సాహిత్యంలో కోర్టులు – చట్టాలు
సాహితీ మిత్రుడు జయప్రకాశ్, తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో ‘కావ్యగానం’ పేరుతో ప్రసిద్ధ కవులతో ‘కావ్యగానం’ చేయిస్తున్నాడు. అందులో భాగంగా 14వ ‘కావ్యగానాన్ని’ నాతో చేయించాడు. కోర్టులు, పోలీస్టేషన్ల నేపథ్యంతో నేను రాసిన ‘హాజిర్‍హై’ని కావ్యగానం చేశాను. ఈ కవితా సంపుటి మీద ప్రముఖ కవి ఎన్ గోపి ఇండియాటుడే తెలుగు పత్రికలో చాలా మంచి వ్యాసం రాసి ఇది జంబో మాత్రమే రాయగలిగే కవితలు అన్నాడు. ఆ తరువాత న్యాయవాద మిత్రుడు కె. జితేంద్రబాబు మూసీ మాసపత్రికలో చాలా మంచి వ్యాసం రాశాడు. ఈ …



