప్రతులుగా ఉన్న గ్రంథాలు ఆయన వల్ల ముద్రిత రూపంలో ప్రజలకు చేరాయి. ఆయన తన స్వంత ధనాన్ని కూడా ఈ కార్యక్రమాలకు వినియోగించాడు.
తెలుగు భాషను పాశ్చాత్యులకు పరిచయం చేయడంలో కూడా ఆయన పాత్ర గొప్పది. ఆయన నిఘంటువులు, వ్యాకరణ గ్రంథాలు విదేశీయులకు తెలుగు నేర్చుకోవడానికి
ఉపయోగపడ్డాయి. భాషా సంస్క•తిపై ఆయన చూపిన గౌరవం తెలుగు ప్రజల అభిమానాన్ని పొందింది.
సి.పి. బ్రౌన్ 1884 డిసెంబర్ 12న మరణించాడు. కానీ ఆయన చేసిన సేవలు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. ఒకసారి మనం ఆలోచిస్తే.. ఆయన లేకపోతే ఎన్నో ప్రాచీన గ్రంథాలు నశించి ఉండేవి. వేమన పద్యాలు, శతకాలు, పూరాణాలు ఈరోజు మనకు అందుబాటులో ఉండేవా అన్న ప్రశ్న కలుగుతుంది. ఈ దృష్టితో చూస్తే ఆయన తెలుగు భాషకు చేసిన సేవలు అమూల్యమైనవి.
మొత్తంగా చూస్తే సి.పి. బ్రౌన్ కేవలం ఒక విదేశీయ అధికారి మాత్రమే కాదు; తెలుగు భాషా సంరక్షకుడు, సాహిత్య సేవకుడు, సంస్కృతి పరిరక్షకుడు. తెలుగు భాషా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
-ఆమంచ లోకేష్
ఎ : 6304006470
