November

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -5

ప్రకృతి సూత్రాలలో 18వది – అనగా జీవశాస్త్రపరంగా నాల్గోది : చివరిదిజీవులన్నీటి మధ్యన ఒకదానితో ఒకటి పాదార్థిక బంధాన్ని కల్గివున్నాయి.(All Life Forms are connected to each other) మనిషిది వానర వారసత్వమంటే నమ్మనివారు, నమ్మేవారు ప్రపంచవ్యాపితంగా వున్నారు. ఇందులో చదువుకున్నవారే అధికులు కావడం గమనార్హం! వీరెవ్వరికి చార్లెస్‍ డార్విన్‍ ప్రతిపాదించిన ప్రకృతివరణ సిద్ధాంతం (Natural Selection) చెవికెక్కదు. పైగా విద్యాధికులు కొందరు పనిగట్టుగొని ఈ సిద్ధాంతాలకు, సైన్సుకు వ్యతిరేకంగా పనిచేయడం తెలిసిందే! మరి ఈ …

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -5 Read More »

మౌఢ్యంతో పోరాడిన హేతువాది, న్యూక్లియర్‍ సైంటిస్ట్: డా.హెచ్‍.నరసింహయ్య

నాలుగు చెరగులా కల్ల, కపటం, ప్రచారం, కృత్రిమత్వం, వ్యాపారధోరణి డొంకదార్లు – ఇలా పరచుకుని సమాజం సాగుతున్న వేళ కొందరు పోరాట యోధుల గురించి తప్పక తెలుసుకోవాలి! అలాంటి అపురూపమైన వ్యక్తి హెచ్‍.ఎన్‍.గా ప్రఖ్యాతులయిన డా.హెచ్‍.నరసింహయ్య! పదమూడవ ఏట నుంచి ఖాదీని వదలని వ్యక్తీ, అమెరికాలో న్యూక్లియర్‍ ఫిజిక్స్లో పిహెచ్‍.డి. చేసిన వ్యక్తీ, సత్యసాయి మహిమలను పరీక్షకు నిలిపిన వ్యక్తీ, క్విట్‍ ఇండియా ఉద్యమంలో చదువు వదలి చెరసాలకేగిన వ్యక్తీ, కర్నాటక సంగీతం, సంఘసేవ, గాంధీ, వివేకానందలను అమితంగా ఇష్టపడిన …

మౌఢ్యంతో పోరాడిన హేతువాది, న్యూక్లియర్‍ సైంటిస్ట్: డా.హెచ్‍.నరసింహయ్య Read More »

తెలంగాణ జానపద కళలు అస్థిత్వపు మూలాలు – మనుగడ

తెలంగాణా సంస్కృతిలో జానపద కళలు అంతర్భాగం. విభిన్న పక్రియలతో అనాదిగా తమకు సంక్రమించిన సాహిత్యం, ప్రదర్శనా నైపుణ్యంతో సమాజంలో మనుగడ సాగిస్తున్నవి. వైవిధ్యమైన ఈ మట్టి కళలు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, చరిత్రకు ప్రతీకగా నిలుస్తున్నవి. జానపద కళలు ఆశ్రిత, ఆశ్రితేతర కళారూపాలుగా విభజింపబడ్డాయి. నేటి ఆధునిక కాలంలో కూడా తమ మూల సంస్కృతిని పరిరక్షించుకుంటూ మార్పులకనుగుణంగా తమ అస్తిత్వాన్ని, ఉనికిని కాపాడుకుంటున్నాయి. ఆశ్రిత కళారూపాలు కేవలం ఒక ప్రత్యేక కులాన్ని మాత్రమే ఆశ్రయించి, కళా ప్రదర్శనల …

తెలంగాణ జానపద కళలు అస్థిత్వపు మూలాలు – మనుగడ Read More »

కాయగూరల వాషింగ్‍ & ప్యాకింగ్‍ పరిశ్రమ

నిత్యజీవితంలో ఆహార పదార్థాల తయారీలో కాయగూరలకు వున్న ప్రాధాన్యత మనందరికి తెలిసినదే. శరీరానికి అవసరమైన పోషక విలువలకు, విటమిన్లను, ఖనిజాలను, ప్రొటీన్లు వంటి వివిధ ఆవశ్యపు పదార్థాలను కాయగూరలు అందించి, సరైన శారీరక, మానసిక వికాసానికి తోడ్పడమే కాకుండా రోగనిరోధకశక్తిని వృద్ధి చేసి అనేక రోగాలను రాకుండా నిరోధించగలిగే శక్తి నాణ్యమైన కాయగూరలకు ఉంటుందని శాస్త్రీయంగా రుజువైంది. కాని నేటి పరిస్థితులలో నాణ్యమైన, తాజా కాయగూరల లభ్యత ముఖ్యంగా నగర, పట్టణ వాసులకు కష్టతరమౌతున్నదని చెప్పవచ్చు. కాలుష్య …

కాయగూరల వాషింగ్‍ & ప్యాకింగ్‍ పరిశ్రమ Read More »

తెలంగాణా ఎత్తిపోతల జలపాతం

ఎవరైనా ఎత్తిపోతల జలపాతం ఎక్కడుందంటే ఠక్కుమని నాగార్జునసాగర్‍ దగ్గరుందని చెప్తారు. కాని, మెదక్‍ జిల్లాలో ఉన్న జహీరాబాద్‍ దగ్గర కూడా అదే పేరుతో మరో జలపాతముందని ఎవరూ చెప్పలేరు. అందరికీ తెలిసిన ఎత్తిపోతల జలపాతం రాతి గుట్టల మీద నుంచి దూకితే మనం తెలుసుకోబోతున్న జలపాతం రాతిమట్టి గుట్టల మీది నుంచి దూకుతుంది. ఈ ఎత్తిపోతల జలపాతం మూడు జలపాతాల సముదాయం. తూర్పు నుంచి పడమర వైపు వడివడిగా ప్రయాణిస్తున్న వాగు మూడు పాయల జలపాతంగా మారగా, దీనికి కుడివైపు నుంచి జలజల …

తెలంగాణా ఎత్తిపోతల జలపాతం Read More »

టంగ్‍ యంగ్‍

చాలా కాలం క్రితం చైనా దేశంలో టంగ్‍ యంగ్‍ అనే పదేళ్ళ కుర్రవాడు ఉండేవాడు. ఒక అవిటి తండ్రి తప్ప అతనికి నా అనేవాళ్లు ఎవరూ లేరు. ఆ అవిటి తండ్రి కూడా ఎప్పుడూ ఏదో ఒక రోగంతో అవస్థ పడేవాడు. రోజంతా కుక్కి మంచంలో పడుకొని మూలుగుతూ ఉండేవాడు. దాంతో సంసార భారమంతా పాపం టంగ్‍ యంగ్‍ మీద పడింది. పసివాడయినా టంగ్‍ యంగ్‍ అల్లరి చిల్లరిగా తిరిగేవాడు కాదు. తోటి పిల్లలంతా ఆటపాటలతో కాలక్షేపం …

టంగ్‍ యంగ్‍ Read More »