కర్ణాటక రాష్ట్రంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు

కర్ణాటక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం జియోలాజికల్‍ మాన్యుమెంట్స్గా గుర్తించిన స్థలాలు నాలుగు (4).

1) మరిడిహల్లి పిల్లో లావాస్ట్రక్చర్‍, చిత్రదుర్గా జిల్లా
2) లాల్‍భాగ్‍, బెంగళూరులోని పెనిన్‍సులర్‍ గ్నైస్‍
3) సేంట్‍ మేరీస్‍ ద్వీపంలోని కాలమ్‍నార్‍ జాయింట్స్ వల్కానిక్స్లో
4) పెద్దపల్లిలోని పైరోక్లాస్టిక్‍ శిలలు, కోలార్‍ జిల్లా
ఈ జియోహెరిటేజ్‍ స్థలాలు వివరణ క్రింద ఇవ్వబడినది.

మరిడిహల్లి పిల్లోలావా స్ట్రక్చర్‍
మరిడిహల్లిలోని పిల్లోలావా స్ట్రక్చర్‍ చిత్రదుర్గా టౌన్‍కు 16 కి.మీ. దూరంలో సౌత్‍ ఈస్ట్ దిశలో మరియు ఆయమంగలం గ్రామానికి 4 కి.మీ. దూరంలో ఉత్తర దిశలో కలదు. బెంగళూరు నుండి 180 కి.మీ. దూరంలో ముంబై బెంగళూరు రహదారి (ఎన్‍హెచ్‍-41)కి చేరువగా వున్నది. ఈ స్ట్రక్చర్‍ జియోలాజికల్‍గా చిత్రదుర్గా శిస్ట్ బెల్ట్లోని భాగం. ఇది ప్రపంచంలోని బెస్ట్ పిల్లోస్ట్రక్చర్స్లో ఒకటిగా నిర్ధారించబడినది.
ఈ పిల్లో లావా స్ట్రక్చర్స్ ఫారమ్‍ అయ్యే విధానం ఏమిటంటే, సముద్రమట్టంలో అగ్నిపర్వతం బద్ధలై, లావా ఒక్కసారిగా నీటితో కలిసి కూలింగ్‍ కావడం వల్ల ఇలాంటి స్ట్రక్చర్స్ ఏర్పడడం జరుగుతుంది. వీటి వయస్సును డేటింగ్‍ మెథడ్స్ ద్వారా 2500 మిలియన్‍ సంవత్సరాలుగా నిర్ధారించబడినది. ఇలాంటి స్ట్రక్చర్స్ బసాల్టిక్‍ కాంపొజిశన్‍ గల శిలలో ఏర్పడతవి. ఓసియానిక్‍ క్రస్ట్ యొక్క పై భాగంలోనే ఇవి దొరుకును. ఎప్పుడైతే శిల యొక్క కాంపొజిషన్‍ ఇంటర్‍మీడియట్‍గా ఉంటుందో అప్పుడు పిల్లోల సైజ్‍ పెరుగుతుంది.

పెనిన్‍సలర్‍నైస్‍, లాల్‍భాగ్‍, బెంగళూరు
ఈ పెనిన్‍ సలర్‍నైస్‍ ఇండియన్‍ పెనిన్‍సులాలోని 1/3వ భాగంలో విస్తరించి యున్నది. ఇది ఏర్పడిన విధానం ఏమిటంటే, పూర్వం ఉన్న రకరకాల శిలలు గ్రానిటైనేఫన్‍ ప్రాసెస్‍ వల్ల గ్రానైట్‍-నైస్‍ శిలగా మార్చబడినవి. బెంగళూరులోని లాల్‍ భాగ్‍లో చాలా మంచి ఎక్స్పోజర్‍ కలదు. సిటీలో మరియు ప్రముఖమైన బొటానికల్‍ గార్డెన్‍లో ఉండడం వల్ల అందరికి అందుబాటులో వుంటుందన్న కారణం వల్ల దీన్ని జియోలాజికల్‍ మాన్యుమెంట్‍గా గుర్తించారు. ఈ నైస్‍ కోర్స్గ్రేస్డ్, హైగ్రేడ్‍ మెటమార్ఫిక్‍ శిల. ఈ శిలలో ఆల్ట్రనేట్‍ డార్క్, లైట్‍ బ్యాండ్స్తో చూడటానికి ఆకర్షవంతంగా ఉంటుంది. ఈ శిల యొక్క వయస్సు 2500 నుండి 3400 మిలియన్‍ సంవత్సరాలుగా నిర్ధారించబడినది.


సేంట్‍మెరీస్‍ ద్వీపంలో కలామ్‍ నార్‍ వల్కానిక్స్
సేంట్‍మేరీస్‍ ద్వీపం కొన్ని చిన్న చిన్న ద్వీపాల సమూహం. ఇది అరేబియన్‍ మహాసముద్రంలోని మాల్పేలిన్‍ అనే చిన్న తీరం వద్ద కలదు. ఇది ఉడిపి పట్టణానికి పశ్చిమంలో 6 కి.మీ. దూరంలో కలదు. ఉడిపి పట్టణం మంగళూరుకు వెస్ట్ నార్త్-వెస్ట్ దిశలో 60 కి.మీ. దూరంలో ఉన్నది. ఈ ద్వీపాన్ని పాపులర్‍గా కోకోనట్‍ ద్వీపం అని కూడా అంరురు. ఫెల్‍సిక్‍ వాల్క్నిక్స్ మరియు రయోడయొసైట్‍ శిలల్లో బాగా తయారైన కలామ్‍ నార్‍ జాయింట్స్, వాటి హెగ్సాగోనల్‍ ఫేసెస్‍, వీటి ప్రత్యేకత. ద్వీపం యొక్క వైశాల్యం 500 మీ × 100 మీ మరియు ఎత్తు 10 మీ. వీ.•.•. పైన. ఇవి భారతంలోని సౌత్‍-వెస్ట్ ప్రాంతంలో విస్త•త మొల్టన్‍ లావా అగ్ని పర్వతం నుండి విరజిల్లడం వల్ల ఏర్పడినవి. ఈ సంఘటన క్రిటేశియస్‍ పీరియడ్‍లో అనగా 88 మిలియన్‍ సంవత్సరాల క్రితం జరిగినది. కొన్ని జానపద కథల ప్రకారం 1948లో వాస్కోడిగామా తను పోర్చుగల్‍ నుండి ఇండియాకి వచ్చిన సమయంలో దీనికి సేంట్‍ మేరీ ఐలెండ్‍ అని నామకరణం చేసారని చెప్పుకుంటారు.


పెద్దపల్లిలోని పైరోక్లాస్‍టిక్‍ శిలలు, కోలార్‍ జిల్లా
కోలార్‍ జిల్లాలోని పెద్దపల్లి వద్ద ఉన్న పైరోక్లాస్‍టిక్‍ శిలలని జియోలాజికల్‍ వివరణ ఏమిటంటే ఈ శిలలని వెల్డెడ్‍ అగ్లామరేట్‍ అని అందురు. ఇగ్‍నింబరైట్‍ (ఏశప్లోటుఫ్స్) మెట్రిక్స్లో, గ్రానైట్‍, గ్రానైట్‍ నైన్‍, బీసాల్‍ట్స్, బ్యాండెడ్‍, ఫెరుజినస్‍ క్వార్టజైట్‍ శిలల యొక్క పెద్ద పెద్ద ముక్కలు కలిసి ఏర్పడినవే ఈ పైరోక్లాస్‍టిక్‍ శిలలు.

  • కమతం మహేందర్‍ రెడ్డి
    ఎ : 90320 12955

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *