ప్రకృతే సౌందర్యం! 23 ప్రకృతే ఆనందం!! తిండి పోతులం! ఆహారపు గొలుసులో మేమే తోపులం!!
జీవజాతులలో పరిమాణం దృష్ట్యా భూచరాలల్లో ఏనుగును, ఖడ్గమృగాన్ని, నీటిగుర్రాన్ని అతిపెద్ద జంతువులుగా గుర్తిస్తే, జలచరాలల్లో పెద్దజంతువులుగా సొరచేపని, తిమింగలాన్ని ప్రస్తావిస్తాం! భూ, జలచరాల్లో అన్నింటా తిమింగలమే అతిపెద్ద జంతువు. భారీకాయంతో, సుమారు 100 అడుగుల పొడవుతో, 150 టన్నుల (బ్లూవేల్) బరువుతో వుండే తిమింగలం నాలుకే మూడు టన్నులంటే నమ్మశక్యం కాదు. అయితే జంతువుల పరిమాణంను కచ్చితంగా తేల్చడం కష్టమైనపని. జంతువు యొక్క బరువు, పొడవు, ఎత్తు, శరీర సాంద్రత (ఎ•••) తదితర కొలతలు, తూకాలు అనేక…









