Author name: deccanland

కొత్త కోర్కెలు

సత్యంకు పెద్ద కోర్కెలంటూ లేవు. కానీ ఎప్పటికప్పుడు కొత్త కోర్కెలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. పదో తరగతి అయినంక ఇంటర్మీడియేట్‍ చదవాలనుకున్నాడు. ఇంటర్‍ అయ్యాక, డిగ్రీ చేయాలనుకున్నాడు. డిగ్రీ అయ్యాక, యూనివర్శిటీలో పీజీ చేయాలనుకున్నాడు. పీజీ అయ్యాక, పిహెచ్‍డి చేయాలనుకున్నాడు. పిహెచ్‍డి అయ్యాక యూనివర్శిటీ ప్రొఫెసర్‍ కావాలనుకున్నాడు. ప్రొఫెసర్‍ అయ్యాక, జాతీయ, అంతర్జాతీయ సెమినార్‍లు తిరగాలనుకున్నాడు. సెమినార్‍లు …

కొత్త కోర్కెలు Read More »

అప్పుడప్పుడు – 10

పున్నమి నీడలలో
సెలయేటి నీటి జాడలలో
వెదురు పిల్లన గ్రోవై
మోగే
రాగాల వెల్లువలో
కాంతి అంతకంతకూ
పదునెక్కుతూ…
చిన్ననాడు
కాంతికి
కళ్ళముందు మెరిసే
కాకి బోడలా
యీ గోడలు
వెలుగుకి
వెలిగిపోతున్నాయి.

పురివిప్పిన నెమిలి
నాట్యం చేస్తుంది
భావాలు
అంత దూరమే
ప్రయాణించడానికి
నడిచి వెళ్ళె దార్లో
పలుకరించే నేస్తాలెన్నో

ఎగిరిపోతే
బోసిబోసైన
గాలి

అప్పుడప్పుడు – 10 Read More »

బహుజనుల ‘మట్టిపొయ్యి’


ఆధునిక కథా రచనకు రాయలసీమ ప్రాంతం ఒక ముడి వనరులాంటిది. ఇక్కడ ఏ రాయిని పలకరించినా, ఏ మట్టిరేణువును తాకినా, ఏ మట్టిమనిషిని కదిలించినా ఒక దు:ఖపూరిత కథనే చాలా ఆర్ద్రంగా వినిపిస్తాయి. ‘గతమంతా తడిసె రక్తమున/ కాకుంటే కన్నీళులతో’ అని శ్రీశ్రీ అన్నట్లుగా వికటించిన మానవ సంబంధాలతోనో, కరువుతోనో, ఫ్యాక్షన్‍ కక్షలతోనో వణికిపోని ఊరు …

బహుజనుల ‘మట్టిపొయ్యి’ Read More »

విశుద్ధ ప్రపంచం కోసం!

బహు ముఖ ప్రపంచానికి
సత్యం చెప్పడం ఒక సాహసమే!

బల్ల గుద్ది మాట్లాడే వాని అంతరంగం
ఒక్క కవికే స్పష్టంగా తెలుస్తుంది!

ప్లాస్టిక్‍ నవ్వుల వెనక దాగిన విషాదాన్ని
పసి గట్టడానికి అక్షరాలే సాధనాలు!

ఈ లోకంలో ఎవరికీ తీరిక లేదు
విశుద్ధ ప్రపంచాన్ని కలగనటానికి కవికి తప్ప!

ఆత్మలు చంపుకున్న వాళ్ళ మధ్య
కవి …

విశుద్ధ ప్రపంచం కోసం! Read More »

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ మహా యజ్ఞంలో ప్రజల భాగస్వామ్యం జరగాలి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరోసారి సార్వత్రిక ఎన్నికలు జరిగి డిసెంబరులో తెలంగాణ రాష్ట్ర సమితి రెండవసారి అధికారంలోకి వచ్చింది. సుస్థిరమైన తెలంగాణ నిర్మాణం కోసం విశాలమైన, విస్తృతమైన దృష్టితో కార్యదీక్షతో ఇంకా మునుముందుకు సాగాలన్న ధృఢమైన ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబంగా ఎన్నికల ఫలితాలు కనిపించాయి. పరిపూర్ణ స్థాయిలో ప్రగతిని అందుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ మహా …

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ మహా యజ్ఞంలో ప్రజల భాగస్వామ్యం జరగాలి Read More »

మరో ఫెస్టివల్‍కు వేదిక కానున్న హైదరాబాద్‍

రచయితలు, కళాకారులు, విద్యావేత్తలు, ప్రచురణకర్తలు, విద్యార్థులు, తదితరుల అందరిని ఒక చోట చేర్చి అన్ని అంశాలపై చర్చించే కార్యక్రమం మళ్లీ ప్రారంభంకానుంది. 2010లో మొదలైన ఈ వేదిక అన్ని విషయాలను తెలియజేస్తూ అందరిలోనూ ఉత్సహం మింపే హైదరాబాద్‍ లిటరరీ ఫెస్టివల్‍ మొదలైంది. అన్ని రకాల రూపాల్లో సృజనాత్మకతను జరుపుకునే వార్షిక కార్యమ్రంగా చెప్పవచ్చు ఈ హైదరాబాద్‍ …

మరో ఫెస్టివల్‍కు వేదిక కానున్న హైదరాబాద్‍ Read More »

తెలంగాణలో కొత్త లోకాలకు తెరతీసిన క్రైస్తవం

మొత్తం దక్కన్‍లో మొట్టమొదటి చర్చి కుతుబ్‍షాహీ కాలంలో ఏర్పాటయింది. 1620 ఆ ప్రాంతంలో ఈ చర్చ్ ప్రారంభమయింది. పోర్చుగీస్‍, ఫ్రెంచ్‍ నుంచి వచ్చిన కాథలిక్‍ అధికారులు గోలకొండలో కుతుబ్‍షాహీ సైన్యానికి శిక్షణ ఇచ్చేవారు. ఈ అధికారులు కట్టడాల నిర్మాణంలో, వ్యవసాయరంగంలోనూ మెలుకువలు నేర్పించేవారు. దీంతో కుతుబ్‍షాహీ రాజులతో పాటు వారి అధికారులకు కూడా వీరిపట్ల గౌరవ …

తెలంగాణలో కొత్త లోకాలకు తెరతీసిన క్రైస్తవం Read More »

భావితరానికి నూతన సవాళ్ళు విసురుతున్న కృత్రిమ మేధస్సు!!

ఓ ప్రముఖ కథానాయకుడు నటించిన ‘‘రోబో’’ అనే చలనచిత్రం తెలుగునాట మంచి విజయం సాధించింది. అందులో ‘‘చిట్టీ’’ అనే పేరుగల రోబో చేసే విన్యాసాలు, సాహస కృత్యాలు ఒక ఎత్తైతే ప్రేమ, అభిమానం, దుఃఖం లాంటి భావావేశాలను కూడా వ్యక్తం చేయడం సినిమా చూసిన వీక్షకులకు కొత్తగానూ, వింతగానూ, విడ్డూరంగానూ అనిపించింది, కానీ అది సినిమా …

భావితరానికి నూతన సవాళ్ళు విసురుతున్న కృత్రిమ మేధస్సు!! Read More »

1948 హైద్రాబాద్‍ పోలీస్‍ యాక్షన్‍


(గత సంచిక తరువాయి)


వెంకటమ్మ స్వగతం:

1942లో నేను పుట్టిన. పుట్టింది పెరిగింది అంతా పాతనగరం హైద్రాబాద్‍లనే. నాకప్పుడు ఆరు సంవత్సరాలు ఉండొచ్చు. యూఖుత్‍పురా దగ్గర ఉండే రయిన్‍బజార్ల గాంధీ విగ్రహం వెనుక సందులో మసీదుకు ఎదురుంగ ఉండేవాళ్లం. ఆ రోజు మా ఇంటి ముందు వాకిట్ల చిన్న పిల్లలకు జిలేబీలు పంచిండ్రు. నేను కూడ …

1948 హైద్రాబాద్‍ పోలీస్‍ యాక్షన్‍ Read More »

గడియారం రామకృష్ణ శర్మ నాటక ప్రస్థానం

నాటి నిజాం పరగణాలో, గద్వాల సంస్థానం ఏలుబడిలో ఉన్న ఆలంపురం గ్రామంలో ఓ వెన్నెల రాత్రుల్లో ఓ సంచార నాటక సమాజం ‘‘సత్య హరిశ్చంద్ర’’ నాటకం ఆడుతున్నది. టిక్కెట్లు కొని ఆ ప్రదర్శన చూడటానికి జనమంతా వచ్చారు. అందరూ కుర్చీలకు అతుక్కుని నాటకం చూస్తున్నారు. అనుభవం కలిగిన నటీనటులు ప్రదర్శిస్తున్న ఈ నాటకానికి వచ్చిన వారంతా …

గడియారం రామకృష్ణ శర్మ నాటక ప్రస్థానం Read More »