తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఝరా సంగం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన రైతు వీర్ శెట్టి బిరాదర్. ఆయన గ్రాడ్యుయేట్. 13 ఎకరాల మెట్ట, 5 ఎకరాల మాగాణి ఉంది. చెరకు, కందిపప్పు, శనగలు, జొన్న, సజ్జ, కొర్ర, రాగి లాంటి పంటలు పండించే వారు.
ఒకప్పుడు ఆయన మహారాష్ట్రలో ప్రయా ణిస్తుండగా, ఓసారి తినేందుకు ఆహారం ఏమీ దొరక లేదు. దాంతో ఆకలిబాధకు గురయ్యారు. ఇక అప్పుడే ఆయనకు ఆహారపంటలకే ప్రా ధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మహా రాష్ట్ర నుంచి తిరిగిరాగానే భవిష్యత్తు తరాలకు ఆహార పంటలను అందించాలని సంకల్పిం చారు.
అలా ఆయన చిరుధాన్యాలను పండించడం ప్రారంభించారు. ఇక్రిశాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.ఎల్. గౌడ, ఎంఎస్‍ఎస్‍ఆర్ ఎఫ్ (ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, జేపూర్,ఒడిషా) డైరెక్టర్ డాక్టర్ సి.హెచ్. రవీంద్రరెడ్డిల సాంకేతిక మార్గదర్శకత్వంలో విలువ జోడించబడిన చిరుధాన్యాల
ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశించారు.
విలువ జోడించబడిన చిరుధాన్యాల ఉత్పత్తుల రంగంలోకి ఆయన ప్రవేశించేందుకు మరో కారణం పట్టణ జనాభాలో జీవనశైలి వ్యాధులు పెరిగిపోవడం, యువతలో జంక్ ఫుడ్ విని యోగం అధికం కావడం. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఆయన 2009లో హైదరా బాద్ చందానగర్‍లోని హుడా కాలనీలో ఎస్‍ఎస్ భవానీ ఫుడ్స్ ప్రై.లి. పేరిట విలువ జో డించబడిన చిరుధాన్యాల ఉత్పాదనల కేంద్రాన్ని ప్రారంభించారు. ఏడేళ్ళ వ్యవధిలోనే ఆయన కంపెనీ జొన్న, సజ్జ, కొర్రలాంటి చిరుధాన్యాల నుంచి 60 విలువ జోడించిబడిన ఉత్పాదన లను అభివృద్ధి చేసింది.
ఏటా జూన్-జూలై నుంచి ఆయన సాగు ప్రారంభమవుతుంది. చిరుధాన్యాల్లో మంచి దిగుబడులు సాధించారు. (ఎకరానికి కొర్రలు 3 నుంచి 3.5 క్వింటాళ్ళు, సజ్జ 4-5
క్వింటాళ్లు, జొన్న 4-5 క్వింటాళ్లు, రాగులు 4-5 క్వింటాళ్లు). తక్కువ వర్షపాతం ఉన్న సందర్బాల్లోనూ సరైన యాజమాన్య విధానాలతో అధిక దిగుబడులను సాధించేవారు.
చిరుధాన్యాలను సూపర్ ఫుడ్స్గా అభివర్ణి స్తారు వీర్‍శెట్టి బిరాదార్. అందుకు ప్రధాన కారణం పక్షులబెడద మినహాయిస్తే, తెగుళ్లు, వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. రైతు, జవాను దేశానికి రెండు కళ్లలాంటివారని ఆ యన విశ్వసిస్తారు. రైతులను దృష్టిలో ఉంచు కొని ఆయన స్వయం శక్తి (హుడా కాలనీ, చందానగర్, హైదరాబాద్) అనే ఎన్జీఓను స్థా పించారు. సంగారెడ్డి జిల్లాలోని 8 గ్రామాల్లోని 1000 మంది రైతులకు ఇది తన సేవలను అందిస్తోంది. రైతులకు సకాలంలో వారికి అవసరమైన సమాచారాన్ని ఇది అందిస్తుంది. నూతన సాంకేతికతలను రైతుల గడప ముంగి ట్లోకి తీసుకెళ్తుంది.
హైదరాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిలెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) నుంచి ఆయన మిలెట్స్ ప్రాసెసింగ్, రకరకాల యంత్రాలకు సంబంధించి సాంకేతిక మార్గదర్శక త్వం పొందారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రి కల్చరల్ రీసెర్చ్ (ఐసిఏఆర్) ప్రాజెక్ట్ ఫార్మర్ ఫస్ట్లో ఆయన ఐఐఎంఆర్‍తో కలసి పని చేస్తున్నారు.2017లో ఆయన మరో షాప్ ను కూడా ప్రారంభించారు. ‘అండర్ యుటిలైజ్డ్ క్రాప్స్ ఫర్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ’ పేరిట ఎంఎస్‍ఎస్‍ఆర్‍ఎఫ్ (జేపూర్, ఒడిషా) లో జరి గిన సదస్సులో ఆయన పాల్గ్గొన్నారు. ఒడిషా లోని రైతులకు కూడా ఆయన తన సహకారాన్ని అందించారు.
ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒ క్కరికి కూడా ఏడాది పొడుగునా విలువ జో డించిన చిరుధాన్యాల ఉత్పత్తులు అందు బాటులో ఉం డాలని ఆయన విశ్వసిస్తారు. చిరు ధాన్యాల ఆధారిత విలువ జోడించిన ఉత్పాదనలను అభివృద్ధి చేయడంలో ఆ యన ఎన్నో కష్టాలను ఎదు ర్కొన్నారు. పండ్లు ఉన్న చె ట్టుకే రాళ్ళ దెబ్బలు అనే సూ క్తిని గుర్తు చేసుకుంటారు ఆయన. ప్రస్తుతం ఆయన తన ప్రై.కంపెనీ నుంచి నెలకు రూ.లక్ష దాకా ఆదా యాన్ని పొందుతున్నారు.
చిరుధాన్యాల రంగంలో విలువ జోడించిన ఉత్పాదనల విభాగంలో చేసిన కృషికి గాను బిరాదర్ ఎన్నో అవార్డులు కూడా పొందారు. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్‍ఎస్‍ఆర్‍ఎఫ్, జేపూర్, ఒడిషా) నుంచి 2017లో ఆయన ‘బెస్ట్ ఫార్మర్ అవార్డ్’ ను పొందారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (పీజేటీఎస్‍ఏ యూ) నుంచి 2017లో డాక్టర్ ఎం.వి.రావ్ మెమోరియల్ అవార్డ్ ను పొందారు. ఇండి యన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐ ఐఎంఆర్, హైదరాబాద్) నుంచి బెస్ట్ మిల్లెట్ మిషరయ్య అవార్డును పొందారు.
- డాక్టర్ ముత్తన్న, సీనియర్ రీసెర్చ్ ఫెలో (ఎస్‍ఆర్‍ఎఫ్),
డాక్టర్ రవి నంది, పోగ్రామ్ మేనేజర్ (ఎఫ్‍టిఎఫ్ -ఐటిటి),
షకీరా ప్రవీణ్, పోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, (ఎఫ్‍టిఎఫ్ -ఐటిటి), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్‍మెంట్ (మేనేజ్), రాజేంద్ర నగర్, హైదరాబాద్ – 500030, తెలంగాణ
(ఇన్‍స్పైరింగ్ స్టోరీస్ ఫ్రమ్ ఇన్నోవేటివ్ ఫార్మర్స్ – మేనేజ్)