వరద బాధితులకు సింగరేణి ఉద్యోగుల సాయం
తెలంగాణ వరద బాధితుల కోసం సింగరేణి కాలరీస్ అధికారులు, ఉద్యోగులు తమ ఒకరోజు బేసిక్ జీతం 10.25 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఈ చెక్కును గురువారం (సెప్టెంబర్ 19) రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు, అధికారుల సంఘం నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్, …









