సూగూరు చరిత్ర
సూగూరు గ్రామం మండల కేంద్రమైన పెబ్బేరు నుండి 10 కి.మీ. దూరంలోను, సమీప పట్టణమైన జిల్లా కేంద్రం వనపర్తి నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. ఇపుడున్న సూగూరుకు పాతగ్రామం ఆనవాళ్ళున్న సూగూరు పాటిగడ్డ ఉంది. సూగూరు ఒకప్పుడు సంస్థానం రాజధాని. ‘సొగ’ అంటే ధైర్యం అని అర్థముంది. సొగంఊరు = సొగూరు, రానురాను ‘సూగూరు’ అయింది పలుకుబడిలో. వనపర్తి సంస్థాన మూలపురుషుడు వీర కృష్ణారెడ్డి కడప దగ్గరి జనుంపల్లి నుంచి కృష్ణానది తీరాన ఉన్న …









