చేనుకు చేవ – రైతుకు రొక్కం పచ్చిరొట్ట ఎరువులు
ఆధునిక వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతున్న, పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా దిగుబడులు సాధించలేక పోతున్నారు మన రైతన్నలు. దీనికి ప్రధాన కారణం ఎరువుల యాజమాన్యం రసాయన ఎరువుల వాడకం వలన భూమి నిస్సార మౌవుతున్నాయి. పంటలో రసాయన అవశేషాలు మిగులుతున్నాయి. తద్వారా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించాలి అంటే ఎరువులను సమగ్రంగా అందించాలి. రసాయన సేంద్రియ ఎరువులను మేళవించి ఉపయోగించుకోవాలి. 60 నుంచి 70 శాతం పోషకాలు సేంద్రియ ఎరువులు నుంచి వచ్చేటట్టు జాగ్రత్త పడాలి. …









