2022

తెలంగాణ గిరి‘జనం’ జాతర


మేడారం మహా జాతర ఓ అద్భుతం. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం. గత ఎనిమిది వందల ఏళ్లుగా ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తున్న ఆదివాసీల ఆరాధ్యదైవాల సజీవ సంస్కృతుల సమ్మేళనం. అడవిబిడ్డల ఆరాధ్యదేవతలైన సమ్మక్క-సారలమ్మ పోరాట పటిమకు.. ధిక్కారస్వరానికి.. ఆత్మగౌరవానికి ప్రతీకలు. ఆదివాసీల పరిభాషలో పంచభూత ప్రకృతి దైవాలుగా విరాజిల్లుతున్న …

తెలంగాణ గిరి‘జనం’ జాతర Read More »

‘రైతు బీమా’ – రూపశిల్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‍రావు

సంక్రాంతి సందర్భంగా ‘రైతు బంధు’ సంబరాలు ఎలా సాగినా కూడా ఒక అంశంలో ప్రభుత్వ చర్యను అభినందించాలి. అది రైతుల జీవిత బీమా పథకం. మ•తుల కుటుంబాలకు ఇది చీకట్లో చిరు దీపం. రూపశిల్పి కల్వకుంట్ల చంద్రశేఖర్‍రావుకు ప్రత్యేక అభినందనలు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించిన రైతు బీమా ఒక ఉదార ప్రయత్నం Farmers …

‘రైతు బీమా’ – రూపశిల్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‍రావు Read More »

పర్యావరణ హితంగా భారతదేశం


గ్లాస్గో సదస్సులో ప్రధాని మోదీ


భారతదేశం రాబోయే యాభైయేళ్ళలో శూన్యస్థాయి కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తుందని ప్రధాని మోదీ గ్లాస్గో సదస్సులో ఇచ్చిన హామీ పర్యావరణ ప్రేమికులను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తింది. పారిస్‍ ఒప్పందానికి కట్టుబడి ఉన్నది మేమేనంటూ భారత్‍ ఈ దిశగా వేసిన అడుగులను వివరించారు ప్రధాని. ప్రపంచ జనాభాలో 17శాతం ఉన్న దేశం, కర్బన …

పర్యావరణ హితంగా భారతదేశం Read More »

భారతదేశపు మొట్టమొదటి యునెస్కో వారసత్వ నగరం అహ్మదాబాద్‍ (గుజరాత్‍)

  • ఏకైక బహుళ సాంస్కృతిక వారసత్వం
  • జూలై 8, 2017న గుర్తింపు


భారతదేశంలోని సబర్మతీ నది తూర్పు ఒడ్డున 15వ శతాబ్దంలో సుల్తాన్‍ అహ్మద్‍ షా స్థాపించిన గోడల నగరం అహ్మదాబాద్‍. ఈ నగరం సుల్తాన్‍ కాలం నాటి గొప్ప నిర్మాణ వారసత్వాన్ని అందిస్తుంది. ముఖ్యంగా భద్ర కోట, కోట నగరం యొక్క గోడలు, ద్వారాలు తదితర …

భారతదేశపు మొట్టమొదటి యునెస్కో వారసత్వ నగరం అహ్మదాబాద్‍ (గుజరాత్‍) Read More »

మహిళల మదిని దోచే మట్టి గాజులు


గాజులు అంటే ఇష్టపడని మహిళలు ఉండరు. బీరువాలో ఎన్ని డిజైన్లలో గాజులు ఉన్నా.. మళ్లీ ఇంకో డజన్‍ గాజులు తీసుకుందాం అనిపిస్తుంది వారికి. ప్రతి చీరకు కూడా మ్యాచింగ్‍ గాజులు తీసుకోవాలని వారికి ఉంటుంది. బంగారు గాజులను వేసుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ, వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి కొందరు బంగారు గాజులు …

మహిళల మదిని దోచే మట్టి గాజులు Read More »

యక్షగాన సాహిత్యంలో కల్పిత కథలు


సామాన్య జనజీవనంలో నుండి ఆవిర్భవించి వర్ధిల్లినవి జానపద కళలు. ఇవి స్వయంభువులు. సామాన్య ప్రజల ఆశలకూ, ఆశయాలకూ, ఆలోచనలకూ, ఆవేదనలకు ప్రతిబింబాలు కావడం వల్ల ఇప్పటికీ సజీవంగానే నిలిచి ఉన్నాయి. జానపద కళలు మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు కాబట్టి ఎంతకాలం మన ఆలోచనల మీద ప్రభావాన్ని చూపుతాయో అంతకాలము అవి నిలిచి వుంటాయి. జానపద …

యక్షగాన సాహిత్యంలో కల్పిత కథలు Read More »

అమ్మదేవతల కొలువు


అడివిలో నివసించే మనుషులకు, వ్యవసాయం చేస్తున్న వారికి భూమి అమ్మ. పిల్లలకు జన్మనిస్తున్న స్త్రీలను, పంటలనిస్తున్న భూమిని పోల్చుకున్నారు. ఇద్దరికి వున్న సంతానశక్తిని చూసి అచ్చెరువు పొందిన పురామానవులు భూమిని స్త్రీగా, అమ్మగా, స్త్రీని అమ్మదేవతగా చేసుకున్నారు. జంతువులలో, చెట్లలో, మనుష్యులలో పునరుత్పత్తి శక్తులను గమనించిన మానవులు వాటి ప్రజనన(ఫెర్టిలిటి) శక్తికి అబ్బురపడిపోయారు. సంతానం కోరి, …

అమ్మదేవతల కొలువు Read More »

ఉప్పు నీరు ఎందుకు చొచ్చుకొస్తుంది?


విశ్రాంత ఆచార్యులు డా. ఈదా ఉదయ భాస్కర్‍ రెడ్డి, పర్యావరణ శాస్త్ర విభాగం,
ఆంధ్రా విశ్వవిద్యాలయం అంతర్జాలంలో అందించిన వ్యాసం.


భూగోళంలో 71 శాతం మేర నీరు ఆవరించి వుంది. అందుకే భూమిని ‘నీటి గోళం’ అని అంటుంటాం. జీవరాశుల ఉనికికి నీరే ప్రధాన కారణం. సుమారు 65 నుంచి 75 శాతం మేర జీవుల …

ఉప్పు నీరు ఎందుకు చొచ్చుకొస్తుంది? Read More »

ఆకాశవాణి హైదరాబాద్‍ కేంద్రం

  • సంగీత సేవలో దక్కన్‍ రేడియో
  • ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం


క్రికెట్‍ మ్యాచ్‍, భద్రాచలం రాములోరి కల్యాణం మనం ఒకప్పుడు ఎలా వినే వాళ్లం.. గుర్తుందా.. ఇంటర్నెట్‍, టీవీలు, ఓటీటీలు ఇవేవీ లేని రోజుల్లో రేడియో ఒక్కటే వార్తలను, వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రజల మన్ననలు చూరగొంది. రేడియో ఎన్నో సంచలనాలు సృష్టించింది. …

ఆకాశవాణి హైదరాబాద్‍ కేంద్రం Read More »

ఇరు ధృవాలు – భూగోళపు రిఫ్రిజిరేటర్లు

ప్రకృతే నియంత్రిస్తుంది! 13 ప్రకృతే శాసిస్తుంది!!



(గత సంచిక తరువాయి)
గత ఆరు దశాబ్దాలుగా అంటార్కిటికాకు సంబంధించిన అనేక వాస్తవాలు, విషయాలు బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఈ శ్వేత ఖండంపై అనేక పరిశోధనలు జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. భూతాపం సముద్రాలపైననే కాకుండా, సహజసిద్ధమైన ఈ మంచు ఖండంపై ఎలా ప్రభావం చూపుతుందో, భవిష్యత్తులో యావత్‍ భూగోళం ఎంతటి …

ఇరు ధృవాలు – భూగోళపు రిఫ్రిజిరేటర్లు Read More »