చిరు ధాన్యాల్లో ఊదలు (Barnyard Millet’s) ఒకటి. రుచికి తియ్యగా ఉండే వీటిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. మన దేశంలో ఈ ఊదలను ఎక్కువగా ఉత్తరాఖండ్‍లో పండించగా.. తమిళనాడులోని పర్వత ప్రాంతాల్లో కూడా వీటిని పండిస్తున్నారు.
వీటితో తయారుచేసిన ఆహారం బలవర్ధకంగా ఉంటుంది. దీంతో సులభంగా జీర్ణమవుతుంది. ఊదలులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఊదలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఒక 100 గ్రాముల ఊదలల్లో పోషక విలువలు కింది విధంగా ఉంటాయి.
ఆరోగ్య ప్రయోజనాలు:
- ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
- ఊదల్లో పీచు పదార్ధం అధికంగా ఉండటం వలన మలబద్దకానికి, మధుమేహానికి మంచిది.
- జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేగులకి వచ్చే కాన్సర్ బారిన పడకుండా ఊదలు చేస్తాయి.
- ఊదలను తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య అదుపులో
- ఉంటుంది.
- లివర్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
- ఉత్తరాఖండ్, నేపాల్ లో ఊదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారు. గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువ రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం.
- బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
- కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి.
- కామెర్లను తగ్గించడానికి వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి.
- పెద్ద వారిలో మూత్రాశయ నియంత్రణ కొరకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు నయం కావడానికి ఊదలు బాగా పనిచేస్తాయి.
- ఇకనుంచి మీ డైట్‍లో కూడా వీటిని భాగం చేసుకోండి•. చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.
- దక్కన్‍న్యూస్
ఎ : 9030 6262 88