సంగీత సేవలో మేటిగా దక్కన్ రేడియో
హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటి రేడియో స్టేషన్ దక్కన్ రేడియో. ఇది 1935 ఫిబ్రవరి 3న తన ప్రసారాలను ప్రారంభించిం ది. మొదట ఇది ప్రైవేటు బ్రాడ్‍కాస్టింగ్ స్టేషన్‍గా 200 వాట్స్ ట్రాన్స్మిటింగ్ పవర్‍తో మొదలైంది. ఉర్దూలో కార్యక్రమాలు ఉండేవి. ఆబిడ్స్లోని చిరాగ్ అలీ లేన్‍లోని ‘అజామ్ మంజిల్’లో ఇది నెలకొని ఉండింది. చిరాగ్ అలీ కుటుంబ సభ్యులే దీన్ని నిర్వహించే వారు. రేడియో ప్రసారాల సాంకేతికతను వినియోగించుకోవడంలో హైదరా బాద్, భారతదేశంలోని ఇతర నగరాలకు దీటుగా ఉండిందని …









