deccanland

ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే రాజ్యాంగ పరిరక్షణ

ప్రజలకోసం ప్రజలచే నిర్వహించబడే అత్యుత్తమ పాలనా విధానం ప్రజాస్వామ్యం. ఎన్నికలు ప్రజాస్వామ్య భావనకు గీటురాయిగా ఉంటున్నాయి. మన దేశంలో ధనిక, పేద, కుల, మత, స్త్రీ, పురుష, ప్రాంతీయ తేడాలు లేకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉన్నది. తమకు ఇష్టమైన వారిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉన్నది. అంతేకాదు. వీరందరికీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కుకూడా వుంది. ఈ ఎన్నికల పక్రియే ప్రపంచంలో మన దేశాన్ని గొప్ప ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు …

ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే రాజ్యాంగ పరిరక్షణ Read More »

అనుముల కృష్ణమూర్తి

‘‘ఎవని మనసు శిశు స్వచ్ఛమెవని బుద్ధిజాతి చైతన్య సంపన్నమెవని యాత్మసర్వతో ముఖ కల్యాణ సవనకుండమట్టివాని గుండెల నుండి బుట్టు కవిత’’అని కవికి కవితోత్రికి భాష్యం చెప్పిన అనుముల క•ష్ణమూర్తి గారు కొద్దిక•తులు మాత్రమే వెలువరించినా కవులలో మహాకవి, పండితులలో మహా పండితులు.ఆంధ్రనగరికి (ఓరుగల్లుకు) అనుబంధంగా మణిగిరి (మడికొండ) అనే గ్రామమున్నది. అది తెలుగుదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన గ్రామం. ఎందుకంటే ఆ గ్రామం నిండా పండితులు, కవులే. కాళోజీ సోదరులు, వానమామలై సోదరులు, పల్లా దుర్గయ్య గారు, బిరుదురాజు రామరాజు, …

అనుముల కృష్ణమూర్తి Read More »

కెంపుల సొంపులు

మాణిక్యం:రూబీని సంస్క•తంలో మాణిక్యం అని, తెలుగులో కెంపు అని అంటారు. రూబీ దాని రంగు షేడ్‍ కారణంగా అనేక ఇతర పేర్లను పొందింది.నాగరికత ప్రారంభమైనప్పటి నుండి మానవులకు రూబీ బాగా పరిచయం. మరే ఇతర పదార్థంలో లేని ఎరుపు రంగు యొక్క గాఢత మానవ ద•ష్టిని ఆకర్షించింది. ఇది అన్ని నాగరికతలలోను చాలా విలువైనది గా పరిగణించబడ్డది.హిందూ పురాణాల ప్రకారం, అన్ని రత్నాల మూలం చంపబడిన రాక్షసుడు బలి యొక్క శరీర భాగాలకు ఆపాదించ బడింది. మాణిక్యాలు …

కెంపుల సొంపులు Read More »

చెల్లా చెదురుగా పడి ఉన్న శిల్పాలు దిక్కూమొక్కు లేని దేవాలయాలు

ఆ వూరు ఎల్లకొండ. చుట్టుపక్కల ఊళ్ల కంటే ఎత్తైన కొండ. ఆ కొండ సానువుల్లో రాతిని తొలచి మలచిన గుహాలయాలు. కొన్ని శివాలయాలైతే, మరికొన్ని జైనాలయాలు. రాష్ట్రకూట శైలి శివలింగాలు, గణేశ శిల్పాలు ఒకవైపు, కళ్యాణీ చాళ్యుశైలి వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుని శిల్పాలు మరోవైపు. నిత్యార్చనలతో కళకళలాడి, మంత్రోచ్ఛారణలతో వెలుగొందిన ఆ గుహాలయాలోని విగ్రహాలకు అభిషేక జలాన్నందించిన నలు చదరపు నడబావి. అక్కడ చక్కగా తీర్చిదిద్దిన ఆలయాలుండేవని సాక్ష్యం పలుకుతున్న ద్వారశాఖలు, గోడరాళ్లు, మధ్యయుగం కంటే ముందే …

చెల్లా చెదురుగా పడి ఉన్న శిల్పాలు దిక్కూమొక్కు లేని దేవాలయాలు Read More »

రాచిప్పల పచ్చిపులుసు

రాచిప్ప అంటే రాతి చిప్ప అని అర్థం. ముప్పై వేల సంవత్సరాలకు పూర్వం పాతరాతి యుగం దాటి కొత్త రాతి యుగంలకు ఆదిమ మానవుడు ప్రవేశిస్తున్నప్పుడు రాళ్లను చెక్కి, సానపట్టి పదునుగా నూరిన వాటిని కత్తులుగా, వేటాడే ఆయుధాలుగా, గుంటలుగా మారిన మిగిలిన రాళ్లను వేట మాంసాన్ని దాచుకునే పాత్రలుగా వాడుకునే వాడు. అవే రాచిప్పలుగా ఉనికిలోకి వచ్చాయి. అప్పటికింకా పశుపోషణ, వ్యవసాయం ప్రారంభం కాలేదు. రాచిప్పలు అట్లా వాడుకలోకి వచ్చి, మా చిన్నతనంల అంటే 75 …

రాచిప్పల పచ్చిపులుసు Read More »

మాకూ… జీవించే స్వేచ్ఛ నివ్వరూ… ఏ గ్రేట్‍ ఇండియన్‍ బస్టర్డ్

నింగి, నేల, నీరు, నిప్పు, గాలి… అనేవి పంచభూతాలు. మనిషి శరీరం పాంచభౌతికం అన్నది శాస్త్రం. ‘‘పంచభూతాల సమాహారమే ఈ ప్రకృతి’’ అంది ప్రాచీన సాహిత్యం. అయితే మనిషి ఈ పరమసత్యాన్ని విస్మరించాడు. పంచభూతాల్లో దేన్నీ సజావుగా, సహజంగా మననీయడం లేదు. మనిషి ఎక్కడున్నా విచ్ఛిన్నమే! అడుగిడిన ప్రతిచోటా పర్యావరణ విధ్వంసమే అని మనిషి – ప్రకృతి గ్రంథంలో పెర్కిన్స్ మార్ష్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. పచ్చటి అడవులన్నీ మటుమాయమై కాంక్రీట్‍ అరణ్యాలుగా మారుతూ… చెరువులు, …

మాకూ… జీవించే స్వేచ్ఛ నివ్వరూ… ఏ గ్రేట్‍ ఇండియన్‍ బస్టర్డ్ Read More »

కర్ణాటక రాష్ట్రంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు

కర్ణాటక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం జియోలాజికల్‍ మాన్యుమెంట్స్గా గుర్తించిన స్థలాలు నాలుగు (4). 1) మరిడిహల్లి పిల్లో లావాస్ట్రక్చర్‍, చిత్రదుర్గా జిల్లా2) లాల్‍భాగ్‍, బెంగళూరులోని పెనిన్‍సులర్‍ గ్నైస్‍3) సేంట్‍ మేరీస్‍ ద్వీపంలోని కాలమ్‍నార్‍ జాయింట్స్ వల్కానిక్స్లో4) పెద్దపల్లిలోని పైరోక్లాస్టిక్‍ శిలలు, కోలార్‍ జిల్లాఈ జియోహెరిటేజ్‍ స్థలాలు వివరణ క్రింద ఇవ్వబడినది. మరిడిహల్లి పిల్లోలావా స్ట్రక్చర్‍మరిడిహల్లిలోని పిల్లోలావా స్ట్రక్చర్‍ చిత్రదుర్గా టౌన్‍కు 16 కి.మీ. దూరంలో సౌత్‍ ఈస్ట్ దిశలో మరియు ఆయమంగలం గ్రామానికి 4 కి.మీ. దూరంలో …

కర్ణాటక రాష్ట్రంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు Read More »

సుందర నగరాల్లో ఛిద్రమౌతున్న బాల్యం

నేపథ్యం:వేగావంతమవుతున్న పట్టణీకరణతో పాటు పట్టణాలలో పేదలు నివసించే ప్రాంతాల జనాభా కూడా పెరుగుతుంది సుమారు ఆరు కోట్ల యాభై లక్షల మంది ప్రజలు అంటే పట్టణ జనాభాలో 27% మంది అరకొర వసతులున్న ఈ బస్తీలలో నివసిస్తున్నారని 2011 జనాభా లెక్కలు నివేదించాయి. 2011 తర్వాత అధికారికంగా మురికివాడల జనాభా లెక్కలు ఏమీ లేవు గాని ఈ 13 సంవత్సరాల కాలం లో గ్రామీణ శ్రామిక పేదలు నగరాలకు తరలడం పెరుగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి …

సుందర నగరాల్లో ఛిద్రమౌతున్న బాల్యం Read More »

మే 3న పత్రికా స్వేచ్ఛా దినోత్సవం

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 3న నిర్వహించబడుతుంది. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్‍ జర్నలిస్టులు 1991, ఏప్రిల్‍ 29 నుండి మే 3వ తేదీవరకు ఆఫ్రికాలోని నమీబియా దేశపు విండ్‍ హాక్‍ నగరంలో సమావేశం ఏర్పాటుచేసి, పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అనేక తీర్మానాలు వచ్చాయి. ఆఫ్రికన్‍ జర్నలిస్టుల నిరసనగా గుర్తుగా …

మే 3న పత్రికా స్వేచ్ఛా దినోత్సవం Read More »

జీవవైవిధ్యంతో పశ్చిమ కనుమలు

ఉనికి: మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళలో 39 సీరియల్‍ సైట్స్గుర్తింపు : 2012విభాగం : నేచురల్‍సార్వత్రిక విలువ:భారతదేశ పశ్చిమ తీరం పొడుగునా కొండల గొలుసుగా ఉండే పశ్చిమ కనుమలు హిమాలయ పర్వతాల గొలుసు కంటే ప్రాచీనమైనవి. ఇవి ఈ ప్రాంతపు ఉష్ణ వాతావరణాన్ని చల్లబరిచేలా భారతీయ రుతుపవనాల తీరుతెన్నులను మారుస్తాయి. వీటికి ఉన్న మరో విశిష్టత జీవపరమైన వైవిధ్యత, స్థానికంగానే కనిపించే కొన్ని జీవజాతులు. ఇవే వీటికి ప్రక•తి పరిరక్షణపరంగా అపరిమిత ప్రాధాన్యాన్ని కూడా అందించాయి. ప్రాథమ్యాలు: …

జీవవైవిధ్యంతో పశ్చిమ కనుమలు Read More »