దేశ, విదేశాల్లో పలు చిత్రకళా ప్రదర్శనలు
కృషి, పట్టుదల, ఆసక్తి ఉంటే చిత్రకళలో రాణించవచ్చని నిరూపిస్తున్నారు ప్రముఖ ఆర్టిస్టు అప్జా తమ్కనాథ్. కష్టపడటమేకాదు తాను ఎంచుకున్న రంగాన్ని ప్రేమించాలని, అప్పుడే విజయవంతం అవుతామంటున్నారు. సాహిత్య, చిత్రకళా కుటుంబంలో జన్మించిన హైదరాబాద్ నగరానికి చెందిన కళాకారిణి అప్జా తమ్కనాథ్ తన బాల్యంలోనే అందమైన పేయిం టింగ్ రంగం పట్ల ఆకర్షితు లయ్యారు. కళ తన ఆలోచనలను వ్యక్తపరిచే ఒక సాధనం లాంటిది అంటారు. ఇది ప్రపంచంలోని నిబంధనల నుండి తనను తాను విముక్తి పొందండం లాంటింది అని ఆమె చమత్కరిస్తారు. రంగుల పాలెట్లు, బ్రష్‌లతో నిండిన ఇంట్లో పెరిగిన ఆమ్జా తనకు తన తండ్రే ఆదర్శం ఆదర్శం అంటున్నారు. దేశంలో పేరు పొందిన చిత్రకారుల్లో ఈమె తండ్రి తమ్కనాథ్ ఒకరు. తన వైవిధ్యమైన పేయింటింగ్‌తో రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు. హైదరాబాద్ నుండి ఉద్భవించిన గొప్ప మహిళా చిత్రకారుల్లో అప్జా తమ్కనాథ్ ముందు వరుసలో ఉంటారు. తన వైవిధ్యమైన పేయింటింగ్స్‌తో ఎన్నో దేశాల్లో ప్రదర్శనలు నిర్వహించి ఔరా అనిపించారు. తండ్రి నుండి కళా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆమె ఆస్ట్రేలియా, దుబాయ్, న్యూఢిల్లీ, హైదరాబాద్ మొదలైన నగరాల్లో చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఎన్నో కళాత్మకమైన బొమ్మలు గీసి మేటి చిత్రకారిణిగా గుర్తింపు పొందారు.
ఎడ్యుకేషనల్ ఎచీవ్‌మెంట్స్ :
అప్జా తమ్కనాథ్ 1990లో హైదరాబాద్‌లో జన్మించారు. 2011లో జవహార్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్టస్ అండ్ అర్కిటెక్చర్ యూనివర్సిటీ, హైదరాబాద్ నుండి బ్యాచిలర్ ఇన్ ఫైన్ ఆర్టస్ పూర్తి చేశారు.
సోలో షోలు :
- 2019లో ట్రియో సోలో షో, ఆర్ట్ ఫెయిర్, మెల్బోర్న్, ఆస్ట్రేలియా
- 2018 ట్రియో సోలో షో, న్యూయార్క్ ఆర్ట్ ఫెయిర్,
- 2018 ట్రియో సోలో షో, వరల్డ్ ఆర్ట్ దుబాయ్, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్
- 2017 ట్రియో సోలో షో, సింగపూర్ ఆర్ట్ ఫేర్, సింగపూర్
- 2017 సోలో షో, వరల్డ్ ఆర్ట్ దుబాయ్, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్
- 2016 సోలో షో, వరల్డ్ ఆర్ట్ దుబాయ్, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్
గ్రూప్ షోలు :
- 2019 క్లస్టర్, కుషి ఫౌండేషన్, న్యూఢిల్లీ
- వాల్యూ బియాండ్ గ్యాలరీ, చెన్నై
- 2018 ఎడెల్వైజ్ పాల్లెట్టీ ఆర్ట్ వాక్ 2018, న్యూఢిల్లీ
- 2018 జ్ఞాన ఆర్ట్ గ్యాలరీ, సింగపూర్
- 2017 ది కలాం అంజిరెడ్డి ఆర్ట్ ఫెస్టివల్, డాక్టర్ రెడ్డి ఫౌండేషన్, గ్యాలరీ స్పేస్ హైదరాబాద్
- 2017 దోయెన్ని, గ్యాలరీ స్పేస్..హైదరాబాద్
- 2016 వితిన్ రీచ్, గ్యాలరీ నవ్య, న్యూఢిల్లీ
- 2016 ఉమెన్స్ డే, గ్యాలరీ స్పేస్, హైదరాబాద్
- 2016 ఎడెల్వైజ్ పాల్లెట్టీ 16 ఆర్ట్ వాక్, ముంబై
- 2015 న్యూ ఉత్తరాంచెస్ – ఆర్ట్ ఆఫ్ ఎ డైనమిక్ జనరేషన్, దైరా సెంటర్ ఫర్ ఆర్టస్ అండ్ కల్చర్, హైదరాబాద్
- 2015 బ్లర్డ్ గేజెస్, కళాకృతి ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్
- 2015 వ్యూ పాయింట్, నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్
- 2015 బీయింగ్ ఇన్ హర్ ష్యూస్, కళాకృతి ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్
- 2014 ఈస్థటిక్స్ అండ్ యుటిలిటి, గ్యాలరీ స్పేస్, హైదరాబాద్
- 2014 శ్రిష్టి మేల్, అపోర్డేబుల్ అండ్ యుటిలిటరైన్ ఆర్ట్ ఫెయిర్, సృష్టి ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్
- ఎయిడ్ ఫర్ హుద్ హుద్ విక్టిమ్స్, గ్యాలరీ మ్యూజీ, మార్మేట్, హైదరాబాద్
- 2014 ఆర్ట్ ఫర్ కాజ్, ఎయిడ్ ఆఫ్ హుద్ హుద్విక్టిమ్స్, గ్యాలరీ స్పేస్, హైదరాబాద్
- ఎక్స్ప్రెషన్ ఆఫ్ కలర్స్, గ్యాలరీస్పేస్, హైదరాబాద్
- 2014 బ్రష్స్ట్రోక్స్ 2014 దక్కన్, తాజ్ దక్కన్, కొలోరెంటిక్.. లివింగ్ ఇన్ కలర్స్, హైదరాబాద్
- మాన్సూన్ షేడ్స్‌పై ఎగ్జిబిషన్, గ్యాలరీస్పేస్, హైదరాబాద్
- షేడ్స్ ఆఫ్ ఉమెన్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఎగ్జిబిషన్, రాడిసన్ బ్లూ అండ్ గ్యాలరీ స్పేస్, హైదరాబాద్
- 2014 కాంటెంపరరీ ఆఫ్ హైదరాబాద్, తమీ, నాత్ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్
- 2013 75 ఇయర్స్ ఆఫ్ దక్కన్ క్రానికల్, కళాకృతి ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్
- 2013 ప్లవర్, దైరా సెంటర్ ఫర్ ఆర్టస్, హైదరాబాద్
- 2012 ఆర్ట్ జంబోర్, దైరాసెంట్, ఫర్ ఆర్టస్ హైదరాబాద్
- 2011 21 హైదరాబాద్ ఆర్టిస్టు, తాజ్ దక్కన్, హైదరాబాద్
ఆర్ట్ క్యాంప్స్ :
- 2017 కరా ఫెస్టివల్, గ్యాలరీ స్పేస్, హైదరాబాద్
- 2016 కలర్స్ ఆఫ్ స్టేట్హుడ్, కంటోర్స్ ఆఫ్ ఉమెన్ ఎక్స్పీరియన్సెస్, ముక్త- తెలంగాణ ఉమెన్స్ కలెక్టివ్, ఫైగా టూంబ్స్, హైదరాబాద్
- 2014 ఆర్ట్ తెలంగాణ, తారామతి, బరదారి, హైదరాబాద్
- 2011లో 21 ఆర్టిస్టు, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్.
కలెక్షన్స్ :
- ప్రైవేటు కలెక్షన్ సింగపూర్ కర ఫెస్టివల్ ఇండియా
- ముక్త తెలంగాణ ఉమెన్స్ కలెక్టివ్, ఇండియా
- ఇమగో ముంద్, లూసియానో బెనెట్టన్ కలెక్షన్, ఇటలీ
- ప్రైవేటు కలెక్షన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
- ప్రైవేటు కలెక్షన్, దుబాయ్
- ప్రైవేటు కలెక్షన్, జర్మనీ ప్రైవేటు కలెక్షన్, మియామి ఆర్ట్, తెలంగాణ.
- దక్కన్‌న్యూస్,
ఎ : 9030 6262 88