వృక్ష క్షేత్రం మరికల్ మర్రి
మహబూబ్‍నగర్ జిల్లా వట వృక్షాలకు పేరెన్నిక గన్నది. మహబూబ్‍నగర్ జిల్లా క్షేంద్రం నుండి చుట్టు పక్కల సుమారు 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో అరడజన్ మర్రి వృక్షాలున్నాయి. ఇవన్నీ పర్యాటకానికి అనువైనవే. కాని ఒక పిల్లలమర్రిని మాత్రమే ఇప్పటివరకు ప్రభుత్వం పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసింది. అలా అభివృద్ధి చేయవలసినది, అంతకంటే అందమైన మర్రి మరొకటి పిల్లలమర్రికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దాని పేరు గోసాయి మర్రి. కొన్ని వందల సంవత్సరాల కింద ఈ మర్రి కింద గోసాయిలు …









