కొలాము గిరిజనుల పెండ్లి – పాటలు

కొలాం సంప్రదాయ వివాహంలో కొన్ని ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి.
కొలాం వివాహ వ్యవస్థలో వరకట్నం అనేది ఉండదు. వరుడు గృహం వద్దనే వివాహం జరుగుతుంది. వివాహానికి అనేక దూర ప్రాంతాల వారిని ఆహ్వానించుతారు. ఆహ్వాన ఆనవాలుగా పసుపుతో కలిపిన జొన్న ధాన్యాలను తలూవల్‍ (అక్షింతలు)గా వారికి అందజేస్తారు.
ఊరిలో కళ్యాణ మండపం నిర్మించడానికి గ్రామంలోని ప్రజలందరు సహకరిస్తారు. అడవి నుండి వెదురు (బొంగులు) పెళ్ళిపందిరి నిర్మాణానికి తీసుకొని వస్తారు.
కళ్యాణానికి వచ్చే బంధువుల, చుట్టాల కోసం, భోజనం చేయడానికి, మోదుగు టేకు ఆకులను సేకరిస్తారు. గ్రామ పురుషులందరు కలిసి వంట చెరకు అడవి నుండి సేకరిస్తారు. వివాహానికి వచ్చిన వారిని గౌరవ, ఆప్యాయతలతో పలకరిస్తూ, తనీరు, చ్టులు (బీడీలు) విందు అందిస్తారు.
వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు వివాహానంతరం, డెమ్స్, డుల్లికి, రేలా పాటలకు నృత్యం చేస్తారు. వివిధ కళాకారులు నాటకాలు హాస్యచలోక్తులతో ఉండి సామాజిక స్పృహను కల్గి ఉండి అందరిని కడుపార నవ్విస్తారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన యువతి యువకులు తమ పరిచయాలు, సంబంధాలను, స్నేహ సంబంధాలుగా ఏర్పరచుకుంటారు.


కొలాం సమాజంలో వివాహాలు 4రకాలుగా జరుపుతారు. అవి:
1) ఈర్ల్ 2) పెండ్లిక్‍ 3) ఇల్లుటమ్‍ పెండ్లిక్‍ 4) హెట్ల్


1. ఈర్ల్ :


పెండ్లికి ముందు ఒకరోజు మాత్రమే జరుపుతారు. తమ గ్రామంలో ఉండే యుక్త వయస్సు కల్గిన యువతి, యువకులు ప్రేమించుకొని తల్లితండ్రులను ఎదిరించలేక ఐదు రోజుల పాటు దూర ప్రాంతాలకు వెళ్లి తమ బంధువుల వద్ద లేక మిత్రుల వద్ద ఉండి తిరిగి తమ స్వగ్రామాలకు వస్తారు. తర్వాత ఎలాంటి ఘర్షణలు లేకుండా సంబంధాలు కలుపుకుంటారు. వారి తల్లిదండ్రులను, బంధువులను పిలిచి గ్రామ పెద్ద, కారోబారి, ఊరి పటేల్‍, గ్రామ ప్రజల సమక్షంలో పన్స్ద్‍ ద్వారా తీర్పునిచ్చి, గ్రామ ప్రజల మధ్య, ప్రేమ అనురాగ ఆప్యాయతల మధ్య వివాహం సంబురంగా జరుపుతారు.
ఈర్ల్ అనేవి రాత్రి వేళనే జరుపుతారు. మొదట వరుడు వధువులకు వారి తనువులకు పసుపు రాసి స్నానం చేయిస్తారు. అదే విధంగా వరుడుకి పంచె (ధోతి), వధువుకు చీర ధరింపజేస్తారు.
ఈర్ల్ అనంతరం ఊరి పెద్ద దేవరి వారిని ఆశీర్వదించుతాడు. దేలాక్‍ (దేవరి) సమక్షంలో పోలకమ్మ (ఊరికట్టు బయట ఉండే దేవత)ను దర్శించడానికి డోలు, పెంపెరే వాయిద్యాలతో చాలా సంబురంగా సమూహంగా వెళ్ళుతారు.
నోవ్రక్‍ (వరుడు), నోవ్రీ (వధువు)లను పై నుంచి పడదను పట్టుకుంటారు. వారి ముఖాలు ఎవరికి కన్పించకుండా పసుపుతో ముంచిన వస్త్రాలతో కప్పి ఉంచుతారు. అమ్మోరు (పొలకమ్మ) బేటిక్‍ అనంతరం తిరిగి ఊరికి ప్రయాణం అవుతారు.
డోల్‍, పెంపెరే మార్మోగిస్తూ కళ్యాణ (ఈర్ల్) పందిరికి వచ్చిన అనంతరం వారిని చెక్క పీటల మీద కూర్చోబెట్టి నోవ్రక్‍ (వరుడు) యొక్క పెద్దన్న (పొత్తి) మంగళసూత్రాన్ని ఈర్ల్ (కళ్యాణ సభికులందరి)కి చూపిస్తారు అందరు నమస్కరించుతారు. వరుడు – వధువు మెడలో పొత్తి (మంగళసూత్రాన్ని) కట్టుతాడు. అక్కడ ఉన్న ప్రజలందరు తల్వ్ల్‍ (అక్షింతలు) వేసి దీవించుతారు. ఈర్ల్ అనంతరం ప్రజలందరు విందు ఆరగించి, డోల్‍, పెంపెర్‍ మ్రోగించుతు పెళ్ళి పందిరిలో ఈర్ల్కు వచ్చిన వారందరు డెమ్స్ డుల్లికి, కేల్‍ (నాటకం) ఆడతారు. ఈర్ల్ పందిరిలో యువతి/యువకుల పాటలు ఆకట్టుకుంటాయి.


డెమ్స్ పాట :

తెల్లోడి పూత తెల్లోడిపూత
కన్లు ఏనా కనున్‍కిలేదే ఏదే ఏనా సేద్దేనా ఆదిఏనా వారేద్‍ ।।2।।
పసుడి పూత పుసుడిపూత
కన్లు ఏనా కనున్‍కిలేదే ఏదే ఏనా సేద్దేనా ఆదిఏనా వారేద్‍ ।।2।।
గులాబి పూత గులాబిపూత
కన్లు ఏనా కనున్‍కిలేదే ఏదే ఏనా సేద్దేనా ఆదిఏనా వారేద్‍ ।।2।।
ముగ్రి పూత ముగ్రిపూత
కన్లు ఏనా కనున్‍కిలేదే ఏదే ఏనా సేద్దేనా ఆదిఏనా వారేద్‍ ।।2।।
తెలుగులో అర్థం :
ఇంత పెద్ద అడవిలో ఎక్కడుందో ఆ తెల్లనైన పువ్వు, ఎటైనా వెళ్ళుతున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. దానికి తోడుగా పచ్చని పసుపు పువ్వు నా కన్నులకైనా కనబడటం లేదు. గులాబిపువ్వులుగా ఉండే పువ్వు నాకు కనబడుత లేదు, ముద్ద మందారం పువ్వంత మొఖము చేసి అడవి అంతా వెతుకుతున్నా. నా కన్నులకు కనిపించవే. ఓ తెల్లని పుష్పమా!
డుల్లికి పాట :
వన్హ్ నీగురే అడవిత్‍
మట్‍ పొయ్యిలా సోగ నమ్లితానేవిసాదే ।।2।।
వన్హ్ నీగురే అడవిత్‍
మాక్‍ పొయ్యిలా సోగ నమ్లి ఎన్ద్త్‍ ఇసాదే ।।2।।
వన్హ్ నీగురే అడవిత్‍
మక్‍ పొయ్యిలా సోగ నమ్లి ఎన్ద్త్‍ ఇసాద్‍ ।।2।।
వన్హ్ నీగురే అడవిత్‍
మెట్‍ పొయ్యిలా సోగ నమ్లి తానేవిసాద్‍ ।।2।।
వన్హ్ నీగురే అడవిల్‍
ఇనే రూపున్‍ ఒల్స్ పన్ద్త్‍ ఇసాదే ।।2।।
వన్హ్ నీగురే అడవిత్‍
మేట్‍ పొయ్యిలా సోగ నమ్లి తానే విసాదే ।।2।।
తెలుగులో అర్థం :
వదిన, పచ్చదనంతో నిండిన ఈ అడవి అందాల్లో ఓ అందమైన గొంతుతో నెమలి పాట పాడుతుంది. వదిన నువ్వు విన్నావా!
ఆ కొమ్మపైన ఎగిరే నృత్యం చేస్తుంది. నీ రూపం/ అందం చూస్తూ నిన్నే చూస్తూ నృత్యం చేస్తుంది. ఆ నెమలి ఏమని పలకరిస్తుంది? అర్థం చేసుకో.


2. పెండ్లిక్‍ :


కొలాం సమాజంలో వివాహాన్ని ‘పెండ్లిక్‍’ అని పిలుస్తారు. ఈ పెండ్లిక్‍ మూడు రోజుల పాటు జరుగుతుంది.
ముందుగా వివాహం చేసుకొనే అమ్మాయి గృహానికి వెళ్ళి అమ్మాయిని అడుగుతారు. అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరిస్తే ఊరిలోని పెద్దవారితోపాటు పట్టుకొని గ్రామ పెద్ద, పటేల్‍, కారోబారి నాలుగు సగాల వారు కలిసి సంబంధాలు కలుపుకోవడానికి నిర్ణయిస్తారు.


చిదోరిక్‍ :
పెళ్ళి సంబంధం కుదిరినప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులకు ‘చిదోరిక్‍’ పెళ్ళి ఆనవాలు మర్యాదపూర్వకంగా వచ్చి ఇస్తారు. ‘చిదోరిక్‍’ అనగా అబ్బాయి పొలంలో పండించిన జొన్న, మొక్కజొన్న పప్పు, దినుసులు, ధాన్యాలు మొదలగునవి. తర్వాత కడియమ్‍ (నిశ్చితార్థం) చేస్తారు. అనగా కాబోయే వధువుకు వరుడు తరపున ఉంగరం, పట్టీలు (చాయినీక్‍) హారాలను ధరింపజేస్తారు.
కడియమ్‍కు వరుడు వెళ్ళరు.ఊరి పెద్ద వారు ప్రజలు అందరు సంబురంగా వెళ్ళుతారు. ఊరిలో ప్రజలందరూ భోజనం చేసి రాత్రివేళ కడియమ్‍ చేయడానికి దూర ప్రాంతాలకు ప్రయాణిస్తారు. ఎడ్లబండిలో సరిపడా ఆహార పదార్థాలతో ప్రయాణం చేస్తారు. కడియమ్‍ చేయడానికి వచ్చిన వారిని వధువు తల్లిదండ్రులు. మర్యాద పూర్వకంగా రాం.. రాం అని స్వాగతం పలుకుతు నమస్కరిస్తారు.
కడియమ్‍ చేయడానికి వచ్చిన వారికి తేనీరు, విందు, బీడి(చుట్ట) మొదలైనవి ఇచ్చి తగు సమాచారం, బాగోగులు ప్రయాణం గురించి, విశేషాలు తెలుసుకుంటారు.
డియమ్‍ చేయు విధానం :
కొలాం భాషలో వధువును నోవ్రీ అని వరుడిని నోవ్రా అని పిలుస్తారు. నోవ్రా తరపున వచ్చిన కొందరు యువతులు ఇంటిని ఆవుపేడతో శుభ్రం చేస్తారు.
నోవ్రీకి స్నానం చేయించి కొత్త చీరను కట్టుతారు.
నోవ్రీని పీటల మీద కూర్చోబెట్టి నోవ్రా తల్లిదండ్రులు కడియమ్స్ ఆనవాలు ధరింపజేస్తారు. కడియం తొడిగించిన అనంతరం మేనమామా నోవ్రీని తన దగ్గర కూర్చోపెట్టుకున్న సందర్భంగా మహిళలు పాడే పాట.
పాట :
రేల రేల రే రెల రేల రెల రెల
రేల రేల రేల రెల రేల రేల రెల ।।4 సార్లు।।
మామ ఇందద్‍ మామా బసి
మామ ఇంన్ద్ మామ బసి ।। 4 ।।
తానుంఙ మామా ఇంతి బసి
తానుంఙ మామా ఇంతి బసి ।। 4 ।।
ఇనే బొయ్దఙ వత్తనే మామ
ఇనే బోయ్దఙ వత్తనే మామా ।। 4 ।।
నీ కవాడ్‍ పుసేవే మమా
నీ కవాడ్‍ పుసేవే మమా ।। 4 ।।
కొత్త కవాడ్‍ గుల్‍ బెట్టి
కొత్త కవాడ్‍ గుల్‍ బెట్టి ।। 4 ।।
కవాడున్‍ పూసె అప్పా
కవాడున్‍ పూసె అప్పా ।। 4 ।।
నీవె లోప వారెవె బసి
నీవె లోప వారెవె బసి ।। 4 ।।
లోప వార్స్దె బసి
లోప వార్స్దె బసి ।। 4 ।।
లోపకమ్‍ అన్నెతే అప్ప
లోప కమ్‍ అన్నెతే అప్ప ।। 4 ।।
ఎల్లాన్‍ అయ్యేకద్‍ అన్నెత్‍ అప్ప
ఎల్లాన్‍ అయ్యేకద్‍ అన్నెత్‍ అప్ప ।। 4 ।।
పోక్లోండ్‍ కామే అన్నేతే అప్ప
పోక్లోండ్‍ కామే అన్నేతే అప్ప ।। 4 ।।
బుగ్గియే సప్పెకద్‍ అన్నేతే అప్ప
బుగ్గియే సప్పెకద్‍ అన్నేత్‍ అప్ప ।। 4 ।।
పొయ్యులే మేగేకద్‍ అన్నేత్‍ అప్ప
పొయ్యులే మేగేకద్‍ అన్నేత్‍ అప్ప ।। 4 ।।
ఎల్లయే మేగేకద్‍ అన్నేత్‍ అప్ప
ఎల్లయే మేగేకద్‍ అన్నేత్‍ అప్ప ।। 4 ।।
పుర్గు పల్లె అన్నేత్‍ అప్ప
పుర్గు పల్లె అన్నేత్‍ అప్ప ।। 4 ।।
సిట్టి ముంత అన్నేంత్‍ అప్ప
సిట్టి ముంత అన్నేంత్‍ అప్ప ।। 4 ।।
గంజుగొంది అన్నేంత్‍ అప్ప
గంజుగొంది అన్నేంత్‍ అప్ప ।। 4 ।।
ఎల్లా ఇడుప్‍ అన్నెంత్‍ అప్ప
ఎల్లా ఇడుప్‍ అన్నెంత్‍ అప్ప ।। 4 ।।
కైత చీపుర్‍ అన్నెంత్‍ అప్ప
కైత చీపుర్‍ అన్నెంత్‍ అప్ప ।। 4 ।।
రంథ రాటి అన్నెంత్‍ అప్ప
రంథరాటి అన్నెంత్‍ అప్ప ।। 4 ।।
అనుంఙ రంథ కరపే అప్ప
అనుంఙ రంథ కరపే అప్ప ।। 4 ।।
అనుంఙ రంథ వారేదే అప్ప
అనుంఙ రంథ వారేదే అప్ప ।। 4 ।।
నీవే ఇడుతే కరన్స్ తప్ప
నీవే ఇడుతే కరప్స్ తప్ప ।। 4 ।।
తెలుగు అర్థం :
పెళ్ళికూతురు (నోవ్రీ) ఉద్దేశించి మహిళలు పాడే పాట ఇది. పెండ్లికూతురు అత్త ఇంటి దగ్గర ఏ విధంగా ఉండాలి అనేది ఈ పాట ఉద్దేశ్యం.
మామా…మామా అంటుంది పెళ్ళికూతురు
మామా మామా ఎందుకు అన్నావ్‍ పెళ్ళికూతురా!
మామా మీ ఇంటికి వచ్చాను
మీ ఇంటి ముందు ఉన్నాను
తలుపులు తీయండి మామా
తలుపులు తెరవండి అత్తమ్మ
పెళ్ళికూతురా లోపలికి రావమ్మ
పెళ్ళికూతురా లోపలికి రావమ్మ
ఇంట్లోని పని మొత్తం నేనె చేస్తానమ్మ
ఇంట్లోని వస్తువులన్ని జాగ్రత్తగా చూస్తానమ్మ
మీ ఇల్లు నా ఇల్లు అత్తమ్మ
తలుపులు తెరవండి అత్తమ్మ.
మరో పాట : (కోడలుకు అత్త పనులు చెప్పుట)
రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రే రేల రేల రేల రేల
బసి ఇంన్ద్ బసి బసి ఇంన్ద్ బసి అప్ప
బసి ఇంన్ద్ బసి బసి ఇంన్ద్ బసి అప్ప ।। 4 ।।
తనుంఙ బసి ఇంతివే అప్ప
తనుంఞ బసి ఇంతివే అప్ప ।। 4 ।।
తొలె పొత్‍ కుగాద్‍ బసి, తొలెపోత్‍ కుగాద్‍ బసి
తొలె పోత్‍ కుగాద్‍ బసి తొలెపోత్‍ కుగాద్‍ బసి ।। 4 ।।
పోత్న్ సప్పుడ్‍ వినవె పోత్న్ సప్పుడు వినేవే బసి
పోత్స్ సప్పుడ్‍ వినేవే పోత్స్ సప్పుడు వినేవే బసి ।। 4 ।।
సడ్గాన సొల్లుతొదెవె సడ్గాన సొల్లుతొదెవె బసి
సడ్గాన సొల్లుతొదెవె సడ్గాన సొల్లుతొదెవె బసి ।। 4 ।।
సర్విమేరమ్‍ సెరెవె సర్విమేరమ్‍ సేరెవే బసి
సర్విమేరమ్‍ సెరెవె సర్విమేరమ్‍ సేరెవే బసి ।। 4 ।।
కేయుగెట్ట లోడెవే కేయుగెట్ట లోడేవె బసి
కేయు గెట్ట లోడేవే కేయుగెట్ట లోడేవె బసి ।। 4 ।।
పోయ్‍ మేరం సెరెవే పోయ్‍ మేరం సెరెవె బసి
పోయ్‍ మేరం సెరెవే పోయ్‍మేరం సెరెవె బసి ।। 4 ।।
పోయుత బుగ్గిన్‍ ఉడ్పెవె పోయుత బుగ్గిన్‍ ఉడ్పెవె బసి
పోయుత బుగ్గిన్‍ ఉడ్పెవె పోయుత బుగ్గిన్‍ ఉడ్పెవె బసి ।। 4 ।।
పోయునివే మేగ్గెవే పోయునివే మేగ్గెవే బసి
పోయునివే మేగ్గెవే పోయునివే మేగ్గెవే బసి ।। 4 ।।
పోయులే కాలే మొక్కెవె పోయులే కాలె మొక్కెవె బసి
పోయులే కాలే మొక్కవె పోయులే కాలె మొక్కెవె బసి ।। 4 ।।
పోయ్‍ మేరం సెరెవె పోయ్‍ మేరం సెరెవె బసి
పోయ్‍ మేరం సెరెవె పోయ్‍ మేరం సెరెవె బసి ।। 4 ।।
చీపుర్‍ మేరం సెరెవె చీపుర్‍ మేరం సెరెవె బసి
చీపుర్‍ మేరం సెరెవె చీపుర్‍ మేరం సెరెవె బసి ।। 4 ।।
చీపుర్‍ కాలె మొక్కెవె చీపుర్‍ కాలె మొక్కెవె బసి
చీపుర్‍ కాలె మొక్కెవె చీర్‍ కాలె మొక్కెవె బసి ।। 4 ।।
కెయ్దే చీపుర్‍ సుమ్మెవే కెయ్దే చీపుర్‍ సుమ్మేవే బసి
కెయ్దే చీపుర్‍ సుమ్మెవే కెయ్దే చీపుర్‍ సుమ్మేవే బసి ।। 4 ।।
ఎల్లానైస కురియదే ఎల్లానైస కురియదే బాసి
ఎల్లానైస కురియదే ఎల్లానైస కురియదే బాసి ।। 4 ।।
బొయ్దనైస కురియదే బొయ్దనైస కురియదే బాయి
బొయ్దనైస కురియదే బొయ్దనైస కురియదే బాయి ।। 4 ।।
కయ్యుత్‍ సర్వి సుమ్మద్‍ కయ్యుత్‍ సర్వీ సుమ్మద్‍ బాయి
కయ్యుత్‍ సర్వి సుమ్మద్‍ కయ్యుత్‍ సర్వీ సుమ్మద్‍ బాయి ।। 4 ।।
నువిత పావే సేరదే నువిత పావే సెరదే బాయి
నువిత పావే సేరదే నువిత పావే సెరదే బాయి ।। 4 ।।
సర్విన్‍ ఉటప్సనన్సదే సర్విన్‍ ఉటప్పసన్సద్‍ బాయి
సర్విన్‍ ఉటప్సనన్సదే సర్విన్‍ ఉటప్పసన్సద్‍ బాయి ।। 4 ।।
సర్విన్‍ నొడుసన్‍నన్సదే సర్విన్‍ నోడుసన్‍నన్సదే బాయి
సర్విన్‍ నొడుసన్‍నన్సదే సర్విన్‍ నోడుసన్‍నన్సదే బాయి ।। 4 ।।
రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల
రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల ।।4।।
తెలుగులో అర్థం :
కొత్త పెళ్ళి కూతురు (కోడలు)కు అత్తమ్మ పని చెప్పే విధానం. పెళ్ళికూతురా పెళ్ళికూతరా అంటుంది అత్తమ్మ. ఎందుకు అత్తమ్మ అన్నవే కోడలా…
కోడికూత వినిపించుతుంది లే కోడలా, కోడి చప్పుడు విను. త్వరగా .. బిందెదగ్గరికి వెళ్ళు. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుగు, పొయ్యి దగ్గరకు వెళ్ళి పొయ్యి కాళ్ళు మ్రొక్కు. పొయ్యిలో ఉండే బుగ్గిని పారేయ్‍. పొయ్యిని శుభ్రం చేయ్‍. చీపుర్‍ దగ్గర వెళ్ళు. చీపుర్‍ కాళ్ళు మొక్కు. చీపుర్‍ చేతిలో పట్టి, ఇంటి శుభ్రం చేసి బయటికి వెళ్ళు. చేతిలో బిందె పట్టి బావి దగ్గరి వెళ్ళు. బిందెను చక్కగా శుభ్రం చేసి నీళ్ళు పట్టుకొని రా.. పొద్దు వెళ్ళుతుంది. అని అత్తమ్మ పని చెప్పే పాట.


-ఆత్రం మోతీరామ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *