March 1, 2020

అప్పుడప్పుడు – 12

అప్పుడప్పుడు – ఏడేడు సముద్రాలు దాటి
ఏడేడు కొండలు గడిచి
ఏడేడు మంచు పర్వతాలు చుట్టి
ఏడేడు ఖండాలు పారి
ఏడేడు దుఖ్ఖపర్వతాలు
ఏడేడు సంతోష శిఖరాలు
ఏడేడు సంగీత సరస్సులు
ఏడేడు మానవ విస్పోటనాలు
ఏడేడు జీవజాల మాయాజాలాలు
ఏడేడు ప్రకృతి జనన రహస్యాలు
ఏడేడు మానవ మానసిక సరిగమలు
ఏడేడు సిద్ధాంత రాద్దాంతరాలు

అప్పుడప్పుడు – 12 Read More »

మనిషి భావాలకు రంగులద్దిన వర్ణధారి విజయ్‍కుమార్

దేశవిదేశాల్లో వందకుపైగా చిత్రకళా ప్రదర్శనలు

మనిషిలోని సంఘర్షణకు అద్దం పట్టే మనోజ్ఞ చిత్రాలను గీసి ఔరా అనిపిస్తున్నారు ప్రముఖ చిత్రకారులు విజయ్‍ కుమార్‍. తన భావాలకు అనుగుణంగా రంగులు అద్దడం, ప్రకృతికి, మనిషికి విడదీయరాని సంబంధం ఉందంటూ మనిషిపడే తపన, ఎదుర్కొనే మానసిక సంఘర్షణలను ప్రకృతిలో వెతికి వైవిధ్యమైన చిత్రాలు గీయడం వంటివి ఆయన ప్రతిభను …

మనిషి భావాలకు రంగులద్దిన వర్ణధారి విజయ్‍కుమార్ Read More »

కొలాము గిరిజనుల పెండ్లి – పాటలు

కొలాం సంప్రదాయ వివాహంలో కొన్ని ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి.
కొలాం వివాహ వ్యవస్థలో వరకట్నం అనేది ఉండదు. వరుడు గృహం వద్దనే వివాహం జరుగుతుంది. వివాహానికి అనేక దూర ప్రాంతాల వారిని ఆహ్వానించుతారు. ఆహ్వాన ఆనవాలుగా పసుపుతో కలిపిన జొన్న ధాన్యాలను తలూవల్‍ (అక్షింతలు)గా వారికి అందజేస్తారు.
ఊరిలో కళ్యాణ మండపం నిర్మించడానికి గ్రామంలోని ప్రజలందరు …

కొలాము గిరిజనుల పెండ్లి – పాటలు Read More »

మంచి సమాజం కోసం గొప్ప సాహిత్యం అవసరం

 తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‍ నందిని సిధారెడ్డి
చిక్కడపల్లి సెంట్రల్‍ లైబ్రరీలో బడిపిల్లలు రాసిన బాలచెలిమి కథల పుస్తకాలు ఆవిష్కరణ

మెదళ్లను కదలించే శక్తి ఒక్క సాహిత్యానికి మాత్రమే ఉంటుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‍ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ సంయుక్తాధ్వర్యంలో తెలంగాణ బడి …

మంచి సమాజం కోసం గొప్ప సాహిత్యం అవసరం Read More »

పిల్లలను సాహిత్యంవైపు మళ్లించాలి : తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‍ నందిని సిధారెడ్డి

హిమాయత్‍నగర్‍ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బాలచెలిమి 23వ ముచ్చట్లు

బాల చెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ సంయుక్తాధ్వర్యంలో ‘బాలచెలిమి’ తెలంగాణా బడి పిల్లల కథలు తెలుగు రాష్ట్రాల బాల సాహితీవేత్తలు, చిత్రకారులు, బాలవికాస కార్యకర్తలు-అంతరంగాలు అనే అంశంపై 23వ బాలచెలిమి ముచ్చట్లు హిమాయత్‍నగర్‍లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్‍ పాఠశాలలో జనవరి 29న జరిగింది. ఈ …

పిల్లలను సాహిత్యంవైపు మళ్లించాలి : తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‍ నందిని సిధారెడ్డి Read More »

జీదిమాజా ఒక ప్రపంచ కవి

2018 అక్టోబర్‍లో చైనాలోని బీజింగ్‍ నార్మల్‍ యూనివర్సిటీ వారి ఆహ్వానం మేరకు నేను చైనా వెళ్ళాను. 22 సాయంత్రం స్వాగత విందు (welcome Banquet) లో మొదటిసారి చైనీస్‍ మహాకవి జీదిమాజా (Jidi Majia)ను చూశాను. మనిషి స్ఫురద్రూపి, అందగాడు. ఆయన సాన్నిధ్యం వల్ల కడుపుకే కాదు కంటికీ విందు చేకూరినట్టనిపించింది.


జీదిమాజా చైనాలోని 55 …

జీదిమాజా ఒక ప్రపంచ కవి Read More »

సంస్కృత సాహిత్యంలో డా. పెన్నా మధుసూదన్‍ సృజనాత్మక, పరిశోధనా వైదుష్యం

2019 సంవత్సరం వెళ్తూ వెళ్తూ తెలుగువారి విద్వత్తును ప్రశంసిస్తూ సంస్కృత భాషలో ‘ప్రజ్ఞాచాక్షుషం’ కావ్యాన్ని రచించిన ఆచార్య పెన్నా మధుసూదన్‍కు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నార్కట్‍పల్లి ప్రాంతవాసి మధుసూదన్‍ విద్యాయానం, సాహిత్య వ్యాసంగం అనేక మలుపులు తిరుగుతూ సాగింది. గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక విద్యను పూర్తి …

సంస్కృత సాహిత్యంలో డా. పెన్నా మధుసూదన్‍ సృజనాత్మక, పరిశోధనా వైదుష్యం Read More »

మదర్స్ డే – అమ్మల దినం

గిరి గాడొక్కడే చెత్త కుండీ నానుకొని గుడ్డె పొడుచుకొని కూలబడిండు. వానికెడమ వైపున రెండు గున్న పందులు తోక లూపుకుంటు ఆహారం కోసం అటు ఇటు తిరుగుతున్నై. కుడి వైపున ఒక బక్క కుక్క ముందలి కాళ్ళు చాపి ఒక దానిపై ఒకటి వేసుకొని గదుమ నానించి ఈ ప్రపంచ చింత తనకేమి పట్టనట్లు చూస్తూ …

మదర్స్ డే – అమ్మల దినం Read More »

ప్రాణం వాసన.. సమాజపు చైతన్య సువాసన..

నేడు మనిషి అన్ని రంగాలలో అభివృద్ధి పధంలో సాగుతున్నాడు, కానీ నేటి సమాజంలో మానవీయ విలువలు, ఆత్మీయత కనుమరుగవు తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై బంధాలు, అనుబంధాలు పూర్తిగా దెబ్బతిని కుటుంబ. వ్యవస్థ నేడు అట్టడుగు స్థాయికి చేరింది.ఈ విపత్కర పరిస్థితిని మార్చగ లిగేది మనుషుల్లో చైతన్యం తెచ్చేది సాహిత్యం …

ప్రాణం వాసన.. సమాజపు చైతన్య సువాసన.. Read More »

రాజును బంధించిన చెరసాల ‘సీతారాంబాగ్‍ దేవాలయం’


అడుగడుగునా అనేకానేక సతత హరిత, సప్త రంగుల తీరున్నొక్క, ఫల పుష్ప సుగంధ భరిత ఉద్యానవనాలు, తుమ్మెదల జుంకారపు ధ్వనులు ప్రతిధ్వనించే పూదోటలు, పొదరిండ్ల వలన ఆ బంగారు దినాలలో భాగ్య నగరాన్ని ‘‘భాగ్‍ నగర్‍’’ అని కూడా అనేవారు. నిజంగానే అదొక సార్థక నామధేయం. భాగ్‍ల పేరుతోనే అనేకానేక బస్తీలు అవతరించాయి. ఉదాహరణకు సీతారాం …

రాజును బంధించిన చెరసాల ‘సీతారాంబాగ్‍ దేవాలయం’ Read More »