సెంట్రల్ ఫోరెన్సిక్‍ సైన్స్ లేబొరేటరీ

న్యాయం కోసం సైన్స్!


హైదరాబాద్‍లో 1967లో నెలకొల్పబడిన సెంట్రల్‍ ఫోరెన్సిక్‍ సైన్స్ లేబొరేటరీ అనేది భారతదేశంలోని ఆరు సెంట్రల్‍ ఫోరెన్సిక్‍ సైన్స్ లేబొరేటరీల్లో ఒకటి. చండీగఢ్‍, కోల్‍కతా, భోపాల్‍, పుణె, గువాహతిలలో మిగిలిన ఐదు ఉన్నాయి. ఎక్స్ప్లోజివ్స్, బాలిస్టిక్స్, నా ర్కోటిక్స్, ఫిజిక్స్, టాక్సికాలజీ, బయోలజీ, కెమిస్ట్రీ, డాక్యుమెంట్స్ డీఎన్‍ఏ ఎగ్జామినేషన్‍, సైబర్‍ ఫోరెన్సిక్స్ తదితరాలకు సంబంధించిన శాస్త్రీయ పరీక్ష సదుపాయాలను, ఫలితాలను, విశ్లేషణలను ఇది అం దిస్తుంది. ఫింగర్‍ ప్రింట్‍ వెరిఫికేషన్‍ లేనప్పటికీ సిగ్నేచర్‍ వెరిఫికేషన్‍ చేస్తారు. సీఎఫ్‍ఎస్‍ఎల్‍ హైదరాబాద్‍ మొదటి డైరెక్టర్‍ డాక్టర్‍ ఎస్‍.ఎన్‍. గార్గ్. ప్రస్తుత డైరెక్టర్‍ డాక్టర్‍ ఆర్‍.కె. సరిన్‍.


ఈ కేంద్రం ‘సెంటర్‍ ఆఫ్‍ ఎక్స్లెన్స్’గా భారత ప్రభుత్వ గుర్తింపు పొందింది. కంప్యూటర్‍ ఫోరెన్సిక్స్, డీఎన్‍ఏ ప్రొఫైలింగ్‍కు సంబంధించి అత్యాధునిక లేబొరేటరీలను కలిగి ఉంది. ఎన్‍ఏబీఎల్‍ అక్రెడిటెడ్‍ ఐఎస్‍ఒ / ఐఈసీ 17025 సర్టిఫైడ్‍ లేబొరేటరీ. క్రిమినల్‍ జస్టిస్‍ సిస్టమ్‍కు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కచ్చితమైన, ఆధారపడదగిన సేవలను ఇది అందిస్తోంది.

నేరపరిశోధన సంస్థలు అందించే ఎగ్జి బిట్స్ను సీఎఫ్‍ఎస్‍ఎల్‍ లోని నిపుణులు పరిశోధిస్తారు. ఎక్స్పర్ట్ ఒపీనియన్‍ను అందిస్తారు. న్యాయస్థానాల్లో తమ పరిశోధన ఫలి తాలకు బలం చేకూర్చే ఆధారాలను వెల్లడి స్తారు. ఫోరెన్సిక్‍ సైన్స్లో ఇతర అధికారులకు ఇక్కడ శిక్షణ కూడా ఇస్తారు. ఫోరెన్సి క్‍ సైన్స్లో నైపుణ్యాల అభివృద్ధి, ఆర్‍•డి కార్య కలాపాలను కూడా ఈ లేబొరేటరీ చేపడుతుంది.
వివిధ కేసులకు సంబంధించి విచారణలో తోడ్పడేందుకు గాను సంస్థ నిపుణులను తమ ముందు హాజరు కావాల్సిందిగా న్యాయ స్థా నాలు పిలుస్తుంటాయి. నేరం జరిగిన ప్రాంతానికి ఆయా దర్యాప్తు సంస్థలు ఈ నిపుణులను రప్పిస్తుంటాయి. విచారణలో వారి సహకారం తీసుకుంటాయి.

ఇదీ చరిత్ర!
ఇంటెలిజెన్స్ బ్యూరో సారథ్యంలో సిఎఫ్‍ఎస్‍ఎల్‍ హైదరాబాద్‍ 1967లో నెలకొల్పబడింది. మొదట్లో ఇది హైదరాబాద్‍ నగరంలోని చిరాగ్‍ అలీ లేన్‍ ప్రాంతంలో ఓ అద్దె భవనంలో ఉండింది. ఆ తరువాత 1982లో ఉస్మానియా యూనివర్సిటీకి చేరువలో రామాంతపూర్‍ ప్రాంతానికి మారింది. 1973లో ఇది కోల్‍కతా లోని సీఎఫ్‍సీఎల్‍ ల్యాబ్‍తో పాటుగా బ్యూరో ఆఫ్‍ పోలీస్‍ రీసెర్చ్ & డెవలప్‍మెంట్‍ (బీపీఆర్‍ & డి) పాలనాపరమైన నియంత్రణలోకి వచ్చింది. 2002 నుంచి కూడా ఈ లేబొరేటరీ భారత ప్రభుత్వ హోం వ్యవహారాల శాఖ ఫోరెన్సిక్‍ సైన్స్ డైరెక్టరేట్‍ నియంత్రణలో పని చేస్తోంది.

జ్యూరిస్‍డిక్షన్‍
శాస్త్రీయ పరిశోధన & అభివృద్ధి కార్యకలాపాలతో పాటుగా సీబీఐ, ఎన్‍ఐఏ, డీఆర్‍టీ, డీఆర్‍ఐ, సెంట్రల్‍ ఎక్సైజ్‍ & కస్టమ్స్, ఇండియన్‍ రైల్వేస్‍, బ్యూరో ఆఫ్‍ నార్కోటిక్స్, కంట్రోలర్‍ ఆఫ్‍ ఎక్స్ప్లోజివ్స్, మిలిటరీ, పారా మిలిటరీ సంస్థలు, పోస్టల్‍, బ్యాంకింగ్‍, పీఎస్‍యూ, స్టేట్‍ ఎఫ్‍ఎస్‍ఎల్‍, ఢిల్లీ పోలీస్‍, న్యాయవ్యవస్థ, నిఘా విభాగాలు వంటి వివిధ మంత్రిత్వ శాఖల విభాగాలు, అండర్‍టేకింగ్స్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇది తన సేవలను అందిస్తోంది. వివిధ న్యాయస్థానాలు, నేర దర్యాప్తు ఏజెన్సీల నుంచి కేసులు వస్తుంటాయి. ఆంధప్రదేశ్‍, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటకలతో పాటుగా న్యూఢిల్లీ, లక్ష ద్వీప్‍, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలు కూడా దీని జూరిస్‍డిక్షన్‍ పరిధిలో ఉన్నాయి.

ఫోరెన్సిక్‍ సైన్స్ పై చైతన్యం
కీలక సాక్ష్యాధారాలను భద్రపర్చడంలో, విశ్లేషించ డంలో ఫోరెన్సిక్‍ సైన్స్పై ప్రజల్లో ఉండే అవగాహన ఎంతో కీలకపాత్ర వహిస్తుంది. తద్వారా సైన్స్ ద్వారా న్యాయం దక్కేలా చూడడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. ఫోరెన్సిక్‍ సైన్స్ అవేర్‍నెస్‍ వీక్‍, ప్రదర్శనలు, సందర్శనలు, ప్రజంటేషన్స్ లాంటి కార్యకలాపాల ద్వారా ఈ సంస్థ ప్రజల్లో ఫోరెన్సిక్‍ సైన్స్పై చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తోంది. అంతేగాకుండా న్యాయ విభాగం, దర్యాప్తు అధికారులతో ఇంటరాక్టివ్‍ సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రాచుర్యంలోకి వస్తున్న ఫోరెన్సిక్‍ టెక్నిక్స్ గురించి చర్చించేందుకు, ఈ లేబొరేటరీ అందించే సేవలను మదింపు వేసేందుకు ఇలాంటి సమావేశాలు ఒక వేదికగా పని చేస్తాయి.

సంస్థ కార్యకలాపాలు
సంస్థ ప్రధానంగా దిగువ పేర్కొన్న కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటోంది.
1.విశ్లేషణ-కేస్‍ ఎగ్జామినేషన్‍ (ఎగ్జిబిట్స్)
2.శిక్షణ-శాస్త్రవేత్తలు, పోలీసు, న్యాయవిభాగం అధికారులు, వివిధ యూనివర్సిటీల విద్యార్థులు
3.పరిశోధన & అభివృద్ధి-ప్లాన్‍ & నాన్‍-ప్లాన్‍ రీసెర్చ్ ప్రాజెక్టస్ మరియు జేఆర్‍ఎఫ్‍ స్కీమ్‍
4.ఇతర కార్యకలాపాలు – ఇతర స్టేట్‍ ఫోరెన్సిక్‍ సైన్స్ లేబొరేటరీల కోసం ఉపకరణాలు సమకూర్చడం
5.ఎక్స్ ట్రా మురల్‍ రీసెర్చ్ ప్రాజెక్టులకు నిధులు

ఫోరెన్సిక్‍ కెమిస్ట్రీ, ఫోరెన్సిక్‍ టాక్సికాలజీ అండ్‍ ఫోరెన్సిక్‍ ఎక్స్ప్లోజివ్స్లో ఈ సంస్థ ఆర్‍&డి కార్యకలాపాలు చేపట్టింది. 2005 లో కంప్యూటర్‍ ఫోరెన్సిక్స్, కౌంటర్‍ఫీట్‍ కరెన్సీ అనే రెండు నూతన యూనిట్లు ప్రారంభమయ్యాయి. డీఎన్‍ఏ యూనిట్‍, లై డిటెక్షన్‍ యూనిట్‍, టేప్‍ అథెంటికేషన్‍, స్పీకర్‍ అడెంటిఫికేషన్‍ యూనిట్‍, బ్రెయిన్‍ ఫింగర్‍ ప్రింట్‍ యూనిట్‍ రానున్నాయి. ఐఎస్‍ఒ / ఐఈసీ-17025 లకు సంబంధించి భారతదేశంలోని ఇతర ఫోరెన్సిక్‍ సైన్స్ లేబొరేటరీల అక్రెడిటేషన్‍కు సంబంధించి ఇది నోడల్‍ లేబొరేటరీగా ప్రకటించబడింది. ఎఫ్‍ఎస్‍ఎల్‍ హర్యానా / ఆంధప్రదేశ్‍/ గుజరాత్‍, జీఈక్యూడి, హైదరాబాద్‍ / కోల్‍కతా వంటి ఇతర ఫోరెన్సిక్‍ సైన్స్ లేబొరేటరీలు అక్రెడిటేషన్‍ పొందడంలో ఈ సంస్థ అధికారులు తోడ్పడ్డారు. మహారాష్ట్ర, కర్నాటక, మణిపూర్‍ వంటి మరికొన్ని ఇతర ఫోరెన్సిక్‍ సైన్స్ లేబొరేటరీలు అక్రెడిటేషన్‍ పొందే మార్గంలో ఉన్నాయి.

ఫోరెన్సిక్‍ అనలిటికల్‍ సర్వీస్‍
న్యాయ మరియు దర్యాప్తు సంస్థలకు తోడ్పడేలా, నేరం జరిగిన ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్న సున్నితమైన ఫిజికల్‍ ఎవిడెన్స్లను సీఎఫ్‍ఎస్‍ఎల్‍ (హైదరాబాద్‍) శాస్త్రీయంగా విశ్లేషిస్తుంది.
కెమిస్ట్రీ టాక్సికాలజీ, ఎక్స్ప్లోజివ్స్, ఫిజిక్స్, బాలిస్టిక్స్, బయోలజీ, సైబర్‍ ఫోరెన్సిక్స్ విభాగాల్లో ఫోరెన్సిక్‍ ఎగ్జామినేషన్స్ను నిర్వహిస్తుంది. నేరానికి, క్రిమినల్‍కు సంబంధం ఉందనే విషయాన్ని నిరూపించేందుకు ఈ విశ్లేషణ తోడ్పడుతుంది. ఈ లక్ష్యసాధనకు గాను అన్ని బేసిక్‍ సైన్సెస్‍ను, వాటి మెథడాలజీలను ఉపయోగించు కుంటారు.

రీసెర్చ్ అండ్‍ డెవలప్‍మెంట్‍
ఫోరెన్సిక్‍ సైన్స్ టెక్నిక్స్ అప్‍డేటింగ్‍, ఇంప్రూవింగ్‍ కోసం నూతన సాంకేతికతలను పొందేందుకు, అభివృద్ధి చేసేందుకు సంస్థ అగ్రగామి సైంటిఫిక్‍ లేబొరేటరీలతో, విద్యాసంస్థలతో కలసి పని చేస్తోంది. డాక్టరొల్‍ డిగ్రీ ప్రదానం చేసేందుకు రీసెర్చ్ వర్క్ చేసేందుకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయంచే ఇది గుర్తించబడింది. కెమికల్‍ సైన్స్లో డాక్టరొల్‍ వర్క్ చేసేందుకు గాను పీజీ విద్యార్థులకు సంస్థ రీసెర్చ్ స్కాలర్‍షిప్స్ కూడా అందిస్తోంది.



సువేగా,
ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *