కుమారయ్య (జస్టిస్)
ఆయన జీవితాన్ని సమున్నతంగా గెలుచుకున్న న్యాయ కోవిదుడు జనధర్మం కోసం అత్యున్నత న్యాయ పీఠాన్ని అధిరోహించిన బహుజనుడు. సత్వర న్యాయం కోసం పరితపించిన న్యాయమూర్తి. నిరాడంబర జీవితం ఆయన ఆచరణ. ఆయన జస్టిస్ నాంపల్లి కుమారయ్య, జగిత్యాల జిల్లా, (అప్పటి కరీంనగర్ జిల్లా) కొడిమ్యాల మండల కేంద్రంలో శాలివాహన దంపతులైన నర్సింలు లక్ష్మమ్మలకు ఆయన 15.6.1901లో జన్మించారు. పని చేస్తేనే బతుకుతెరువు అయిన కుటుంబంలో పుట్టి అంచెలు అంచెలుగా విద్యార్హతలు సాధించారు. కుమారయ్య ఏ తరగతిలో ఉన్న ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడు అయ్యేవాడు. ఆయన విద్యాదాహాన్ని గమనించిన …









