Author name: deccanland

‘దోస్తులు చెప్పిన కథల్లో జగదీశ్వర్‍ రచనా పరిపక్వత’’


‘‘బాలలే విజ్ఞాన హేతువులు
నేడురేపుల మధ్య సేతువులు
చంద్రబంధుర సుధాశీతువులు
మానవత్వవికాస ధాతువులు’’

-శీశ్రీ


బాలల కథకుడు పెండెం జగదీశ్వర్‍ అసువులుబాసి ఏడాది. ఆయన్ను సంస్మరించడం సాహిత్య అధ్యాపకుడిగా నా కర్తవ్యం.తెలుగులో బాలసాహిత్యం విస్తృతికి నల్లగొండ జిల్లా వాసిగా జగదీశ్వర్‍ వేసిన దారి వినూత్నమైనది.


ఆయన పూర్ణజీవనం గడిపి ఉంటే బాలసాహిత్య రంగంలో ఇప్పుడు అందరూ …

‘దోస్తులు చెప్పిన కథల్లో జగదీశ్వర్‍ రచనా పరిపక్వత’’ Read More »

నిజ దర్పణం

సమతల
దర్పణమే ఐ తీరాలని
నిబంధనలేం లేవు
జల్లులు జల్లులుగా
వానకురుస్తూ ఉన్నప్పుడు
తుంపర తుంపరలుగా
చూరుచుక్కలు జారవిడుస్తూ ఉన్నప్పుడు
తరచిన అంతరంగంలా
శిలాకెరటాన్ని నునుపుగా చెక్కితే
అద్దంలానే ప్రతిబింబాన్ని పరుస్తుంది
సప్తవర్ణాల నయాసౌధాల నేలగోడల్లో
దీనవదనాలే కాదు


దిక్కులన్నీ కనిపిస్తాయి
మేఘాలు ఢీకొని మెరిసిన
ఆకాశ దర్పణం మీద
భూతల తడితలంపు
చిత్రితమౌతూనే ఉంటుంది

నిజ దర్పణం Read More »

పీఠికలు భిన్నభావాల పేటికలు


పీఠిక, ఉపోద్ఘాతం, ముందుమాట, తొలిపలుకులు ఇలా ఎన్ని రకాల పేర్లు పెట్టినా అవి గ్రంథాని (text)కి, పాఠకుని (target)కి అనుసంధానాలుగా ఉపకరించేవి. గ్రంథకర్త స్వయంగా రాసుకోవచ్చు. తాను పడిన శ్రమ, తనలక్ష్యం, ఇంకా భవిష్యత్తులో చేయవలసిన కృషి, సహకరించిన వారికి కృతజ్ఞతలు మొదలైన అంశాలు రచయిత తన పీఠికలో నివేదించుకొంటాడు. రచయిత తన గ్రంథానికి మరి …

పీఠికలు భిన్నభావాల పేటికలు Read More »

పాద ముద్రలు


చితి మంటల్లో దహించుకుపోతున్న తండ్రి శరీరం వైపు అభావంగా చూస్తూ నిలుచున్నది సుమతి. సుమతి.. ది వైస్‍ ప్రెసిడెంట్‍ ఆఫ్‍ ‘రీ డు’ కంపనీ.
‘రీ డు’ కంపనీ తన మొదటి ప్రయత్నం లోపలే అన్ని వేళలా మనుషులు కృతకృత్యులు కారనీ.. గమ్యాన్ని చేరడానికి మనిషి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండాలనీ.. అలసిపోవడమో.. పథభ్రష్టత …

పాద ముద్రలు Read More »

బంజార జీవితాలను నవరసభరితంగా చూపించిన ‘గోర్‍జీవన్‍’ చిత్రం


సుమారు వంద సంవత్సరాల తెలుగు సినిమా చిరిత్రలో పూర్తిస్థాయిలో బంజారా భాషలో రూపొందిన తొలిచిత్రం గోర్‍ జీవన్‍ సినిమా. ఒకరకంగా ఇది రికార్డ్ అనికూడా చెప్పొచ్చు. 1921లో రఘుపతి వెంకయ్య ‘భీష్మ ప్రతిజ్ఞ’ అనే మూగ సినిమా (మాటలులేని) వీడుదల చేశాడు. పూర్తిస్థాయి మాటలతో 1931లో భక్త ప్రహ్లాద చిత్రం విడుదలైంది. ఆనాటి నుండి నేటి …

బంజార జీవితాలను నవరసభరితంగా చూపించిన ‘గోర్‍జీవన్‍’ చిత్రం Read More »

‘దండకడియం’ అతని కవిత్వం ఒక నిరలంకారపద్యం


తెలంగాణ నేపథ్యంతో, తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించేలా, తెలంగాణ పదబంధాలతో సాహిత్య సృజన చేయడం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఎక్కువగా జరుగుతోంది. ఈ సోయి ఎక్కువగా యువకవుల్లో కనిపిస్తోంది. ఇది ఒక మంచి పరిణామం. అలాంటి యువకవుల్లో ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేర్లలో తగుళ్ళ గోపాల్‍ ఒకటి. ఈ మధ్యనే రంగులద్దిన వాక్యాలలోకి …

‘దండకడియం’ అతని కవిత్వం ఒక నిరలంకారపద్యం Read More »

వివిధ రాష్ట్రాల కమిషన్‍లకు టీఎస్‍పీఎస్సీ ఆదర్శం


ఐదేళ్ల క్రితం ఏర్పడిన కొత్త టీఎస్‍పీఎస్సీ ప్రస్థానం నేడు దేశంలో పలు కమిషన్లు టీఎస్‍పీఎస్సీని అనుసరించే స్థాయికి ఎదిగింది. కమిషన్‍ అనుసరిస్తున్న సాంకేతిక విధానాలను తెలుసుకునేందుకు దేశంలోని 13 రాష్ట్రాల పబ్లిక్‍ సర్వీస్‍ కమిషన్లు టీఎస్‍పీఎస్సీని సంప్రదించడం, 9 రాష్ట్రాల కమిషన్లు సహాయ, సహకారాలు తీసుకోవడం మన పబ్లిక్‍ సర్వీస్‍ కమిషన్‍ విధానాలను గుజరాత్‍ యథాతథంగా …

వివిధ రాష్ట్రాల కమిషన్‍లకు టీఎస్‍పీఎస్సీ ఆదర్శం Read More »

చెర్విరాల భాగయ్య


యక్ష శబ్దం వేదమంత్ర ప్రమాణంగా చూస్తే దైవానికి అనువర్తిత పదంగా చెప్పబడింది. యక్షుజంటి పరమాత్మ అనే అర్థం కూడా నిఘంటువులు తెలియజేశాయి.
యక్షగానం అంటే యక్షులు పాడే పాట అని, మరొక అర్థంలో దైవాన్ని స్తుతిస్తూ చేసే గానం అని కూడా చెప్పుకోవచ్చు.
ఈ యక్ష గాన పక్రియ 15వ శతాబ్దం ఉత్తరార్థం నుండి కన్పిస్తోంది. …

చెర్విరాల భాగయ్య Read More »

చరిత్రలో వెలుగు చూడని చీకటి కోణాలు

(గత సంచిక తరువాయి)
నాసిర్‍జంగ్‍ హత్యకు గురైన తర్వాత ఫ్రెంచ్‍ కంపెనీ వారు ఏడునెలలుగా నాసిర్‍జంగ్‍ ఖైదులో ఉన్న ముజఫ్ఫర్‍ జంగ్‍ (?-1751)ని విడుదల చేసి రాజుగా ప్రకటిస్తారు. దీంతో ముజఫ్ఫర్‍ జంగ్‍ తనకు అండగా నిలిచిన ఫ్రెంచ్‍ కంపెనీకి జింజి, తిరువత్తి తదితర ప్రదేశాలను జాగీర్లుగా దారాదత్తం చేసిండు. నిజాం తర్వాత అంతటి బలవంతుడు …

చరిత్రలో వెలుగు చూడని చీకటి కోణాలు Read More »

ఓయూలో రాతి పనిముట్లు, నాణేలు, శిలాజాల ప్రదర్శన

చరిత్ర పూర్వ యుగం నాణాలు, శిలాజాల ప్రదర్శన అమోఘం : ప్రిన్సిపాల్‍ ప్రొ. డి.రవీందర్‍


చరిత్ర పూర్వ యుగం, చారిత్రక యుగానికి సంబంధించిన ముఖ్య పనిముట్లు, నాణాలు, శిలాజాలను ప్రదర్శనలో ఉంచడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందని ఆర్టస్ కళాశాల ప్రిన్సిపాల్‍ ప్రొఫెసర్‍ డి.రవీందర్‍ అన్నారు. ఓయూ ఆర్కియాలజీ విభాగం ఆధ్వర్యంలో చారిత్రక పూర్వయుగానికి …

ఓయూలో రాతి పనిముట్లు, నాణేలు, శిలాజాల ప్రదర్శన Read More »