సీడీఎఫ్‍డీ జన్యు పరీక్షలకు కీలకం


హైదరాబాద్‍ నగరం పలు పరిశోధన కేంద్రాలకు కూడా నిలయం. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు లబ్ధి చేకూర్చే పరిశోధనలను, సేవలను ఇవి అందిస్తున్నాయి. ఇలాంటి ముఖ్యమైన పరిశోధన సంస్థల్లో సెంటర్‍ ఫర్‍ డీఎన్‍ఏ ఫింగర్‍ప్రింటింగ్‍ అండ్‍ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‍డీ) ఒకటి.

సెంటర్‍ ఫర్‍ డీఎన్‍ఏ ఫింగర్‍ ప్రింటింగ్‍ అండ్‍ డయాగ్నస్టిక్స్ స్వయంప్రతిపత్తి గల సంస్థ. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ బయోటెక్నాలజీ నుంచి ఇది నిధులు పొందుతోంది. వివిధ కొలాబొరేటివ్‍ ప్రాజెక్టుల ద్వారా కూడా ఇది నిధులను సమకూర్చుకుంటోంది. అంతేగాకుండా, తన ఇతర కార్యకలాపాల ద్వారా కూడా కొంత మేరకు నిధులను పొందు తుంటుంది. లైఫ్‍ సైన్సెస్‍లో విద్యార్థులు పీహెచ్‍డీ చేసేందుకు గాను ఇది యూని వర్సిటీ ఆఫ్‍ హైదరాబాద్‍ గుర్తింపును కూడా పొందింది. అత్యాధునిక అంతర్జాతీయ స్థాయి సదుపాయాలను, ఉపకరణాలను ఇది కలిగిఉంది.


సంస్థ చిరునామా: ఉప్పల్‍ వాటర్‍ ట్యాంక్‍ ఎదురుగా, బీఎస్‍ఎన్‍ఎల్‍ టీఈ బిల్డింగ్‍ పక్కన, ఉప్పల్‍, హైదరాబాద్‍ ,లేబొరేటరీ బ్లాక్‍: తుల్జాగూడ కాంప్లెక్స్ (ఎం.జె మార్కెట్‍ ఎదురుగా), నాంపల్లి,హైదరాబాద్ .

అందించే సేవలు అపెడా – సీడీఎఫ్‍డీ సెంటర్‍ ఫర్‍ బాస్మతి డీఎన్‍ఏ అనాలిసిస్‍: అగ్రికల్చర్‍ అండ్‍ ప్రాసెస్డ్ ఫుడ్‍ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్‍మెంట్‍ అ థారిటీ (అపెడా)సీడీఎఫ్‍డీ సెంటర్‍ ఫర్‍ బాస్మతి డీఎన్‍ఏ అనాలిసిస్‍ను బాస్మతి బియ్యం నమూనాలను డీఎన్‍ఏ ప్రొటొకాల్‍ ఉపయోగించి పరీక్షించేందుకు గాను సీడీఎఫ్‍డీలో ఏర్పాటు చేశారు. ఈ ప్రొటొ కాల్‍ను సీడీఎఫ్‍డీ అభివృద్ధి చేసింది. ఈ ల్యాబ్‍ ఏర్పాటుకు అవసరమైన నిధులను మొదట్లో అపెడా ఆధ్వర్యంలోని బాస్మతి ఎక్స్పోర్ట్ డెవలప్‍ మెంట్‍ ఫౌండేషన్‍ (బీఈడీఎఫ్‍) సమకూర్చింది. బాస్మతి బియ్యం స్వచ్ఛతను ఇక్కడ నిర్ధారిస్తారు. ఎగుమతిదారులకు, దిగుమతిదారు లకు ఇది తన సేవలను అందిస్తోంది.

బయోఇన్ఫార్మాటిక్స్ సేవలు:
బయో మాలిక్యులర్‍ సీక్వెన్స్ డేటాబ్యాంక్స్, మాక్రోమాలిక్యు లర్‍ స్ట్రక్చర్‍ డేటా బ్యాంక్స్, జినోమ్‍, ఇతర ఉపయుక్త డేటా బేస్‍లకు సంబంధించిన సేవలను ఇది అందిస్తుంది. సీక్వెన్స్ / స్ట్రక్చర్‍ / జినోమ్‍ డేటా కంపారిజన్‍, విశ్లేషణ, ప్రొటీన్‍ 3-డి మోడలింగ్‍, మాలిక్యులర్‍ గ్రాఫిక్స్ లకు సంబంధించిన సేవలను దీని ద్వారా పొందవచ్చు. యురోపియన్‍ మాలిక్యులర్‍ బయాలజీ నెట్‍వర్క్కు సంబంధించి ఇది మన దేశం తరఫున నేషనల్‍ నోడ్‍గా ఉంది.

డయాగ్నస్టిక్స్:
సీడీఎఫ్‍డీలోని జెనెటిక్‍ డయాగ్నస్టిక్‍ లేబొరేటరీ జన్యుపరమైన వ్యాధులకు సం బంధించిన సమగ్ర డయాగ్నసిస్‍ (కైటో జెనిక్‍, బయోకెమికల్‍, మాలిక్యులర్‍)ను అందిస్తుంది. క్రోమొజోముల అసాధా రణతకు సంబంధించి ప్రినాటల్‍ డయాగ్న సిస్‍, సింగిల్‍ జీన్‍ డిజార్డర్స్, మెటబాలిజం ఇన్‍బార్న్ ఎర్రర్స్ను కూడా ఇది అంది స్తుంది. సీడీఎఫ్‍డీ, నిమ్స్ల మధ్య ఒప్పం దంతో నిమ్స్లో మెడికల్‍ జెనెటిక్స్ డిపార్ట్ మెంట్‍ ఏర్పడింది. జన్యువ్యాధులు ఉన్న పిల్లలు, కుటుంబాలకు ఇది తన సేవలను అందిస్తోంది.
క్లినికల్‍ జెనెటిక్స్, కైటో జెనెటిక్స్, మాలిక్యులర్‍ జెనెటిక్స్, బయోకెమికల్‍ జెనెటిక్స్, ఫెటల్‍ మెడిసిన్‍ తదితరాల్లో ఈ విభాగం తన సేవలను అందిస్తోంది. ఇందుకోసం నిమ్స్లో సోమవారం నుంచి శుక్రవారం దాకా ప్రత్యేకంగా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఓపీడీ కూడా పని చేస్తోంది.

డీఎన్‍ఏ ఫింగర్‍ప్రింటింగ్‍:
తల్లిదండ్రుల నిర్ధారణ, ఇమ్మిగ్రేషన్‍, అవయవదానం, ఆస్తి సంబంధ వివాదాల్లో రక్తసంబంధాన్ని నిర్ధారించడం, తప్పిపోయిన పిల్లలు, ఆసుపత్రుల్లో పిల్లలు తారుమారు కావడం వంటి సందర్భాల్లో తల్లిదండ్రుల నిర్ధారణ, హత్య కేసుల్లో హతుల గుర్తింపు తదితర అంశాల్లో ఈ కేంద్రం సేవలను పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం సంస్థ వెబ్‍సైట్‍ను సందర్శించవచ్చు.

-సువేగా, 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *