తెగుళ్లు నివారిస్తేనే లాభాల పసుపు

ఈ తెగులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు, గాలిలో ఎక్కువ తేమ, తక్కువ ఉష్ణోగ్రత ఉండటం వలన వ్యాపిస్తుంది. పెద్దపెద్ద అండాకారపు మచ్చలు ఆకులపై అక్కడక్కడ కనబడతాయి. మచ్చలు ముధురు గోధుమ రంగులో ఉండి మచ్చ చుట్టూ పసుపు రంగు వలయం ఏర్పడుతుంది. ఆకు కాడపై మచ్చలు ఏర్పడి కిందకు వాలి పోతుంది. దీని నివారణకు దృఢమైన విత్తనాన్ని ఎన్నుకోవాలి. మచ్చలు ఉన్న, ఎండిన ఆకులను తొలగించి కాల్చివేయాలి. లీటర్‍ నీటిలో గ్రాము కార్బండిజమ్‍ లేదా 2.5 గ్రాముల మాంకోజబ్‍తో పాటు అర మిల్లీ లీటర్‍ సబ్బునీరు లేదా థయోఫానేట్‍ మిథైల్‍ గ్రాము మార్చిమార్చి పిచికారీ చేయాలి.


ఆకుమచ్చ తెగులు
ఈ ఆకుమచ్చ తెగులు కూడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు, గాలిలో ఎక్కువ తేమ, తక్కువ ఉషో?గ్రతల వలన వస్తుంది. మొదట ఆకులపై చిన్న, చిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడుతాయి. తరువాత చిన్నచిన్న గోధమ రంగు మచ్చలుగా మారుతాయి. తెగులు ఎక్కువైతే ఆకుమాడి పోతుంది. నవంబర్‍, డిసెంబర్‍ నెలల్లో ఈ తెగులు ఎక్కువగా కనబడుతుంది. దీని నివారణకు ఈ తెగులు సోకిన ఆకులను కత్తిరించి నాశనం చేయాలి. తాటాకు మచ్చ తెగులుకు సూచించిన మందులతో పాటు 1 మి.లీ ప్రోపికోనజోల్‍ లీటర్‍ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.


దుంప, వేరుకుళ్లు తెగులు
విత్తన శుద్ధిలేని కొమ్ములు నాటడం, మురుగు నీటి పారుదల సరిగా లేకపోవటం, సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించక పోవటం, ఎడతెరిపి లేని వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు ఉండటంతో ఈ తెగులు సోకుతుంది.


లక్షణాలు
ఈ తెగులు సోకి తే ఆకులు మందంగా వాడిపోయి గోధుమ రంగుకు మారి చివరకు ఎండిపోతాయి. తరువాత మొక్క పై భాగాన ఉన్న లేత ఆకులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తల్లి కొమ్ములు, పిల్ల దుంపలు కుళ్లి మెత్తబడిపోతాయి. చెడు వాసన వస్తుంది. నాణ్యత కూడా బాగా తగ్గుతుంది.


దీని నివారణకు…
లీటర్‍ నీటికి మూడు గ్రాముల రిడోమిల్‍ ఎం.జెడ్‍ లేదా మాంకోజెబ్‍ లేదా 2 మి.లీ మోనోక్రొటోఫాస్‍ లీటర్‍ నీటి చొప్పున కలిపిన ద్రావణంలో కొమ్ములను 30-40 నిమిషాలు నానబె ట్టాలి. తరువాత నీరు మార్చి లీటర్‍ నీటికి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి ఆ ద్రావణంలో 30 నిమిషాలు ఉంచి నీడలో ఆరబెట్టి నాటు కోవాలి.వేసిన పొలంలోనే పసుపు వేయకుండా వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న తదితర పంటలతో పంట మార్పిడి చేయాలి.
దుంపలు విత్తిన తరువాత జీలుగు, జనుము, వెంపలి, వేప, కానుగ తదితర పచ్చి ఆకులు లేదా ఎండు వరిగడ్డి, చెరకు ఆకులను పొలంపై దుంపలు మొలకలు వచ్చేంత వరకు కప్పడం వలన తెగులు ఉధృతిని కొంతకొంత వరకు తగ్గించవచ్చును.

    -సి.హెచ్‍.పల్లవి, యు.కిషోర్‍ కుమార్‍, డి.అనిల్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *