Author name: deccanland

తెలంగాణా ప్రాచీన శివాలయాలు

భారతదేశంలో మొట్టమొదటి ఆలయాలు తెలంగాణలో బయటపడ్డాయి – నాగార్జునకొండలో, కృష్ణానది ఉత్తర తీరపు నల్లమల అడవుల్లో. నాగార్జునసాగర్‍ ప్రాజెక్టు కడుతున్నప్పుడు భారత పురావస్తుశాఖ నాగార్జున కొండ పరిసరాల్లో చేపట్టిన తవ్వకాల్లో అనేక శివాలయాలు వెలుగు చూశాయి. ఇవి క్రీ.శ.2వ శతాబ్దం నుండి నిర్మించబడ్డాయి. రెండవ శతాబ్దంలో తెలంగాణను పాలించిన శాతవాహనులు తాము పశుపతిని… అంటే శివున్ని, గౌరిని… అంటే పార్వతిని …

తెలంగాణా ప్రాచీన శివాలయాలు Read More »

మూసిలావిడ-సొరకాయ బుర్ర

చాలా కాలం క్రితం ఒక ఊళ్ళో ఒక ముసలావిడ ఉండేది. ఆమెకు పుట్టెడు గూని ఉండేది. ఆ ముసలావిడ రెండు కుక్కలను పెంచేది. వాటిని లింగు, లిటుకు అంటూ ముద్దుగా పిలిచేది. ఒకసారి ఆ ముసలావిడకి తన మనుమరాలిని చూడాలనిపించింది. మనుమరాలి ఊరికి వెళ్లాలంటే అడవిదాటి వెళ్లాలి.


‘ముసలిదాన్ని, నన్నెవరేం పీక్కుతింటారు’ అని బయలు దేరింది.

మూసిలావిడ-సొరకాయ బుర్ర Read More »

వికసించిన నూరు పూలు

నూరు పూలు వికసించనీ, వేయి భావాలు పరిమళించనీ..
ది నూరవ సంచిక. తెలంగాణ మలిదశ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో సెప్టెంబర్2012లో తొలి సంచిక వెలువడింది. ఒక సామాజిక రాజకీయ మాసపత్రికగా దక్కన్ లాండ్ నిరాటంకంగా నూరు సంచికలు వెలువడటం సంతోషదాయకం.

సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేని తెలంగాణ ప్రాచీన చరిత్ర, వారసత్వ సంపద, భాష-సాహిత్యం- జానపద కళారూపాలతో …

వికసించిన నూరు పూలు Read More »

వేముల పెరుమాళ్ళు

ఇంటికి వాకిలి సాక్షి అన్నట్టు ఈ తెలుగింటికి, ఈ తెలంగాణ ఇంటికి వాకిలి లాంటి వాడు వేముల పెరుమాళ్ళు. తెలుగు భాషా సంస్కృతుల గూర్చి, తెలుగు జీవనానికి సంబంధించిన జాతీయాల గూర్చి వేముల పెరుమాళ్ళు ఒక జీవిత కాలపు కృషి చేశారు. అయితే ఆ కృషి గురించి తెలుగు సాహితీ లోకంలో జరగాల్సినంత చర్చ జరగకపోవడం విచారకరం. పెరుమాళ్ళు …

వేముల పెరుమాళ్ళు Read More »

ప్రణయ – చరిత్రకు పట్టం

తెలుగునాట ఎంతోమంది సాహితీవేత్తలు తమ ఇంటి పేరు తోనే ప్రసిద్ధులు. ఆ రచయితలు సీమాంధ్ర ప్రాంతం వారైనా వారి ఇంటిపేర్లున్న ఊళ్లు తెలంగాణలో ఉన్నాయి. వాళ్లు కూడా తమకు తెలంగాణాతో అనుబంధమేదో ఉన్నదనే భావించారు. ముఖ్యంగా బ్రాహ్మణులు తాము పౌరోహిత్యం చేస్తున్న/ నివసిస్తున్న ఊరిపేర్లనే ఇంటిపేరుగా స్థిరపరచుకున్నారు. అట్లాంటి వారిలో రాచకొండ విశ్వనాథశాస్త్రి, కందుకూరు వీరేశలింగం,

ప్రణయ – చరిత్రకు పట్టం Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-4 బాదామీ చాళుక్య మొదటి విక్రమాదిత్యుని కొల్లాపురం రాగిరేకు శాసనం(క్రీ.శ.672)

కొల్లాపురం. మళ్లీ అలంపురం తరువాత నేను జీవితంలో గుర్తుంచుకోవాల్సిన రెండో తెలంగాణా పట్టణం. అలంపురంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మహబూబ్‍నగర్‍ జిల్లా, కొల్లాపూర్‍ తాలూకా, జటప్రోలు దేవాలయాలు శ్రీశైలం జలాశయ నీటి ముంపుకు గురౌతున్నందున, వాటిని ఎగువకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొల్లాపురంలో అందుకోసం దేవదాయశాఖ, సబ్‍డివిజన్‍ ఉన్న జటప్రోలు, మంచాలకట్ట, మల్లేశ్వరం, చిన్నమారూరు దేవాలయాల చిత్రాలు గీసి, రాయి రాయికీ …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-4 బాదామీ చాళుక్య మొదటి విక్రమాదిత్యుని కొల్లాపురం రాగిరేకు శాసనం(క్రీ.శ.672) Read More »

ముసల్మానుల కన్నా ముందే వెలిసిన ‘పహాడీ షరీఫ్‍ దర్గా’

గణగణగంటలు మ్రోగే గుళ్లు గోపురాలు, అజాలు వినిపించే గుంబజ్‍లు మినార్లు, ఆదివారం ప్రాతఃకాలం ప్రార్థనలతో కళకళలాడే చర్చ్లు, చాపెల్స్లు లేకపోతే ఈ హైద్రాబాద్‍ నగరం ఇంత అందంగా కనబడేదా? హారం ఒకటే కాని అందులోని పువ్వుల రంగులు మాత్రం వేరువేరు.
‘‘తూ హిందు బనేగ న / ముసల్మాన్‍ బనేగ
ఇన్సాన్‍ కి ఔలాద్‍ హై

ముసల్మానుల కన్నా ముందే వెలిసిన ‘పహాడీ షరీఫ్‍ దర్గా’ Read More »

సమాచార ప్రసార రంగంలో మరో నూతన తరం..5జీ టెక్నాలజీ..!!

(అక్టోబర్‍ సంచిక తరువాయి)


5జీ (భవిష్యత్‍ తరం) :

5జీ ప్రస్తుతం మన దేశంలో అభివృద్ధిదశలో ఉంది. అయితే ముందే చెప్పుకున్నట్లు చైనా, దక్షిణ కొరియాలాంటి దేశాలు ఇప్పటికే 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టాయి. 4జీతో పోలిస్తే, 5జీ చాలా మెరుగైనది మరియు వినియోగదారులకు మరింత వేగవంతంగా సేవలు అందించగలదని సాంకేతిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎన్నో ప్రత్యేకతలు

సమాచార ప్రసార రంగంలో మరో నూతన తరం..5జీ టెక్నాలజీ..!! Read More »

నగర పాలనలో మన పాత్ర

ఎన్నికల్లో ఓట్లు వేసి కార్పోరేటర్లను గెలిపించాం. మమ్మల్ని పాలించండి! మా బాధలు పట్టించుకోండి! మా ఆకాంక్షలు గమనించండి అని చెప్పి ఓటిచ్చాం. ఓట్ల కోసం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చారని, ఎన్నాళ్ళకో కనబడుతున్నారని, ఇంతకాలం మేం బాధలు పడుతుంటే పట్టించు కోలేదని మనలో మనమే గులుగుకున్నాము. కనీసం ఇప్పుడైనా మనం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడి, మనకున్న అధికారాలు, …

నగర పాలనలో మన పాత్ర Read More »

పవనశక్తిని వాడుదాం-పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

ప్రపంచ పవన శక్తి సంస్థ ఆధ్వర్యంలో పిల్లలు, యువత మరియు పెద్దలకు పర్యావరణ హితమైన పవన శక్తి ఉత్పత్తి మరియు వినియోగ ఆవశ్యకతను వివరించే ప్రయత్నాలు చేస్తున్నది. సాంప్రదాయేతర తరగని పునరుత్పత్తి చేయగల శక్తి వనరులలో ముఖ్యమైనదిగా పవన శక్తిని భవిష్యత్‍ శక్తి వనరుగా భావించి వినియోగించుకోవలసిన మార్గాలను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైంది. పర్యావరణ పరిరక్షణను …

పవనశక్తిని వాడుదాం-పర్యావరణాన్ని పరిరక్షిద్దాం Read More »