ఈ జిల్లాలోని ప్రాంతం 7,760 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మరియు దేశంలోని మహానగరాల్లో ఒకటి కావడం విశేషం. ఈ జిల్లాలకు ఉత్తరాన మెదక్, దక్షిణాన మహబూబ్‍నగర్, తూర్పులో నల్లగొండ, పశ్చిమ దిశలో కర్ణాటక రాష్ట్రం కలదు.
రంగారెడ్డి జిల్లాలోని తూర్పు ప్రాంతం మరియు హైదరాబాద్ జిల్లా రగ్గడ్ టెరేన్ కావడం వాటిలో గ్రానైట్ శిలలు గుట్టలు, కొండలుగా వుండడం విశేషం. ఈ గుట్టలు 613 మీటర్ల ఎత్తు వరకు కలవు. వీటితో పాటు డొలరైట్ మరియు క్వార్టజ్ శిలల రిడ్జ్లు కొన్ని కిలోమీటర్ల పొడవు వరకు ఉన్నవి. ఈ జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ఒక ప్లాటూగా ఉండటం వీటిలో మెట్లరూపంలో టోపోగ్రఫిని చూడగలం. ఈ జిల్లాలలోని ముఖ్య నది మూసి. ఇది హైదరాబాద్ నగరం గుండా పారుతుంది. ఉస్మాన్ సాగర్, హిమయాత్‍సాగర్ చెరువులు హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో కలవు. ఇంతకు ముందు ఈ చెరువులే నగరానికి తాగునీటికి ఆధారంగా ఉండేవి. కానీ ఇప్పుడు కృష్ణా జలాలు మరియు గోదావరి జలాలని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకురావడం జరిగినది. హుసేన్‍సాగర్ చెరువు హైదరాబాద్, సికింద్రాబాద్‍కు మధ్యలోఉండడం దాని చుట్టూ విగ్రహాలు గార్డెన్‍లు డెవలప్ చేయడం వల్ల అది ఒక పర్యాటక స్థలంగా మారింది.
ఈ జిల్లాలో చాలా వరకు రెడ్ సాండీ సాయిల్ వికారాబాద్, పరిగి, మన్నెగూడా ప్రాంతాలలో బ్లాక్ కాటన్ సాయిల్ మరియు లేటరైట్ సాయిల్ కలదు. భూగర్భ జలాలు గ్రానైట్ టెర్రెన్‍లో ప్రాక్చర్ల్ ద్వారా కంట్రోల్ అవుతుంది. డెక్కన్ ట్రాప్ ఏరియా అనగా వికారాబాద్, మన్నెగూడా పరిగి ప్రాంతాలలో రెండు బస్టాల్ ఫ్లోల కాంటాక్ట్ వద్ద దొరుకుతుంది. సీస్‍మోటెక్‍టానిక్ స్టడీ ప్రకారం ఈ జిల్లాలు మొత్తంగా జోన్-lll గా నిర్ధారించబడినది.
ఈ జిల్లాలో చాలా వరకు గ్రానైట్ శిలలతో కూడి అక్కడక్కడా నైసెస్‍ని చూడగలం. ఈ గ్రానైట్‍లు గ్రే, పింక్ రంగులలో ఉన్నవి. మీడియం నుండి కోర్స గ్రేన్డ్గా, కొన్ని సార్లు ఫార్ఫిరిటిక్‍గా మాసిల్‍గా ఉన్నవి. చాలా వరకు ఇవి ఇన్‍నెల్ బర్గ్లగా, డోమశేప్ లోగుట్టలు, బోల్డ్రీ బౌట్‍క్రాప్సగా చూడవచ్చును. ఈ గ్రానైట్ శిలలను జియొ కెమికల్ క్లాసిఫికెషన్ ప్రకారం గ్రానైట్ – గ్రానొడైయొరైట్-మాన్‍జొ గ్రానైట్ కోవకు చెందినవిగా నిర్ధారించబడినవి. ఈ జిల్లాలోని నైసెస్‍ను టోనలైట్-గ్రానోడయొరైట్ కోవకు చెందినదిగా నిర్ధారించబడినది. కాల్క్ ఆల్క్లైన్, మెటా అలుమినస్, l టైప్ మరియు సిన్ కొల్లిశన్ లేట్ ఓరోజెనిక్ శిలలుగా నిర్ధారించబడినవి. ఈ గ్రానైట్-నైస్ కాంప్లెక్స్లో డొలరైట్‍డైక్స్ 7-50 మీటర్ల వెడల్పుతో కొన్ని వందల మీటర్ల పొడువు గలవు. ఇవి నార్త్ వెస్ట్ – సౌత్ ఈస్ట్, నార్త్ – సౌత్, నార్త్ నార్త్ ఈస్ట్ – సౌత్ సౌత్ వెస్ట్ దిశలలో విస్తరించి వున్నవి. పశ్చిమ ప్రాంతంలో కర్ణాటక బార్డర్‍లో భీమా గ్రూప్‍కు చెందిన నియో ప్రొటిరోజోయిక్ పీరియడ్‍కు చెందిన సెడిమెంటరీ శిలలు గ్రానైట్-నైస్‍ల పైన అన్‍కన్‍ఫర్మ బల్‍గా ఉన్నది. ముఖ్యంగా లైమ్‍స్టోన్ సీక్వన్స్ లోశెల్, సాండ్ స్టోన్ పొరలు ఉండటం విశేషం. డెక్కన్ ట్రాప్ యొక్క బసాల్టిక్ లావాస్ వికారాబాద్, తాండూర్, పరిగి ప్రాంతాలలో గ్రానైట్ – నైస్ మరియు భీమా గ్రూప్ శిలలను పైన కవర్‍గా కనిపిస్తాయి. డెక్కన్ బసాల్ట్లు మీడియం నుండి ఫైన్ గ్రే నడగా ఉండటం మరియు వీటి వెసికల్స్లో సెకండరీ – ఖనిజాలు అనగా చాల్‍సిడొనీ, జియోరైట్స్, కాలసైట్, క్వార్టజ్తో నిండి యుండును. ఇందులో ఆప్టర్ క్రిటేషియస్‍కు చెందిన ఇన్‍ఫాట్రాపియన్ బెడ్స్ అనగా కంగ్లామరేట్, గ్రిట్, సాండస్టోన్, మార్ల్, చెర్ట్ కలవు. వీటిలో పాసిల్స్ ఉండటం విశేషం. బసాల్ట్లు వెదరింగ్ వల్ల లాటరైట ఫార్మ అవడం జరిగినది. ఈ జిల్లాలో పలు లీనియమెంట్‍లు, ఫాల్ట్లను గుర్తించడం జరిగినది. ఇవి చాలా వరకు నార్త్ వెస్ట్ – సౌత్ ఈస్ట్, నార్త్ నార్త్ ఈస్ట్-సౌత్ సౌత్ వెస్ట్, వెస్ట్ నార్త్ వెస్ట్ – ఈస్ట్ సౌత్ ఈస్ట్ ట్రెండ్‍లతో కలవు.
ఖనిజ సంపద :
డైమెన్‍షన్ స్టోన్స్ : గ్రానైట్ శిలలు పలు రంగులలో ఈ జిల్లాలో దొరుకును పింక్, గ్రే, పార్ఫిరిటిక్, వెరైటీలు, డొలరైట (బ్లాక్) గ్రానైటలు కన్‍స్ట్రక్షన్ పరిశ్రమలలో డెకరేటివ్ స్టోన్‍గా ఉపయోగిస్తారు. పింక్ గ్రానైట్ తుక్కాపురం, కొమ్మరవల్లి, దేవతల గుట్ట, తపనపల్లి పరిసరాలలో దొరుకును. బ్లాక్ గ్రానైట్స్ పోచంపల్లి, మల్కాపురం వద్ద ఉన్నవి. పలు ప్రాంతాలలో స్టోన్ క్రషర్స్ మరియు రోడ్ మెటల్‍కు వాడుతున్నారు. డెక్కన్ బసాల్టస్ గుడిమల్కాపూర్, గాజులగూడెం వద్ద క్వారీ చేస్తున్నారు. రోడ్‍మెటల్ కొరకు. మల్కాపూర్, సింగిరపేట వద్ద శాబాద్ లైమ్‍స్టోన్‍ని క్వారీ చేస్తున్నారు. వీటిని ఫ్లోరింగ్ మెటీరియల్‍గా వాడుతున్నారు. గట్టి లాటరైట్‍ని బ్లాక్స్గా కట్ చేసి కన్‍స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వాడుతున్నారు.
క్వార్ట్జ్ : ఈ ఖనిజం యొక్క వీన్స్ రీప్స్ చాలా ప్రాంతాలలో దొరుకును కానీ కొన్ని ప్రముఖమైనవి కూకట్‍పల్లి బహుదూర్‍పల్లి, లింగంపల్లి, శంషాబాద్, కొత్తూర్, పరిగి, బొల్లారం పరిసరాలలో దొరుకును. ఈ ఖనిజం ముఖ్యంగా గ్లాస్ మరియు సిరామిక్ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. వీటిలో 98.2% •ఱ•2 కలదు.
వైట్ క్లే (కెయొలిన్) : ఇది ఫెల్స్పార్ల వెదరింగ్ వల్ల ఏర్పడుతుంది. చాలా వరకు గ్రానైట్స్ మరియు బసాల్ట్ల నుండి ఉద్భవిస్తుంది. ఈ క్లే నిక్షేపాలు స్త్రీ రంగాపూర్ (18 mt), రుద్రవరం (3.25 mt), తిమ్మసానిపల్లి (10 mt) అలిపూర్ (11.5 mt). వీటికి మినహా వికారాబాద్ గోల్కొండ వద్ద కూడా కలదు.
ఫుల్లర్స్ ఎర్త్ : ఇది ఇన్‍టాట్రాపియన్ సెడిమెంట్స్లో సన్నటి పొరల రూపంలో దొరుకును. వీటి నిక్షేపాలు రుద్రారం, తిమ్మసానిపల్లి, పెద్దేముల్, మారేపల్లి మరియు అలీపూర్ వద్ద వున్నవి. దీనిని ముఖ్యంగా కాటన్ సీడ్ ఆయిల్ వనస్పతి, పెట్రోలియంని డీ కలర్ చేయడానికి మరియు డ్రిల్లింగ్ మడ్‍గా ఉపయోగిస్తారు.
రెడ్ మరియు ఎల్లో ఓకర్ : ఇవి చాలా వరకు వికారాబాద్ ప్లాటూ స్కార్ప్లో లాటరైట్ క్రింది భాగంలో దొరుకును. ఈ ప్రాంతంలో చిన్న పాకెట్స్ జిప్స్మ్ కూడా దొరుకుతుంది.
లైమ్ స్టోన్ : భీమా గ్రూప్‍కు చెందిన షాబాద్ ఫార్మేషన్‍లో లైమ్‍స్టోన్ 70 మీటర్ల తిక్‍నెస్ ఉంటుంది. ఇది క్రింది భాగం ఫ్లాగిగా, మధ్య మరియు ఫై భాగం మాసివ్‍గా ఉంటుంది. దీని యొక్క చాలా శాతం సిమెంట్ గ్రేడ్ లైమ్‍స్టోన్. ఈ ఫార్మేషన్‍ని విస్త•తంగా క్వారీ చేస్తున్నారు. సిమెంట్ ప్లాంట్లకు సప్లై చేస్తున్నారు. దీనికి మినహా ఫోరింగ్ స్లాబ్స్ పాలిషింగ్ చేసి వాడుతున్నారు.
- కమతం మహేందర్ రెడ్డి, ఎ : 90320 12955