August

చరిత్రలో చందుపట్ల – విద్దేశ్వరాలయం

కళ్యాణీచాళుక్యులు కొలనుపాక(ఉప)రాజధానిగా క్రీ.శ.973 నుండి రెండవతైలపుని నుండి క్రీ.శ.1156 రెండవ జగదేకమల్లుని వరకు పరిపాలించారు. ఆ తర్వాత కూడా కళ్యాణీచాళుక్యులు కొంతకాలం పాలకులుగా వున్నప్పటికీ అది గణనీయం కాదు. కళ్యాణీచాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లుడు(1076-1126) భువనగిరిపై గొప్పదుర్గాన్ని నిర్మింపజేసాడు. అతని తర్వాత కుమారసోమేశ్వరుడు లేదా భూలోకమల్లుడు(1126-1138), రెండవ జగదేకమల్లుడు (1138-1156) చక్రవర్తులైనారు. భువనగిరిలో త్రిభువనమల్లుని కాలంలో మహాప్రధాన, దండనాయకులుగా తొలుత మల్లచమూపతి తర్వాత అతని సోదరుడు విద్ధమయ్య భువనగిరి దుర్గాధిపతులైనారు. విద్ధమయ్య లేదా విద్ధమరసరు భువనగిరికి సమీపంలోని చందుపట్ల …

చరిత్రలో చందుపట్ల – విద్దేశ్వరాలయం Read More »

క్రీడాస్ఫూర్తిని చాటిన ధ్యాన్‍చంద్‍ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం

భారత క్రీడాకారులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్‍ చంద్‍. భారతదేశంలో క్రీడా దినోత్సవ సృష్టికర్త హాకీ మాంత్రికుడు ధ్యాన్‍చంద్‍. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచమంతట చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్‍ ధ్యాన్‍చంద్‍దే. ఆయన జన్మదినమైన ఆగస్టు 29ని జాతీయ క్రీడాదినోత్సవం జరుపుకోవడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. అయితే జాతీయ క్రీడాదినోత్సవం గురించి చాలా మందికి తెలియదు. ధ్యాన్‍చంద్‍ చరిత్ర, హాకీ క్రీడలో సాధించిన ఘన విజయాలు పాఠ్యాంశంగా చేర్చటం …

క్రీడాస్ఫూర్తిని చాటిన ధ్యాన్‍చంద్‍ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం Read More »

గణితంలో సున్నా ఆవిష్కరణశాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి

మనిషి అవసరాల నుండి పుట్టుకొచ్చినది గణితం. అక్షరాస్యుడికైనా, నిరక్షరాస్యుడికైనా రోజువారి జీవనగమనంలో అడుగడుగునా గణితము యొక్క వినియోగం అనివార్యమైనది.సున్నా అనే పదము సంస్కృత పదము శూన్యము నుండిఉద్భవించింది. దీని అర్థము ఖాళీ లేదా శూన్యము.పురాతన మెసపటేమియా మరియు మాయా నాగరికతలలో సున్నాలు పోలి ఉండే ప్లేస్‍ హోల్డర్‍ చిహ్నాల ప్రారంభఉదాహరణలు కనిపించాయి.భారతదేశంలో ‘సున్నా’ చరిత్ర లోతైన గణిత ఆవిష్కరణల కథ. భారతీయ గణిత శాస్త్రవేత్తలు ముఖ్యముగా ఆర్యభట్టు మరియు బ్రహ్మగుప్తుడు వరుసగా 5మరియు 6 శతాబ్దాలలో సున్నాను …

గణితంలో సున్నా ఆవిష్కరణశాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి Read More »

వేములవాడ చాళుక్యుల విద్యావ్యవస్థ-సంస్థలు

ఉపోద్ఘాతం: దక్కన్‍లో రాష్ట్రకూటుల పాలన సాగుతున్నప్పుడు చాళుక్యులలోని ఒక శాఖను తెలంగాణ ప్రాంతానికి సామంతులుగా నియమించారు. వీరు ముందుగా పోతన లేదా బోధన్‍ను రాజధానిగా చేసుకొని సపాద లక్ష దేశమును పరిపాలించారు. అనంతరం వీరు మూలవాగు ఒడ్డున ఉన్న వేములవాడకు తమ రాజధానిని మార్చి పాలించడం ప్రారంభించారు. నాటి నుండే వీరు వేములవాడ చాళుక్యులుగా ప్రసిద్ధిపొంది చరిత్రలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ వంశంలో మొదటివారు వినయాదిత్య యుద్ధమల్లుడు. వీరు సా.శ.750లో రాజ్యానికి రావడంతో వేములవాడ రాజ్యపాలన ప్రారంభమైంది. …

వేములవాడ చాళుక్యుల విద్యావ్యవస్థ-సంస్థలు Read More »

రెస్క్యూలో సింగరేణి మహిళా ఉద్యోగులు

సింగరేణిలో మహిళా రెస్క్యూ జట్టు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలని, నైపుణ్యం, కృషి, అంకితభావంతో ఉత్తమ సేవలు అందించాలని సింగరేణి సీఎండీ ఎన్‍.బలరామ్‍ పిలుపునిచ్చారు. 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో తొలిసారిగా రెస్క్యూలో శిక్షణ పొందిన మహిళా జట్టును ఆయన హైదరాబాద్‍ సింగరేణి భవన్‍లో జులై 5న అభినందించి, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు.సింగరేణిలో మొదటి మహిళా రెస్క్యూ జట్టును ఏర్పరచడం, ప్రత్యేక శిక్షణ ఇవ్వడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రమాదాల సమయాల్లో, సేవా కార్యక్రమాల్లో మహిళా రెస్క్యూ జట్టు …

రెస్క్యూలో సింగరేణి మహిళా ఉద్యోగులు Read More »

తెలంగాణలో జాతీయ పసుపు బోర్డుగోల్డెన్‍ స్పైస్‍కు ప్రభుత్వ మద్దతు

భారతీయ వంటశాలలలో ముఖ్యమైన సుగంధ ద్రవ్యమైన పసుపు, చివరకు దానికి అవసరమైన మద్దతును పొందుతోంది. జూన్‍ 29, 2025న, కేంద్ర హోం మంత్రి అమిత్‍ షా తెలంగాణలోని నిజామాబాద్‍లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు.పసుపు (కుర్కుమా లాంగా) భారతదేశానికి చెందినది. దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం విస్తృతంగా అధ్యయనం చేయబడింది. ఆహారం, ఆరోగ్య అనుబంధంగా దీనికి ప్రజాదరణ ఉన్నప్పటికీ, పసుపు రైతులు పెద్దగా ప్రయోజనం పొందలేకపోయారు. దశాబ్దాలుగా బోర్డు ఏర్పాటును డిమాండ్‍ చేస్తున్నారు. అక్టోబర్‍ …

తెలంగాణలో జాతీయ పసుపు బోర్డుగోల్డెన్‍ స్పైస్‍కు ప్రభుత్వ మద్దతు Read More »

పూటకూళ్ళవ్వ

(గత సంచిక తరువాయి)(జరిగిన కథ: స్కూల్‍ పిల్లలకు హోమ్‍ థియేటర్‍లో ‘‘స్వచ్ఛ భారత్‍’’కు సంబంధించిన సినిమా చూపిస్తుంది అవ్వ)సినిమా మొత్తం అయిపోగానే పిల్లలకు విడిదిలో చేసిన తీయటి బిస్కట్లు కాగితం ప్లేట్లలో పంచి పెట్టింది. వాళ్ళందరూ ఏదో ఆలోచనలోపడటం గమనించింది అవ్వ.బయటికి వచ్చాక అందరూ ఆ బిస్కెట్లు తిన్నారు. కొంత మంది పిల్లలు ఎప్పటిలా ఖాళీ పేపర్లు వరండాలో పడేయ బోయారు. కొంచెం పెద్ద పిల్లలు వాళ్లను ఆపారు. ‘‘ఈసినిమా చూశాక ఎందుకో అలా పడేయాలనిపించడం లేదురా… …

పూటకూళ్ళవ్వ Read More »

సంవేదన అ సంభాషణ అ సంయనమనం అ సమన్వయం పన్నెండు వసంతాల దక్కన్‍ల్యాండ్‍

కాలానికి ఒక విలువను ఆపాదించేది సందర్భం. భిన్న భిన్న సందర్భాలను కాలమూ, సమాజమూ ఎప్పటికప్పుడు అనుభవిస్తూ, అధిగమిస్తూ ముందుకు సాగుతాయి. ఈ ప్రయాణంలోని సంక్లిష్టతలను అర్థం చేసుకుంటూ నిర్మాణాత్మక ఆలోచనలనూ, ఆచరణలనూ ప్రోది చేసే వివిధ రంగాలలో పత్రికారంగం అత్యంత కీలకమైనది. గత పన్నేండ్లుగా దక్కన్‍ల్యాండ్‍ మాస పత్రిక ఈ బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తున్నది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన ఆవశ్యకతను చర్చించే వేదికగా, ప్రజాస్వామ్య భావజాల వేదికగా, సమస్త ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణ వేదికగా 2012 …

సంవేదన అ సంభాషణ అ సంయనమనం అ సమన్వయం పన్నెండు వసంతాల దక్కన్‍ల్యాండ్‍ Read More »

దాశరథి కృష్ణమాచార్య

తెలంగాణలో జన్మించిన, గణనీయ వైతాళికులలో, మహాకవి దాశరథి అగ్రేసరులు.‘‘ప్రాణము లొడ్డి ఘోరగహనాటవులన్‍ బడగొట్టి, మంచి మాగాణములన్‍ స•జించి, ఎముకల్‍ నుసిచేసి, పొలాలు దున్ని, భోషాణములన్‍ నవాబుకు స్వర్ణము నిండిన రైతుదే తెలంగాణము రైతుదే;ముసలినక్కకు రాజరికంబు దక్కునే’’అంటూ గర్జించి, హైదరాబాద్‍ సంస్థానవిముక్తి మహో ద్యమంలో దూకి, నిజాం నవాబు – మీర్‍ ఉస్మాన్‍ అలీఖాన్‍ను ఎదిరించి, తెలంగాణ విముక్తికై కారాగారశిక్ష అనుభవించి, లక్ష్యాన్ని సాధించిన స్వాతంత్రోద్యమ కవి సింహం దాశరథి. దాశరథి పూర్తి పేరు. దాశరథి కృష్ణమాచారి. దాశరథి …

దాశరథి కృష్ణమాచార్య Read More »

నవరత్నాలలో గోమేధికం

గార్నెట్‍ అందరికి బాగా తెలిసిన ఒక రత్నం. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. నాగరికత ప్రారంభ మైనప్పటి నుండి అన్ని సంస్కృతులలో దాని సులభ లభ్యత కారణంగా ప్రజాదరణ పొందింది. ఇది నవరత్నాలలో భాగం. రాహువుకు ప్రతీకగా భావిస్తారు. దీన్ని కలియుగరత్నం అనీ, విశ్వాసరత్నం (Gem of Faith) అని కూడా అంటారు. గార్నెట్‍ అనే పేరు లాటిన్‍ పదం గ్రానాటస్‍(అంటే విత్తనాలు) నుండి వచ్చింది. దానిమ్మ గింజలకు గార్నెట్‍కు ఉండే దగ్గరి పోలిక ఒక కారణం …

నవరత్నాలలో గోమేధికం Read More »