Day: December 1, 2020

వికసించిన నూరు పూలు

నూరు పూలు వికసించనీ, వేయి భావాలు పరిమళించనీ..ది నూరవ సంచిక. తెలంగాణ మలిదశ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో సెప్టెంబర్2012లో తొలి సంచిక వెలువడింది. ఒక సామాజిక రాజకీయ మాసపత్రికగా దక్కన్ లాండ్ నిరాటంకంగా నూరు సంచికలు వెలువడటం సంతోషదాయకం. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేని తెలంగాణ ప్రాచీన చరిత్ర, వారసత్వ సంపద, భాష-సాహిత్యం- జానపద కళారూపాలతో కూడిన సాంస్కృతిక వైభవం, పోరాట తెగువ వంటి తరతరాల మౌలిక సంపదతో పాటు, సమైక్య పాలకుల అధిపత్యవిధానాలు, వివక్షత, నీరు, నిధులు, నియామకాలు వంటి ప్రాధాన్యతా …

వికసించిన నూరు పూలు Read More »

వేముల పెరుమాళ్ళు

ఇంటికి వాకిలి సాక్షి అన్నట్టు ఈ తెలుగింటికి, ఈ తెలంగాణ ఇంటికి వాకిలి లాంటి వాడు వేముల పెరుమాళ్ళు. తెలుగు భాషా సంస్కృతుల గూర్చి, తెలుగు జీవనానికి సంబంధించిన జాతీయాల గూర్చి వేముల పెరుమాళ్ళు ఒక జీవిత కాలపు కృషి చేశారు. అయితే ఆ కృషి గురించి తెలుగు సాహితీ లోకంలో జరగాల్సినంత చర్చ జరగకపోవడం విచారకరం. పెరుమాళ్ళు మాటల్లోనే చెప్పాలంటే మన సాహిత్య చర్చలన్నీ ‘ఉత్తుత్తి పుట్నాలు – మూడు మూడు కుప్పలన్నట్లుగా సాగుతున్నాయి’. మంచి మనిషిగా, నిగర్విగా …

వేముల పెరుమాళ్ళు Read More »

ప్రణయ – చరిత్రకు పట్టం

తెలుగునాట ఎంతోమంది సాహితీవేత్తలు తమ ఇంటి పేరు తోనే ప్రసిద్ధులు. ఆ రచయితలు సీమాంధ్ర ప్రాంతం వారైనా వారి ఇంటిపేర్లున్న ఊళ్లు తెలంగాణలో ఉన్నాయి. వాళ్లు కూడా తమకు తెలంగాణాతో అనుబంధమేదో ఉన్నదనే భావించారు. ముఖ్యంగా బ్రాహ్మణులు తాము పౌరోహిత్యం చేస్తున్న/ నివసిస్తున్న ఊరిపేర్లనే ఇంటిపేరుగా స్థిరపరచుకున్నారు. అట్లాంటి వారిలో రాచకొండ విశ్వనాథశాస్త్రి, కందుకూరు వీరేశలింగం, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, ముదిగొండ వీరభద్రమూర్తి, ఆదిభట్ల నారాయణ దాసు, తెలకపల్లి రవి ఇట్లా కొన్ని వందలమంది పండితులు, రచయితలున్నారు. ఇంకా చెప్పాలంటే వారందరికీ …

ప్రణయ – చరిత్రకు పట్టం Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-4 బాదామీ చాళుక్య మొదటి విక్రమాదిత్యుని కొల్లాపురం రాగిరేకు శాసనం(క్రీ.శ.672)

కొల్లాపురం. మళ్లీ అలంపురం తరువాత నేను జీవితంలో గుర్తుంచుకోవాల్సిన రెండో తెలంగాణా పట్టణం. అలంపురంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మహబూబ్‍నగర్‍ జిల్లా, కొల్లాపూర్‍ తాలూకా, జటప్రోలు దేవాలయాలు శ్రీశైలం జలాశయ నీటి ముంపుకు గురౌతున్నందున, వాటిని ఎగువకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొల్లాపురంలో అందుకోసం దేవదాయశాఖ, సబ్‍డివిజన్‍ ఉన్న జటప్రోలు, మంచాలకట్ట, మల్లేశ్వరం, చిన్నమారూరు దేవాలయాల చిత్రాలు గీసి, రాయి రాయికీ నంబర్లు వేసే పనికి చాలా మంది శిల్పులు కావాలి. గాబట్టి అలంపూరు నుంచి నన్ను కొన్నాళ్లపాటు కొల్లాపూరుకు డిపుటేషన్‍ మీద …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-4 బాదామీ చాళుక్య మొదటి విక్రమాదిత్యుని కొల్లాపురం రాగిరేకు శాసనం(క్రీ.శ.672) Read More »

ముసల్మానుల కన్నా ముందే వెలిసిన ‘పహాడీ షరీఫ్‍ దర్గా’

గణగణగంటలు మ్రోగే గుళ్లు గోపురాలు, అజాలు వినిపించే గుంబజ్‍లు మినార్లు, ఆదివారం ప్రాతఃకాలం ప్రార్థనలతో కళకళలాడే చర్చ్లు, చాపెల్స్లు లేకపోతే ఈ హైద్రాబాద్‍ నగరం ఇంత అందంగా కనబడేదా? హారం ఒకటే కాని అందులోని పువ్వుల రంగులు మాత్రం వేరువేరు.‘‘తూ హిందు బనేగ న / ముసల్మాన్‍ బనేగఇన్సాన్‍ కి ఔలాద్‍ హై / ఇన్సాన్‍ బనేగ’’సరిగ్గా ఈ తత్వాన్నే సూఫీ ఇజం ప్రచారం చేసింది. వైష్ణవ మత ప్రచారానికి ఆళ్వార్లు ఎలాగో, శైవ మత ప్రచారానికి …

ముసల్మానుల కన్నా ముందే వెలిసిన ‘పహాడీ షరీఫ్‍ దర్గా’ Read More »

సమాచార ప్రసార రంగంలో మరో నూతన తరం..5జీ టెక్నాలజీ..!!

(అక్టోబర్‍ సంచిక తరువాయి) 5జీ (భవిష్యత్‍ తరం) :5జీ ప్రస్తుతం మన దేశంలో అభివృద్ధిదశలో ఉంది. అయితే ముందే చెప్పుకున్నట్లు చైనా, దక్షిణ కొరియాలాంటి దేశాలు ఇప్పటికే 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టాయి. 4జీతో పోలిస్తే, 5జీ చాలా మెరుగైనది మరియు వినియోగదారులకు మరింత వేగవంతంగా సేవలు అందించగలదని సాంకేతిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు :4జీ తో పోలిస్తే 5జీ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వేగం విషయానికొస్తే 5జీ వేగం, 4జీ కన్నా 35 రెట్లు …

సమాచార ప్రసార రంగంలో మరో నూతన తరం..5జీ టెక్నాలజీ..!! Read More »

నగర పాలనలో మన పాత్ర

ఎన్నికల్లో ఓట్లు వేసి కార్పోరేటర్లను గెలిపించాం. మమ్మల్ని పాలించండి! మా బాధలు పట్టించుకోండి! మా ఆకాంక్షలు గమనించండి అని చెప్పి ఓటిచ్చాం. ఓట్ల కోసం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చారని, ఎన్నాళ్ళకో కనబడుతున్నారని, ఇంతకాలం మేం బాధలు పడుతుంటే పట్టించు కోలేదని మనలో మనమే గులుగుకున్నాము. కనీసం ఇప్పుడైనా మనం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడి, మనకున్న అధికారాలు, హక్కుల గురించి తెలుసుకుని నగర పరిపాలనలో మనం ఎట్లా పాలుపంచుకోవాలో, ఎట్లా నిర్ణయాధికారాల్లో భాగం కావాలో, ఏ విధంగా మన …

నగర పాలనలో మన పాత్ర Read More »

పవనశక్తిని వాడుదాం-పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

ప్రపంచ పవన శక్తి సంస్థ ఆధ్వర్యంలో పిల్లలు, యువత మరియు పెద్దలకు పర్యావరణ హితమైన పవన శక్తి ఉత్పత్తి మరియు వినియోగ ఆవశ్యకతను వివరించే ప్రయత్నాలు చేస్తున్నది. సాంప్రదాయేతర తరగని పునరుత్పత్తి చేయగల శక్తి వనరులలో ముఖ్యమైనదిగా పవన శక్తిని భవిష్యత్‍ శక్తి వనరుగా భావించి వినియోగించుకోవలసిన మార్గాలను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైంది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఆన్‍షోర్‍ మరియు ఆఫ్‍షోర్‍ పవన శక్తి ఉత్పత్తి కేంద్రాలు, పవనశక్తి ఉపయోగాలు, ఉత్పత్తి సవాళ్ళు మరియు సదుపాయాలు, …

పవనశక్తిని వాడుదాం-పర్యావరణాన్ని పరిరక్షిద్దాం Read More »

సీడీఎఫ్‍డీ జన్యు పరీక్షలకు కీలకం

హైదరాబాద్‍ నగరం పలు పరిశోధన కేంద్రాలకు కూడా నిలయం. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు లబ్ధి చేకూర్చే పరిశోధనలను, సేవలను ఇవి అందిస్తున్నాయి. ఇలాంటి ముఖ్యమైన పరిశోధన సంస్థల్లో సెంటర్‍ ఫర్‍ డీఎన్‍ఏ ఫింగర్‍ప్రింటింగ్‍ అండ్‍ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‍డీ) ఒకటి. సెంటర్‍ ఫర్‍ డీఎన్‍ఏ ఫింగర్‍ ప్రింటింగ్‍ అండ్‍ డయాగ్నస్టిక్స్ స్వయంప్రతిపత్తి గల సంస్థ. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ బయోటెక్నాలజీ నుంచి ఇది నిధులు పొందుతోంది. వివిధ కొలాబొరేటివ్‍ ప్రాజెక్టుల …

సీడీఎఫ్‍డీ జన్యు పరీక్షలకు కీలకం Read More »

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే గురుకుల పాఠశాలలు బలోపేతం

రెసిడెన్షియల్‍ స్కూళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‍ ప్రత్యేక శ్రద్ధతెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‍ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెసిడెన్షియల్‍ స్కూళ్లను ప్రక్షాళన చేసి బలోపేతం చేశామని మంత్రి కొప్పుల ఈశ్వర్‍ స్పష్టం చేశారు. గురుకుల పాఠశాలలపై సీఎం కేసీఆర్‍ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రెసిడెన్షియల్‍ స్కూళ్లల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి అని మంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 603 కొత్త గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. ఈ పాఠశాలల కోసం అద్దెకు తీసుకున్న భవనాల కోసం రూ. …

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే గురుకుల పాఠశాలలు బలోపేతం Read More »