దేశ భవిష్యత్‍పై ఆందోళన అక్కరలేదు


ఏపీ ప్రభుత్వ సలహాదారులు కె.రామచంద్రమూర్తి
హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍లో ‘సిటిజన్‍ యాక్టివిజమ్‍ ఇన్‍ ఇండియా’ పుస్తకావిష్కరణ సభ


భారత రాజ్యాంగానికి భరోసా ఇచ్చేది నేటి యువకులే అని, దేశ భవిష్యత్‍పై ఎవరికీ ఆందోళన అక్కరలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారులు కె.రామచంద్రమూర్తి అన్నారు. హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍లోని సి.రాఘవచారి వేదికపై డా.ఎన్‍.భాస్కర్‍రావు రాసిన ‘సిటిజన్‍ యాక్టివిజమ్‍ ఇన్‍ ఇండియా’ పుస్తకావిష్కరణ సభ డిసెంబర్‍ 31న జరిగింది. ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ప్రభుత్వ సలహాదారులు కె.రామచంద్రమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ యువకులు రాజ్యాంగాన్ని తమ భుజస్కందాలపై మోస్తున్నారని కొనియాడారు. రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేకుండా దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఇటీవల దేశంలో జరిగిన పరిణామాలు దీన్ని సూచిస్తున్నట్లు తెలిపారు. పౌరసత్వం బిల్లును వ్యతిరేకిస్తూ ఒక్క ముస్లింలే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లమీదకు వచ్చి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో బెంగుళూరులో తాను ఆంధప్రభలో పనిచేస్తున్నప్పుడు గోయింగ్‍ గన్‍కే ధిక్కారణ ఉద్యమాన్ని చేసినట్లు తెలిపారు. అటువంటి నిర్భయమైన, సాహసం చేసే విషయాలపై మరిన్ని పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు. డా.భాస్కర్‍రావు ఇప్పటి వరకు 16 పుస్తకాలు రాశారని, ఇంకా ఆయన మరికొన్ని పుస్తకాలు రాయాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. డా.భాస్కర్‍రావు సిటిజన్‍ పుస్తకం రాసేపాటికి సిటిజన్‍ ఎమెండ్‍మెంట్‍ దేశంలో ఇంకా అమలుకాలేదన్నారు. దాంతో ఆ విషయాలను ఈ పుస్తకంలో కవర్‍ చేయలేదన్నారు. పౌరసత్వ బిల్లుపై ముస్లింలతోపాటు హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు ఇలా అందరూ కూడా దేశవ్యాప్తంగా నిరసనలు చేసినట్లు చెప్పారు. ఇటువంటి ప్రజలు ఉన్నందుకు గర్వపడాలని, బాధపడాల్సింది రాజకీయ పార్టీలే అన్నారు. ఎన్నికల్లో చెప్పిన ఏజెండా పట్టించుకోకుండా రాజకీయ పార్టీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తాయని చెప్పారు. నిరసన తెలిపే ప్రదేశం లేనంతమాత్రాన నిరసన ఆగదన్నారు. నిరసన చేయడానికి వంద మార్గాలుంటాయని, ప్రజలు వాటిని వినియోగించుకుంటారన్నారు. 2019 ప్రథమార్థంలో ఉన్నట్లు, మౌనంగా, నిస్తేజంగా ఉండకూడదని, 2020లో ఉత్తేజంగా ఉండాలని, ధిక్కారస్వరం వినిపించాలని, రాజ్యాంగాన్ని ఊరేగింపుగా జరుపుకోవాలని ఈ పుస్తకం తెలుపుతుందన్నారు. ప్రజల హక్కులను కాపాడుకోవాలని చెప్తుతుందన్నారు. 2020లో రాజ్యాంగ దశాబ్దంగా నిర్మించుకోవాలని, అందుకు ఇలాంటి పుస్తకాలు దోహద పడతాయన్నారు. 2019లో రాజ్యాంగం ఊరేగింపు జరుపుకోవాలని ఈ పుస్తకం అభిలషిస్తుందని, పౌరహక్కుల రాజ్యాంగ దశాబ్దంగా నిర్మించుకోవాలన్నారు. నిర్భయమైన ప్రజా హక్కులు సాధించుకోవడమే ఈ పుస్తకం లక్ష్యం అన్నారు.


సిటిజన్‍ యాక్టివిజమ్‍లో సోషల్‍ జస్టిస్‍పై క్లుప్తంగా వివరణ : ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍

సభకు అధ్యక్షత వహించిన ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍ మాట్లాడుతూ ‘సిటిజన్‍ యాక్టివిజమ్‍ ఆఫ్‍ ఇండియా’ పుస్తకంలో దేశంలో సోషల్‍ జస్టిస్‍, ప్రొటెక్టింగ్‍, రైట్స్, ఎన్విరాన్‍మెంట్‍, కలెక్టివ్‍ జస్టిస్‍ తదితర అంశాలపై డా.భాస్కర్‍రావు క్లుప్తంగా వివరించడం గర్వకారణం అన్నారు. దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని విభిన్నకోణాల్లో వైవిధ్యంగా చెప్పినవిధానం ఆకట్టుకుందన్నారు. డా.భాస్కర్‍రావు రెండు దేశాల యూనివర్సిటీల నుండి మాస్‍ కమ్యూనికేషన్‍లో పీహెచ్‍డీ చేసిన తొలి తెలుగు బిడ్డ అని కొనియాడారు. ఆయన దేశంలోని అడ్వైజరీ రోల్‍, సెంటర్‍ ఫర్‍ మీడియా స్టడీస్‍, న్యూఢిల్లీ చైర్మన్‍గా, స్టడీస్‍ ఆఫ్‍ సోషల్‍ జర్నలిజం వంటి పలు అత్యున్నత పదవులు నిర్వర్తించినట్లు తెలిపారు. సివిల్‍ సొసైటీ యాక్టివిజమ్‍, ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవడం ఎలాగో పుస్తకంలో క్లుప్తంగా వివరించినట్లు తెలిపారు.


స్వేచ్ఛ లేకపోతే క్లోనింగ్‍ సమాజం తయారౌతుంది : రచయిత కటికనేని విమల

సిటిజన్‍ యాక్టివిజమ్‍ ఆఫ్‍ ఇండియా సరైన సమయంలో, సరైన పుస్తకంగా రావడం గర్వకారణం అని రచయిత కటికనేని విమల అన్నారు. దేశవ్యాప్తంగా సీఏఏ, మహిళలపై, ఆదివాసీలపై అత్యాచారాలు తదితర సంక్లిష్టమైన సందర్భంలో ఇలాంటి పుస్తకం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నట్లు తెలిపారు. ఈ పుస్తకం గవర్నమెంట్‍, గవర్నెస్‍ అనేది గుర్తించాలని పాఠకులకు చెప్తుందన్నారు. ఇటు గవర్నమెంట్‍కు అటు ప్రజలకు ఎలా ఉండాలో క్లుప్తంగా వివరిస్తుందన్నారు. వ్యక్తులు కావచ్చు, గ్రూపులు కావచ్చు..మనకు సంబంధించిన హక్కులకు సంబంధించిన అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుందన్నారు. అధికారుల దృష్టిలో నుంచి చూసినప్పుడు నిఘా గురించి చెప్తుందన్నారు. పౌరసృహ లేకపోతే సమాజంలో చాలా ఇబ్బందిగా మారుతుందన్నారు. స్వేచ్ఛ లేకపోతే క్లోనింగ్‍ సమాజాన్ని తయారు చేస్తారన్నారు. ఇంటర్నల్‍ విజిలెన్స్ రెండు వైపుల ఉన్నప్పటికీ అందులో ఉన్న తేడాలను గమనించకపోతే గవర్నెస్‍ కుప్పకూలిపోతుందన్నారు. నిజానికి గవర్నెస్‍ అనేది మంచి గవర్నెన్స్గా ఉండాలంటే సిటిజన్‍ సెన్సివిటిని పట్టించుకోవాలన్నారు.


సిటిజన్‍ యాక్టివిజమ్‍ మంచి పుస్తకం : తెలంగాణ చీఫ్‍ పబ్లిక్‍ రిలేషన్‍ ఆఫీసర్‍ జ్వాల నరసింహారావు

సిటిజన్‍ యాక్టివిజమ్‍ పుస్తకం చాలా అద్భుతమైనదని, ఈ రచయితకు తనకు 30 ఏళ్ల నుంచి పరిచయం ఉందని తెలంగాణ చీఫ్‍ పబ్లిక్‍ రిలేషన్‍ ఆఫీసర్‍ జ్వాల నరసింహారావు అన్నారు. ఆ పరిచయంతో భాస్కర్‍రావు ఏ పుస్తకం రాసిన తాను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన రాసిన 15 పుస్తకాలతో తనకు మంచి సంబంధం ఉన్నట్లు తెలిపారు. 1997లో ఐకె గుజ్రాల్‍ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశం 50 సంవత్సరాల స్వాతంత్య్రం గోల్డెన్‍ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలకు ఏదైనా మంచి పని చేయాలని దేశంలోని అందరూ సీఎంలు ఏకగీవ్రంగా తీర్మానం చేసి, 9.యాక్షన్‍ ప్లాన్‍ తీసుకొచ్చినట్లు తెలిపారు. అర్జెంట్‍గా సిటిజన్‍ సెంట్రిక్‍ ప్లాన్స్ గనక తీసుకురాకపోతే ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం పోతుందన్నారు. ఆరునెలల్లో మార్పురావాలని ప్లాన్‍ చేసినప్పటికీ దేశంలోని 18 నెలల తర్వాత ఏ ఒక్కరాష్ట్రంలో కూడా అది పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. 1960 నుంచి ఇప్పటి వరకు పౌరుల్లో స్పందన ఉందని, సిటిజన్‍ ఎప్పుడూ కూడా యాక్టివ్‍గానే ఉంటారన్నారు. కానీ 9 పాయింట్ల యాక్షన్‍ ప్లాన్‍ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమలు చేసి ఉన్నట్లయితే చాలా మంచి అభివృద్ధి జరిగి ఉండేదన్నారు. ప్రజలు ఎప్పుడూ యాక్టివ్‍గానే ఉన్నట్లు తెలిపారు. సిటిజన్స్ ఎక్కడైతే యాక్టివ్‍గా ఉంటారో అక్కడ ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందన్నారు. గుడ్‍ గవర్నెన్స్పై డా.భాస్కర్‍రావు మరిన్ని పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు.


దేశాన్ని పార్టీలే పరిపాలిస్తున్నాయి : సిటిజన్‍ యాక్టివిజమ్‍ ఆఫ్‍ ఇండియా పుస్తక రచయిత డా.ఎన్‍.భాస్కర్‍రావు
సిటిజన్‍ యాక్టివిజమ్‍ను దేశంలో టాప్‍ లెవల్‍ నుంచి గ్రామంలోని కింది స్థాయి వరకు చాలా మంది అపార్థం చేసుకుంటున్నారని పుస్తక రచయిత సెంటర్‍ ఫర్‍ మీడియా స్టడీస్‍ న్యూఢిల్లీ చైర్మన్‍ డా.ఎన్‍.భాస్కర్‍రావు అన్నారు. ప్రభుత్వాలు, పార్టీలే దేశాన్ని పాలిస్తున్నాయని, ప్రజలు ఎక్కడున్నారోనని వెతుక్కోవాల్సి వస్తోందన్నారు. అందుకే ఈ పుస్తకం రాయాల్సిన అవసరం వచ్చిందన్నారు. అందుకనే గ్రామ, రాజకీయ, పరిస్థితులను గమనించి గత 70 సంవత్సరాలకుపైగా జరుగుతున్న సందర్భాలు, 17 ఎలక్షన్లు, 8 పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చాయని, అయినా ప్రజల్లో పెద్దగా మార్పు రాలేదన్నారు. ఏ వ్యవస్థ కూడా సుప్రీం కాకూడదని, కానిస్టిట్యూషన్‍ ఏర్పాటు చేశారని, కానీ నేడు పొలిటికల్‍ పార్టీలే దేశాన్ని అన్ని రంగాల్లో ఆధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలకు పాత్ర ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా చెందుతుందన్నారు. ప్రజలు చర్చించుకోవడానికి సరైన అవకాశం ఇవ్వాలన్నారు. ఒక సమస్య చర్చించుకోవాలని, అప్పుడే దానికి సరైన పరిష్కారం లభిస్తుందన్నారు. 35 నగరాల్లోనే కాకుండా, మిగతా నగరాల్లో విద్యాసంస్థలు నాశనమవుతుండటానికి కారణం ప్రజలకు సరైన అవకాశాలు ఇవ్వకపోవడమే అన్నారు. ప్రజలను మభ్యపెట్టి, పరిపాలిస్తున్నారని, ప్రజల మీద ప్రభుత్వం ఆధారపడాలి కానీ ప్రభుత్వం మీద ప్రజలు ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. దేశ రాజధాని మొదలుకొని గ్రామస్థాయి వరకు పౌరహక్కులకు భంగం కలుగుతుందని, గ్రామ రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకం రాసినట్లు తెలిపారు.


35 నగరాలు, 105 సివిల్‍ సొసైటీ హాట్‍స్పాట్స్ గురించి ఈ పుస్తంలో రాశారు : రచయిత నాగసూరి వేణుగోపాల్‍
హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍లో మాట్లాడుతున్నామంటే ఇందిరాపార్కు వద్ద మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని రచయిత నాగసూరి వేణుగోపాల్‍ అన్నారు. ఒకవేళ ఇందిరాపార్కు ప్రాణం పోసుకొని మాట్లాడితే ఎన్నో వేదనలు, ఆక్రోశం, ఆవేదన, ప్రతిఘటనా స్వరం వినిపిస్తుం దన్నారు. ఈ పుస్తకం కూడా అలాంటి పుస్తకమే అన్నారు. సిటిజన్‍ యాక్టివిజమ్‍ ఎట్లా ఉంది, భారతదేశంలో దాదాపు 35 నగరాల్లో 105 సివిల్‍ సొసైటీ హాట్‍స్పాట్స్ గురించి పుస్తకాన్ని రచయిత వివరించినట్లు చెప్పారు. యాక్టివిజమ్‍పై గత 25 సంవత్సరాల నుంచి అబ్దుల్‍ కలాంతోపాటు చాలా మంది పుస్తకాలు రాసినట్లు తెలిపారు. ప్రతి రోజూ ఢిల్లీలోని జంతర్‍మంతర్‍లో ఏదో ఒక అంశంపై నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు. 2017లో నిరసన తెలపకూడదని ఒక నిర్ణయం వచ్చిందని, నిరసన తెలిపే హక్కు
ఉండాలని మానవ హక్కుల కమిషన్‍ తీర్పు ఇచ్చిన విషయాలు కూడా పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. ఈ పుస్తకంలో రాజ్యం, పౌరులు, రాజ్యం ప్రభుత్వం మధ్య సంబంధాలు, ఎన్‍జీవోలు ఇలాంటి చాలా విషయాలపై కులంకుషంగా వివరించినట్లు తెలిపారు. యాక్టివిజమ్‍ ఆరో స్తంభం అని, చాలా వివరంగా పుస్తకం రాయడం గర్వకారణం అన్నారు. వ్యవసాయం, రైతులు, విద్యారంగం, అసంతృప్తి, ఆవేదన, మీడియా..ఇలా విశేషమైన సమాచారం, విభిన్నమైన అంశాల సమాచారం క్రోడికరించి యాక్టివిజమ్‍ పుస్తకం రాయడం అభినందనీయం అన్నారు.


ఈ కార్యక్రమంలో బుక్‍ ఫెయిర్‍ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్‍, ఫోరం ఫర్‍ బెటర్‍ హైదరాబాద్‍ జనరల్‍ సెక్రటరీ శోభాసింగ్‍ తదితరులు పాల్గొన్నారు.

  • కట్టా ప్రభాకర్‍
    ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *