నీ కోసం ఎదురు చూడని నయనం లేదు
కొన్ని దశాబ్దాల క్రితం ఒక కాలముండేది. గతించిన సంవత్సరాల అందమైన కాలం అది. బంధాల కాలమది. సంబంధాల కాలమది. సంబంధాలన్నిటిని మూట కట్టి, భుజాన వేసుకొని, పాత సైకిల్ ఒకటి ఎక్కి, ఓ బక్క పలచని మనిషి వీధి వీధి తిరిగేవాడు. అతని కోసం ఊరు ఊరంతా ఎదురు చూసేది. అతను ప్రతీ గడప ఎక్కేవాడు. ప్రతీ తలుపు అతని రాక కోసం ఎదురు చూసేది. అతను తలుపు తట్టని ఇల్లు అతని కోసం రోజంతా ఎదురు …









