ప్రకృతే నియంత్రిస్తుంది! 7 ప్రకృతే శాసిస్తుంది!! విజ్ఞానశాస్త్ర ప్రయోగాలు వెన్నెల్లో విహారం కాదు!!
ఓ నిజాన్ని గుర్తించడానికి, గుర్తించిన దాన్ని సిద్ధాంతీక రించడానికి, ఆ సిద్దాంతాన్ని ప్రయోగ పూర్వకంగా నిరూపించడానికి, నిరూపించిన దానికి సామాజిక ప్రయోజనం చేకూర్చడానికి విజ్ఞాన శాస్త్రవేత్తలు, సామాజిక తత్వవేత్తలు జీవితాల్నే ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వెంటాడుతుంటే చుట్టూ వుండే సమాజం పిచ్చివారిగా ముద్రవేస్తుంది. నిద్రలేమి, ఆరోగ్య సమస్యలు, సమస్యకు దొరకని గమనం కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారు తాయి. ఇలా ఎంతోమంది శాస్త్రజ్ఞులు సామాజిక వికాసానికై, అభివృద్ధికై …









