ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ ఏమిటీ?
ముప్పై ఏళ్ల నా జర్నలిజం జీవితంలో సగభాగం హైదరాబాద్ నగరంపైనే రిపోర్టింగ్ చేశాను. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆరేళ్లపాటు హైదరాబాద్ రిపోర్టింగ్ బ్యూరో ఛీప్‍గా పనిచేశాను. ఈ సమయంలో హైదరాబాద్ నగర చరిత్రను విభిన్న కోణాల్లో ‘వార్త’ దినపత్రిలో ప్రత్యేక కథనాలుగా మలిచాము. అప్పుడే హైదరాబాద్ చరిత్రపై నాకు మక్కువ పెరిగింది. పుస్తకాలుగా తీసుకురావాలని అనుకున్నాను. శాసనసభ పరిధిని ఎంచుకోవడానిగల కారణం?ఇంగ్లీష్, ఉర్దూలలో హైదరాబాద్‍పై వెయ్యికిపైగా పుస్తకాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలుగులో కూడా …

