Author name: deccanland

అన్నదాతకు అందలం


మట్టిని నమ్మిన రైతుకు.. ప్రజలను నమ్మిన రాజకీయ పార్టీకి ఓటమి లేదు :

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‍రెడ్డి


నాటి సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం కుదేలు అయింది, వివక్షకి గురైంది. నీళ్లు ఉన్నా కూడా మనకు ఇవ్వలేదు. చెరువులు బావులపై ఆధార పడాల్సిన పరిస్థితి ఉండేది. సాగునీరు కోసం కృష్ణ గోదావరిలపై ఎలాంటి …

అన్నదాతకు అందలం Read More »

వెదురులో ఎంతెంతో సృజనాత్మకత


కళకు, కులానికి మధ్య అనుబంధం వేల ఏళ్ళుగా కొనసాగుతూనే వస్తోంది. ఒక సృజనాత్మకత కళ పేరు చెబితే కులం గుర్తుకురావడం, కులం పేరు చెబితే ఆ కళ సృజనాత్మకత గుర్తుకు రావడం సహజమే. ఒకప్పుడు పారిశ్రామిక విప్లవానికి ముందు గ్రామాల్లో ప్రజలు చేతివృత్తులపై ఆధారపడి గౌరవంగా జీవనం కొనసాగించేవారు. ఉమ్మడి కుటుంబంలో చిన్నా, పెద్దా అంతా …

వెదురులో ఎంతెంతో సృజనాత్మకత Read More »

తెలంగాణ ప్రాజెక్టులపై పసలేని విమర్శలు


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. తొలుత అనాదిగా తెలంగాణ వ్యవసాయానికి, గ్రామీణ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థకు ఆదరవులుగా ఉన్న గోలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్దరించడానికి మిషన్‍ కాకతీయ పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినప్పటికీ ప్రభుత్వాలు భూసేకరణ జరపకపోవడం, నిధులు సమకూర్చకపోవడం, పర్యావరణ, అటవీ …

తెలంగాణ ప్రాజెక్టులపై పసలేని విమర్శలు Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 8 ప్రకృతే శాసిస్తుంది!! భూగోళమే ఓ శాస్త్రీయ క్షేత్రం!



(గత సంచిక తరువాయి)

మొదటి దశ : వాయురూపంలో అతివేడిగా వున్న గోళం, చల్లబడుతున్న క్రమంలో పై భాగాల్లో అతిశీతల మంచు, కొంత మేర వివిధ వాయువుల సమ్మేళనంతో వాతావరణం, దీంతో నేల, జీవపదార్థం ఆవిర్భవించడం జరిగింది. భూభ్రమణంతో ఈ పరిణామాలు వేగవంతం కావడం జరిగింది.
రెండో దశ : ఈ దశలో వాయువులలోని వివిధ …

ప్రకృతే నియంత్రిస్తుంది! 8 ప్రకృతే శాసిస్తుంది!! భూగోళమే ఓ శాస్త్రీయ క్షేత్రం! Read More »

కోర్టు వాదనల్లో సాహిత్యం..


న్యాయవాదులూ న్యాయమూర్తుల్లో కవులూ రచయితలూ తక్కువ. కానీ చాలా మంది న్యాయవాదులకి న్యాయమూర్తులకి సాహిత్యం అంటే మక్కువ. సాహిత్యం మీద ఇష్టం వున్న న్యాయ వాదులు కోర్టుల్లో వాదనలు చెప్పేటప్పుడు కొన్ని సందర్భాలలో కవితా చరణాలను ఉదహరిస్తూ వుంటారు. మరి కొంతమంది చిన్న కథలనూ ఉదహరిస్తూ వుంటారు.
వానదల్లోనే కాదు, న్యాయమూర్తులకి, న్యాయవాదులకి మధ్యన జరిగే …

కోర్టు వాదనల్లో సాహిత్యం.. Read More »

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ


(గత సంచిక తరువాయి)

పశువుల ఫారాల నిర్మాణం ఎలా ఉండాలి?
ఫారం నిర్మాణం : పశువుల ఫరాల్ని ఎంపికచేసిన స్థలంలో ఇ, యు, ఎల్‍, సి, ఎఫ్‍ అక్షరాలలాగా నిర్మించుకుంటే, పర్యవేక్షణ సులభంగా ఉంటుంది.
పశువుల ఫారాల్ని సూర్యకిరణాలు డైరక్టుగా పడకుండా తూర్పు-పడమర దిశలో నిర్మించాలి. కొన్నిసార్లు వాతావరణం, ప్రాంతాన్ని దృష్టిలో వుంచుకొని కూడా దిశను …

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ Read More »

కళావరు రెండు


గుహనిండా చెల్లా చెదరుగా పడి ఉన్న రాళ్ళ మధ్య వాళ్లు నలుగురూ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నించున్నారు. గుహ బయట ఉన్న రాళ్ళు, రప్పలు, తుప్పలు, ఆకుపచ్చని వెలుగులో తళ తళలాడిపోతున్నాయి. ఆ రాళ్ళ మధ్య వాళ్ళు వచ్చిన అంతరిక్ష నౌక ‘పినాకిని’ నిశ్చలంగా ఉంది. గుహ బయట వాళ్ళకు ఎదురుగా పర్వతంలా ఉన్న ఒక …

కళావరు రెండు Read More »

పాఠశాలల పునఃప్రారంభం అభినందనీయం


దాదాపు సంవత్సరం తర్వాత పిల్లలు బడిబాట పట్టారు. కరోనాతో అతలాకుతలమైన అనేక రంగాలలో విద్యారంగం ప్రధానమైనది. లాక్‍డౌన్‍ ఎత్తివేసిన తరువాత ఉత్పత్తి, ఉపాధి, పాలనా రంగాలలో వీలును బట్టి వరుస వారీగా కార్యకలాపాలు మొదలైనప్పటికీ, విద్యారంగంలో త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోయాయి. ఆన్‍లైన్‍ క్లాసులు అన్ని వర్గాల విద్యార్థులు ఉపయోగించుకోలేక పోయారు. ఆన్‍లైన్‍ క్లాసులు …

పాఠశాలల పునఃప్రారంభం అభినందనీయం Read More »

కొత్తూరు సీతయ్య గుప్త


శంనోమిత్రః శంవరుణ।। శంనో భవత్పర్యమా
శంనో ఇండ్రో బృహస్పతిః।। శంనో విష్ణు
విష్ణురురుక్రమః

దేశభక్తి, ప్రజాహిత చింతన మూర్తీభవించిన నిస్వార్థ నిరాడంబర ప్రజా సేవకులు శ్రీ కొత్తూరు సీతయ్య గుప్త. వారు పుట్టింది అతి సామాన్య కుటుంబంలో, ఒక చిన్న వ్యాపార సంస్థలో ఉద్యోగిగా జీవితం ఆరంభించారు. ఏ వ్యాపార సంస్థలో పనిచేసినా లక్షలు ఆర్జించే …

కొత్తూరు సీతయ్య గుప్త Read More »

పక్కా హైదరాబాదీ శ్రీవాసుదేవరావు!


‘దస్త్రమ్‍’ పేరిట తెలంగాణ కథలను వెతికి వెలుగులోకి తెస్తున్న క్రమంలో 2002లో వాసుదేవరావు కనబడ్డాడు. అప్పటి నుంచీ ఆయన గురించి ఏ సమాచారం దొరికినా క్రోడీకరించుకోవడం అలవాటయింది. ఆయన కథలను మళ్ళీ మళ్లీ చదివాను. శ్రీవాసుదేవరావు రాసిన కథల్లో హైదరాబాదీతనం ఉన్నది. రుబాబుగా, డాబుగా, దర్పంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా ఉండే హైదరాబాదీ (ఎనుకటి) మనస్తత్వం కథల్లో …

పక్కా హైదరాబాదీ శ్రీవాసుదేవరావు! Read More »