తెలిమిన్నపాట అనే వజ్రగీతం
వరువాత గట్లను ముట్టాలనే వేకువ తపనను
అర్థం చేసుకోకపోతే ఎట్లా
చీకటి సుడిగుండంలో చిక్కుకున్న శీతగాలిని
తెగ్గొట్టుకోకతప్పదుజి
దృశ్యాన్ని చూస్తున్న కళ్ళు
బుద్ధిని కోల్పోతే ఇంకేమన్నావుందా
వీస్తోంది కదా అని గాలిని
అసలు వడగట్టకపోతే మరణాన్ని పీలుస్తున్నట్లే
వెలుతురు ఎంత ఏకధాటిగా కాస్తున్నా
ఎక్కడన్న చీకటి మరకలున్నాయేమో చూసుకోవాలి కదా
నిఘంటువులోదే కదా శబ్దం అని…
తెలిమిన్నపాట అనే వజ్రగీతం Read More »









