July

జ్ఞాపిక అనగానే గుర్తొచ్చేవి…పెంబర్తి మెమెంటోలు

జ్ఞాపిక అనగానే గుర్తుకొచ్చేవి పెంబర్తి హస్తకళారూపాలు అంటే అతిశయోక్తి కాదు. వరంగల్‍ జిల్లా జనగాం మండలానికి చెందిన గ్రామం పెంబర్తి హస్త కళాఖండాలకు దేశవ్యాప్తంగా గొప్ప పేరున్నది. ఇక్కడ తయారయ్యే ఇత్తడి కళారూపాలు, నగిషీలు, జ్ఞాపికలు ప్రసిద్ది కాకతీయుల కాలం నుండి పేరొందాయి.
పెంబర్తి హస్తకళాకారుల లోహపు రేకుల కళను పెంబర్తి లోహ హస్తకళలుగా వ్యవహరిస్తారు. పెంబర్తి లోహ హస్తకళలు ఎక్కువగా ఇత్తడి, కంచు లోహాల మీద
ఉంటాయి. కాకతీయుల కాలం నుండి …

జ్ఞాపిక అనగానే గుర్తొచ్చేవి…పెంబర్తి మెమెంటోలు Read More »

విచారణే ఓ పెద్ద శిక్ష..!?

తెలుగు కవి ఓ కవితలో ఇలా అంటాడు
‘‘ఎన్నో సంవత్సరాల
విచారణ అనే శిక్షని ఎదుర్కొన్న తరువాత
రాబోయే శిక్ష ఏ పాటిది
ఈ దేశంలో
ట్రయలే ఓ పెద్ద పనిష్మెంట్‍’’

నిజమే. మనదేశంలో ట్రయలే ఓ పెద్దపనిష్మెంట్‍. విచారణ ఖైదీలుగా ఎంతో మంది జైళ్లల్లో బతుకులీడుస్తున్నారు. ఇంకా ఎంతో మంది బెయిల్‍ మీద వుండి …

విచారణే ఓ పెద్ద శిక్ష..!? Read More »

నల్లమలలో చల్లని పర్యటనలు

‘‘నీ కడుపు చల్లగుండ’’.
పెద్ద మనుషులు మనల్ని దీవించేటప్పుడు మనకు వినిపించే ప్రధాన వాక్యం ఇది. కారణం మనది వేడి ప్రదేశం… కాబట్టి మనకు చల్లదనం కావాలి. వేసవి కాలపు సెలవుల్లో చల్లదనం కోసం కూర్గ్, ఊటీ, కొడైకెనాల్‍, కుల్లు-మనాలి వంటి ప్రదేశాలకు ప్లాన్‍ చేసుకుంటుంటాం. డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఒక్కసారి మన తెలంగాణలోనే ఏవైనా …

నల్లమలలో చల్లని పర్యటనలు Read More »

బాలచెలిమి గ్రంథాలయంతో సెలవుల సద్వినియోగం

నందిమేడారం గ్రామం, ధర్మారం మండలం, పెద్దపల్లి జిల్లా

చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ సొసైటీ హైదరాబాద్‍ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల చెలిమి గ్రంథాలయం గత మార్చి నెలలో పెద్దపెల్లి జిల్లా, ధర్మారం మండలం,  నందిమేడారం గ్రామంలో ఏర్పాటు చేయడమైంది. జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాలలో ప్రారంభించిన ఈ గ్రంథాలయం సెలవుల్లో తమ విరామ కాల సద్వినియోగానికి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.…

బాలచెలిమి గ్రంథాలయంతో సెలవుల సద్వినియోగం Read More »

వలస బతుకులు

‘‘ఏమే’’ అంటూ బార్య తులసమ్మ వైపు చూస్తూ పలకరిం చాడు ఆమె పెనిమిటి చంద్రయ్య. అతనలా పిలువగానే ‘‘ఏందయ్యా’’ అంటూ అతనివైపు చూస్తూ మారడిగింది. ‘‘పొయ్యి కాడ ఎంతసేపు కూలవడ్తవ్‍, వంట జల్ది కానియ్యరాదే సుతారం జెయ్యక, ‘‘అంటూ గొనిగాడు తలపై చేతితో రుద్దుకుంటూఅతను చూడనికె దుక్కలా కరుకుదేలి చామన చాయతో వుంటాడు కోలమొఖంతో నెత్తికి …

వలస బతుకులు Read More »