ప్రాకృతిక బసాల్ట్ స్తంభాలు
దక్కన్ పీఠభూమిలో పశ్చిమదిశగా మహారాష్ట్ర కేంద్రంగా చుట్టు పక్కల రాష్ట్రాలలో దాదాపు 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న బసాల్ట్ పొరలు ఉంటాయి. ఇవి తక్కువ ఎత్తులో ఉన్న చదునైన గుట్టలరూపంలో ఉంటాయి. వీటి ఆకారం మెట్లవలె ఉన్నందున ఇంకా అవి దేశంలో దక్షిణం వైపు ఉన్నందున వీటిని ‘‘దక్కన్ ట్రాప్’’లు అంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ రంగారెడ్డి మరియు మహబూబునగర్ జిల్లాలో ఈ దక్కన్ ట్రాపులు వ్యాపించి ఉన్నాయి. …









