‘‘నేను నీవై
నీవు నేనై
నా శ్వాస నీదై
నీ శ్వాస నాదై
మనిద్దరిదీ ఒకటే ధ్యాసై’’
ఇవన్నీ
ఒన్లీ ఇల్యూజన్సాఫ్ ఎమోషన్స్
వద్దు
మనకొద్దు
ఈ అసంబద్ధ అసంగతాలు మనకొద్దు…
నీవు నీవులా వుంటూ
నేను నేనులా వుంటూ
మనం మనంలా వుందాం
కలిసుందాం…విడిపోదాం…కలిసుందాం…
మనకి
ఎప్పుడు
ఏది యిష్టమైతే అలా వుందాం…
ఆధిపత్యానికీ బానిసత్వానికీ
చోటులేని చోటు కదా..
ఈ ప్రేమావరణం..
-జుగాష్ విలి
ఎ : 98482 66384