ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 3న నిర్వహించబడుతుంది. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్ జర్నలిస్టులు 1991, ఏప్రిల్ 29 నుండి మే 3వ తేదీవరకు ఆఫ్రికాలోని నమీబియా దేశపు విండ్ హాక్ నగరంలో సమావేశం ఏర్పాటుచేసి, పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అనేక తీర్మానాలు వచ్చాయి.
ఆఫ్రికన్ జర్నలిస్టుల నిరసనగా గుర్తుగా మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్స వంగా జరపాలని 1993, డిసెంబరు నెలలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నిర్ణయిం చింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్స వంను జరుపు కుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికా స్వేచ్ఛను అంచనా వేయడం, దానిని రక్షించడం. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళి అర్పించడం అనేవి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం లక్ష్యాలు.
పత్రికారంగంలో ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారం, వ•త్తి నిర్వహణలో జర్నలిస్టుల స్వేచ్ఛ, సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడంలో వారి సహకారం వంటి అంశాలపై ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా చర్చిస్తుంటారు.
ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగాయి. వ•త్తి నిర్వహణలో కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. పత్రికారంగంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల హత్యలను ప్రెస్ ఎంబ్లెన్స్ క్యాంపెయిన్ (•జు•) తాజా గణాంకాలను వెల్లడించింది.
2013 సంవత్సరం నుంచి పరిగణలోకి తీసుకుంటే దాదాపు 1200 మంది జర్నలిస్టులు వ•త్తి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. సగటున సంవత్సరంలో 113 మంది, వారానికి ఇద్దరు చొప్పున జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 400కి పైగా టీవీ న్యూస్ చానళ్లు ఉన్నాయి. పత్రికలైతే వేలల్లో ఉన్నాయి. ప్రాంతీయ ప్రతికా స్వేచ్ఛ సూచీలో నార్వే, డెన్మార్క్, స్వీడన్ మొదటి స్థానాల్లో ఉండగా చివరి స్థానంలో నార్త్ కొరియా ఉంది.
చాలా దేశాల్లో డిజిటల్ సాంకేతికత, స్వతంత్ర మీడియా వ•ద్ధి, అపరిమిత సమాచార వ్యాప్తిని సులభతరం చేశాయి. అయినప్పటికీ మీడియా స్వేచ్ఛ, జర్నలిస్టుల భద్రత, భావప్రకటనా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లుతోంది. ప్రాథమిక మానవ హక్కులపై ప్రతికూల ప్రభావానికి దారి తీస్తోంది.
2024లో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం యొక్క థీమ్ ‘‘ఎ ప్రెస్ ఫర్ ది ప్లానెట్: జర్నలిజం ఇన్ ది ఫేస్ ఆఫ్ ది ఎన్విరాన్‍మెంటల్ క్రైసిస్’’ చుట్టూ కేంద్రీక•తమై ఉంటుంది. ఈ ముఖ్యమైన రోజు మే 3, 2024న జరుపుకోవడానికి షెడ్యూల్ చేయబడింది.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం రోజున యూనెస్కో మరియు గులెర్మో కానో ఇసాజ ఫౌండేషన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఫ్రైజ్ (WORLD PRESS FREEDOM PRIZE)ను ప్రపంచ వ్యాప్తంగా పత్రిక స్వేచ్ఛ కోసం క•షి చేసిన వ్యక్తి, సంస్థకు ఇస్తారు.
- దక్కన్‍న్యూస్
ఎ : 9030 6262 88