యునెస్కో వరల్డ్ హెరిటేజ్‍ వాలంటీర్‍ కాంపైన్‍


ప్రపంచ వారసత్వాన్ని పెంపొందించడం, వారసత్వ పరిరక్షణ మరియు సంరక్షణ చేపట్టడానికి యువతను ప్రోత్సహించి, భాగస్వామ్యం చేయడం ద్వారా యువత దృఢమైన క్రియాశీలక పాత్ర పోషించాలి అనే సంకల్పంతో యునెస్కో (UNESCO) 2008లో వరల్డ్ హెరిటేజ్‍ వాలంటీర్‍ (WHV) కార్యక్రమాన్ని ప్రారంభించింది. జాతీయ, అంతర్జాతీయ వాలంటీర్లను భాగస్వాములుగా చేస్తూ, యువత, స్థానిక కమ్యూనిటీను భాగస్వాములు చేయడం, వారిలో బాధ్యతా భావాన్ని ప్రేరేపించడంలో స్థానిక సమాజిక సంస్థలు చురుకుగా పాల్గొనే విధంగా ఉత్తేజపరచడం కాంపైన్‍ ముఖ్య ఉద్దేశం.


25 జూలై 2021న, ‘‘కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయం, తెలంగాణ’’. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన సందర్భంగా, 2022 నుండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్‍ వాలంటీర్‍ క్యాంప్‍ (WHV Campaign)ను (WHV)-Kakatiya Rudreshwara (Ramappa) Temple Campaign ఆలయం ప్రాంగణంలో నిర్వహిస్తూంది. రుద్రేశ్వర (రామప్ప) ఆలయం కాకతీయ శైలి ఆలయ నిర్మాణ శైలికి ఒక కళాఖండం, రాతి శిల్పకళ మరియు ఇంజనీరింగ్‍లో చాతుర్యం యొక్క ప్రత్యేక కలయికకు ప్రాతినిధ్యం వహిస్తుంది.


ఈ సంవత్సరం 2023లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్‍ ఎడ్యుకేషన్‍ పోగ్రామ్‍ (UNESCO World Heritage Programme) కాకతీయ హెరిటేజ్‍ ట్రస్ట్ (KHT) Prof. యం. పాండురంగారావు గారి ఆధ్వర్యంలో వరల్డ్ హెరిటేజ్‍ వాలంటీర్‍ (WHV) కార్యక్రమాన్ని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయం వాలంటీర్‍ కాంపైన్‍ – 2023, పాలంపేట ( Kakatiya Rudreshwara (Ramappa) Temple Campaign -2023, Palampet)పేరిట 02 అక్టోబర్‍ 2023 నుండి 13 అక్టోబర్‍ 2023 వరకు నిర్వహించబడింది.


కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రతినిధులు ఆలయ వైవిధ్యాన్ని, ఇంజినీరింగ్‍ అంశాలు, గొప్ప కాకతీయుల నిర్మాణ సాంకేతికత. ఆర్ట్, ఆర్కిటెక్చర్‍, జియో గురించి వారి అవగాహనను పెంపొందించడమే కాక హెరిటేజ్‍ నడక, వారసత్వ తరగతులు, క్విజ్‍లు, స్థానిక యువత, పాఠశాల విద్యార్థులు మరియు కమ్యూనిటీతో వంటకాలు, పెయింటింగ్‍లు మరియు ప్రదర్శన కళలు అవగాహన పెంచే చర్యలు చేపట్టారు.


వరల్డ్ హెరిటేజ్‍ వాలంటీర్స్ కాంపైన్‍-2023 (WHV Campaign-2023) యొక్క థీమ్‍ (theme)వర్క్ ఆన్‍ ది ఫ్యూచర్‍ – ప్రపంచ వారసత్వం (Work on the Future-World Heritage).


Prof.Er.వేదకుమార్‍ మణికొండ, చైర్మన్‍, దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‍ (Resource Person)గా పాల్గొని వారసత్వరక్షణ, పరిరక్షణపై ఉపన్యసించడానికి ఆహ్వానించబడ్డారు.


ఈ పాండవుల గుట్ట Heritage Visit కార్యక్రమం కాకతీయ హెరిటేజ్‍ ట్రస్టీలు ప్రొఫెసర్‍ ఎం.పాండురంగారావు, మరియు శ్రీ. జె.శ్రీధర్‍ రావుగార్లు నిర్వహించారు. ఇందులో తెలంగాణ పర్యాటక శాఖ, పురావస్తు శాఖ ప్రతినిధులు, వలంటీర్లు తదితరులు పాండవుల గుట్టను సందర్శించారు.

  • దక్కన్‍న్యూస్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *