పర్యావరణ సంక్షోభం – పరిష్కారాలు
ప్రకృతి ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండదు. ఆరు ఋతువులూ ప్రభావితం చేస్తాయి. ఆకురాలడం నుంచి చివురు చిగురించి పరిఢవిల్లుతుంది. ఆరు ఋతువుల చకభ్రమణంలోని విభిన్న వాతావరణాల్లోంచి వివిధ ప్రయోజనాలూ, మనుగడకు అవసరమైన స్థితులూ ప్రజలకు అందుతాయి. విలక్షణతలతో విలసిల్లడం ప్రకృతి సహజలక్షణం. ప్రకృతిలోని ఈ విలక్షతలకు భంగం కలిగించడం వల్లనే పర్యావరణ సంక్షోభం సంభవిస్తుంది. ప్రజల నిత్య జీవితాలకు భద్రత లేకుండా పోతుంది. ప్రకృతి విలక్షణతలకు భంగం కలిగించే అంశాలు బహుముఖీనమైనవి. ప్రకృతి విచ్ఛిన్నతకు మానవ తప్పిదాలే …









