ఉమ్మడి అనంతపురం జిల్లా ఆంధప్రదేశ్‍లోని దక్షిణ ప్రాంతంలోని ముఖ్యమైన ప్రదేశం. ఈ జిల్లా 19,125 చదరపు కిలోమీటర్లలో విస్తరించి వున్నది. ఈ జిల్లాలో 958 గ్రామాలు, 11 పట్టణాలు కలవు. ఈ జిల్లాకు ఈశాన్యంలో కడప జిల్లా, ఉత్తరంలో కర్నూలు జిల్లా, పశ్చిమం, నైరుతిలో కర్ణాటక రాష్ట్రం ఉన్నవి. ఇది ఆంధ్ర రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలోని దక్షిణ దిశలో ఉంటుంది. ఈ ప్రదేశంలో ఎత్తైన ప్రాంతం దక్షిణాన కలదు. అది 670 మి. m.s.i పైన, ఉత్తరాన తాడిపత్రి వద్ద 270 మి. m.s.i పైన కలదు. తూర్పులో కొండ ప్రాంతంగా ఉంటుంది.
ఉత్తరాన ఎర్రమలైలు హద్దుగా నిలిచి వున్నవి. ఈ జిల్లాలోని ప్రాంతం తరచు కరువుతో కలిగి ఉండడానికి కారణం అతి తక్కువ వర్షపాతం ఉండడం వల్ల. జియాలజిస్ట్లు వారి స్టడీస్ ద్వారా ఇది ఒక ఎడారిగా మారే అవకాశం ఉన్నదని, అది కాక ముందే కొన్ని చర్యలు తీసుకొని ప్రభుత్వం దీన్ని సస్యశ్యామలం చేయవలసి వుంటుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే దిశలో పనులు జరుగుతున్నవి. ఈ ప్రాంతంలోని ముఖ్య నదులు పెన్నేరు, చిత్రావతి, నగరి, పాపాగ్ని. వీటి ఉపనదులు, డ్రైనేజీ ఈ జిల్లాలోని నీటి అవసరాలను తీరుస్తాయి. వీటి డ్రైనేజ్ నెట్ వర్క్ను ఫ్రాక్చర్స్ కంట్రోల్ చేస్తున్నవి. వీటి ప్యాటర్న్ సబ్ డెండ్రిటిక్ నుండి సబ్ ఫ్యారెలెల్‍గా ఉంటుంది. ఈ జిల్లాలోని ప్రాంతం రెడ్ సాండి సాయిల్, రెడ్ లోమీ సాయిల్, మిక్స్డ్ రెడ్, బ్లాక్ సాయిల్స్తో కూడి ఉంటుంది. ఈ తరహా సాయిల్స్ చాలా వరకు సెమీ అరిడి ప్రాంతాలలో చూడగలము. సీస్మాటెక్‍టానిక్ స్టడీస్ ప్రకారం ఈ ప్రాంతం పెనిన్‍సులర్ శీల్డ్లోని స్టేబుల్ ప్రదేశం. ఈ ప్రాంతంలోని లాండ్‍ఫార్మ్స్, డెనుడెశనల్ హిల్స్, పెడిమెంట్ పెడిప్లెయిన్, ఫ్లడ్ ప్లేన్ నదులకు ఇరువైపు చూడగలం.
ఈ జిల్లాలోని శిలా సంపద గురించి చెప్పాలంటే కర్ణాటక సరిహద్దులో సర్‍గూర్ గ్రూప్‍కు చెందిన హైగ్రేడ్ మెటమార్ఫిక్ శిలలు, కాల్క్ సిలికేట్ రాక్, క్రిస్ట్లైన్ లైమ్‍స్టన్, కైనైట్-స్టారోలైటీ గర్నేటీ గ్రాఫిటీ, క్వార్టీజ్ బయోటైట్ నైస్, సిల్లిమనైట్, గ్రాఫిటీ, క్వార్ట్డైట్ మరియు బాబా బుదాన్ గ్రూప్‍కు చెందిన కరెంట్ బెడ్డెడ్ క్వార్ట్జైట్‍ను చూడగలం. ఎక్కువ ప్రాంతంలో పెనెన్‍నులర్ నైసిక్ కాంప్లెక్స్కు చెందిన హార్న్ బ్లేండ్ బయో టైటీ నైస్, బయో టైటీ నైస్, గ్రానైట్, గ్రానోడుయురైట్ శిలలు కలవు. వీటి మధ్యలో వెలిగల్లు, కదిరి, రామగిరి, పెనకచెర్ల శిస్ట్ బెల్ట్లకు చెందిన మెట బసాల్ట్, మెటడసైట్, రయొలైట్, క్వార్ట్జ్ పార్ఫిరి, క్లొరైట్ సెరిసైట్ శిస్ట్ మరియు క్వార్ట్జో ఫెల్స్పాతిక్‍శిస్ట్, బ్యాండెడ్ ఫెరుజినస్ క్వార్ట్జైట్, మిఘ్మటైటీ క్వార్ట్జైట్‍లను చూడగలము. ఈ ప్రాంతంలోని పశ్చిమ భాగంలో క్లోస్‍పెట్ గ్రానైట్ కలదు. ఇది చాలా పెద్ద ఇన్‍ట్రూసివ్, కర్ణాటక నుండి దాదాపు N-S దిశలలో దార్వార్ క్రేటాన్‍ని రెండుగా విభజిస్తుంది. ఇది ఉద్భవించిన సమయం 2500 మిలియన్ సంవత్సరాల క్రితం. ఈ జిల్లా యొక్క తూర్పు భాగంలో కడప సూపర్ గ్రూప్‍కు మరియు కర్నూలు గ్రూప్‍లకు చెందిన సేడిమెంటరి శిలలను చూడగలము. ఈ సేడిమెంటరి శిలలు కంగ్లామరేట్, క్వార్ట్జైట్, శేల్, లైమ్‍స్టోన్, డొలమైట్, తాడిపత్రి ఫార్మెశన్‍కు చెందిన శెల్‍లో బెసిక్ సిల్స్ ఉండటం విశేషం.
ఖనిజ సంపద:
ఈ జిల్లాలో ఖనిజ వనరులు పుష్కలంగా కలవు. అవి వజ్రాలు, బంగారం, ఇనుము, డొలొమైట్, కొరండమ్, కమర్షియల్ గ్రానైట్స్, స్టియటైట్, బెరైటిస్, శీలైట్ మరియు క్లే. వీటిని ఒకొక్కటిగా విశ్లేషించుకుందాం.
డైమండ్ (వజ్రం):
ఈ జిల్లాలోని వజ్రకరూర్ ప్రాంతం వజ్రాలకు ప్రసిద్ధి చెందినది. పురాతన కాలంలో మైనింగ్ జరిగినట్టు ఆధారాలు ఈ ప్రాంతంలో వున్నవి. ఇప్పటి వరకు ఈప్రాంతంలో 29 కింబ్‍లైట్ శిలలను (వజ్రాలు దొరికే శిల) వజ్రకరూర్ కింబర్ లైట్ పీల్డ్ (WKF)లో కనిపెట్టారు. ఈ ఫీల్డ్ 720 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. కింబర్‍లైట్ శిలలను గుర్తించిన ప్రాంతాలు, వజ్రకరూర్, లత్తవరం, అనుమంపల్లె, వెంకటాంపల్లె, ములిగిరెపల్లె, తిమ్మసముద్రం, కళ్యాణదుర్గ్, గొల్లపల్లె, చిగిచెర్ల, బ్రాహ్మణపల్లె 29లో 26 కింబర్‍లైట్స్ జి.ఎస్.ఐ. ఎక్సప్లోర్ చేయడం జరిగింది. మరి అన్నింటిలో డైమండ్స్ దొరకడం విశేషం. P-15 కింబర్ లైట్ ఈ మధ్యలో గుర్తించబడినది. ఇది వ్ర కరూర్- లత్తవరం క్లస్టర్‍కు చెందినది. పొత్తిపాడు ప్రాంతంలో స్ట్రీమ్‍సెడిమెంట్స్లో మైక్రోడైమండ్స్ దొరికినవి. వెంకటాంపల్లె ప్రాంతం యొక్క పైప్-10లో అతి పెద్ద డైమండ్ దొరికింది. అది 16.30 క్యారెట్స్ కలదు.
గోల్డ్ (బంగారం) :
రామగిరి శిస్ట్ బెల్ట్లో 1910 నుండి ఇప్పటి వరకు బంగారు నిక్షేపాలను వెలికి తీస్తున్నారు. బంగారం నీలి రంగు క్వార్ట్జ వీన్స్లో దొరుకును. ఈ క్వార్ట్జ్ వీన్స్కు క్లోరైటీ – సేరిసైటీ శిస్ట్లో చూడగలం. ఈ క్వార్ట్జ్ వీన్స్ సామాన్యంగా, 2 నుండి 25 మీటర్ల మందం కలిగి యున్నవి. కర్బో నెట్ రిచ్ ప్యాచెస్‍లో గోల్డ్ ఎక్కువగా వుంటుంది. భద్రంపల్లి, రామాపురం ప్రాంతాలలో గోల్డ్ యొక్క ఓల్డ్ వర్కింగ్స్ను చూడగలము. ఈ ప్రాంతంలో క్వార్ట్జ్, క్వార్ట్జ్ – ఆంకరైట్ వీన్స్లో గోల్డ్ మినరలైసేశన్ ఉన్నది.
ఇనుము (ఐరన్):
హైగ్రేడ్ హెమటైట్ ఓర్ లెన్సెస్, పాకెట్స్ రూపంలో ధార్‍వార్ సూపర్ గ్రూప్‍శిలల్లో ఓబులాపురం సిద్దాపురం, చలాపురం ప్రాంతాలలో దొరుకును. వీటి రిజర్వ్స్ 1 Mt ఓర్ 60 % Feతో కూడి వుంటుంది.
డొలమైట్ :
వీటి నిలువలు చాలా మొత్తంలో దాడికోట, ఎల్లుట్ల, రంగరాజపల్లి, వెంకన్నపల్లి, అయ్యలచెరువు, ముడుగు ప్రాంతాలలో కలవు. కెమికల్ గ్రేడ్ డోలమైట్ కోన – రామేశ్వరస్వామి మందిర పరిసరాలలో కలదు. ఇది వెంపల్లి ఫార్మేశన్‍కు చెందిన డొలమైట్. దీనిని మెటలర్జి, కెమికల్, రిఫ్రాక్టరి, స్టీల్ పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
కోరండం (Al2O3) :
కొరండమ్‍ను చాలా వరకు అబ్రేసివ్‍గా ఉపయోగిస్తారు. ఈ ఖనిజం యొక్క ట్రాన్స్ఫరెంట్ వెరైటీస్ జెమ్‍స్టోన్స్గా ప్రసిద్ధి చెందింది. ఇది సామాన్యంగా అల్ట్రాబెసిక్ మరియు సైనైట్ శిలల్లో దొరుకుతుంది. ఈ జిల్లాలో కొరండమ్ యొక్క జెమ్‍వెరైటి పెన్నేర్ నది ఒడ్డున దొరికే టెర్రేస్ గ్రావెల్స్లో హిందుపూర్ కలవపల్లె మధ్యలో దొరుకును. ఈ ఖనిజం దొరికే ప్రాంతాలు కాడిగనపల్లి, నల్లయపల్లె, నర్సాపురం, రేకులకుంట, నూటిమడుగు, ముద్దలచెరువు మరియు పరిగి.
డైమెన్సెన్ స్టోన్స్ :
ఈ జిల్లాలో చాలా వరకు డైమెన్షన్ స్టోన్స్ కమర్షియల్ గ్రానైట్స్ రూపంలో చూడగలము. ఈ డైమెన్షన్ స్టోన్స్కు మార్కెట్ చేయడానికి ఒక్కొక్క వెరైటికి ఒక కమర్షియల్ పేరు ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో ఫైన్ గ్రేన్డ్ గ్రే గ్రానైట్‍ను అనంతపూర్ గ్రేగా మార్కెటింగ్ చేస్తున్నారు. వీటి నిక్షేపాలు నసనకోట మరియు వెలకుంట్ల వద్ద వున్నవి. ప్యారడైసో (మిగ్మాటైటీ నైస్), హెచ్.డి.హల్లి మరియు వజ్రకరూర్‍కి 5 కి.మీ. దూరంలో ఆగ్నేయంలో ఉన్నవి.
బత్తుపల్లికి 8 కి.మీ. దూరంలో వాయువ్య దిశలో కలదు. స్పాటెడ్ రెడ్ (పింక్ గ్రానైట్ ప్లేజియో క్లేసు గ్రేన్స్తో) బుక్కరాయ సముద్రం వద్ద, ఐవరి శైన్ (కొర్సగ్రేన్ట్ గ్రే పార్ఫిరిటిక్ గ్రే గ్రానైట్) నసన కోటకు ఆగ్నేయంలో కలదు.
స్టియటైట్ (Mg3Si4O10(OH)2) :
దీన్ని టాల్క్ అని కూడా అందురు. ఇది తెల్లరంగుతో పాటు వెండి లాగా మెరుస్తుంది. ఆకుపచ్చ రంగులో కూడా ఉంటుంది. దీన్ని సెరామిక్, ఎలక్ట్రికల్ పోర్సిలెన్, రిఫ్రాక్ట్రీ పరిశ్రమలలో మరియు పెయింట్స్లో ఫిల్లర్‍గా ఉపయోగిస్తారు. అన్నిటికన్నా ఎక్కువగా టాల్కం పౌడర్ తయారీలో వాడతారు. ఈ జిల్లాలో ఇది డొలమైట్‍లో లెన్సెస్ రూపంలో, ఓనగంరెడ్డి పల్లె, మాడుగుపల్లె, కర్నపూడి ముట్సుకోట, తబ్‍జుల, బెలపంపల్లె మరియు సాతూరు. వీటి నిక్షేపాలు మొత్తంగా 1.4 Mt గా నిర్ధారించబడినది.
బెరైటిస్ (BaSo4) :
ఈ ఖనిజం బేరియంకు ముఖ్యమైన సోర్స్. దీనిలో 65% Bao కలదు. ఇది మాసివ్ మరియు క్రిస్ట్లైన్ ఫారంలో వుంటుంది. దీనికి స్పెసిఫిక్ గ్రావిటి చాలా ఎక్కువ. బెరైట్ నిక్షేపాలు మూడు రకాలు 1) వీన్ మరియు కేవిటీ ఫిల్లింగ్ 2) బెడ్డెడ్ 3) రెసిడ్యుల్ డిపాజిట్‍లు. దీని ఉపయోగం ఎక్కువగా కెమికల్, పేయింట్స్లో ఉంటుంది. కొంత వరకు రబ్బర్, టెక్స్టైల్, పేపర్, లెదర్, ఆయిల్, లినోలియం, ప్లాస్టిక్ మరియు సిరామిక్స్లో ఉన్నది. ఈ జిల్లాలో ఇది వెంపల్లి డొలమైట్స్లో దొరుకుతుంది. ఈ ఖనిజం దొరికే ప్రాంతాలు నెరిజంపల్లి, దాడితోట, ఎల్లుట్ల, రంగరాజుకుంట, మాడుగుపల్లి, వెంకటంపల్లి, ముడ్సుకోట, తబ్‍జుల, సంజీవపురం, ఓబులాపురం, చింతలచెరువు, కొనాపురం, కొండమల్ల, చందన, లక్షమాపల్లె మరియు క్రిష్టపాడ్. ఇవి చాలా వరకు వీన్స్ టైప్, వీటి వీన్స్ 30ఎ నుండి 90m పొడువు మరియు 30 cm నుండి 3 cm వెడల్పుగా వున్నవి.
శీలైట్ :
ఇది టంగ్‍స్టన్ ఓర్ సామాన్యంగా డిసెమీ నేషన్స్ స్ట్రింజర్స్, ఫ్రాక్చర్ ఫిల్లింగ్స్ రూపంలో దొరుకతుంది. వీన్ క్వార్ట్జ్‍లో. ఈ క్వార్ట్జ వీన్స్ గ్రానైట్స్ మరియు నైసెస్‍లో ఫ్రాక్చర్స్లో ఎమ్‍ప్లేస్ అవుతవి. ఈ శీలైట్ దొరికే ప్రాంతాలు పెనుకొండ, పంపనం, బాలాపాలెంకు 2.5 కి.మీ. నైరుతిలో.
క్లే నిక్షేపాలు:
కెయొలినైట్‍క్లే తాడిపత్రి శేల్ ఫార్మేషన్‍లో పుట్లంకు 1.5 కి.మీ. దూరంలో ఉన్నవి.
- కమతం మహేందర్ రెడ్డి
ఎ : 90320 12955